For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందుకే నిర్మాతగా మారాను.., సునీల్ విషయంలో నాకు అది అనవసరం: శంకర్

  |

  సినిమాల్లో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయేవాళ్లూ ఉంటారు. దశాబ్దం గడిచినా సరే, హీరోగా ఇంకా సరైన హిట్టు పడనివాళ్లూ ఉంటారు. వెనక్కి తిరిగి చూసుకుంటే హీరోగా జనం మనల్ని అంగీకరించట్లేదా?.. లేక హీరో క్వాలిటీస్ మనలో లేవా? అన్న సందేహాలు కలగడం మాత్రం ఖాయం.

  సునీల్ మాత్రమే కనిపిస్తాడు..!

  ప్రస్తుతం ఇలాంటి డైలామాలోనే ఉన్న సునీల్.. మరోసారి '2 కంట్రీస్'తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సాధారణంగా ఫ్లాపుల్లో ఉన్న హీరో ముఖం కూడా చూడని పరిస్థితులు ఉన్న ఇండస్ట్రీలో.. దర్శకుడు శంకర్ మాత్రం సునీల్ తో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కించడం ఆశ్చర్యపరిచేదే. అయితే దానికి ఆయన చెబుతున్న కారణాలేంటో తెలుసా!.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

  సునీల్ మాత్రమే తట్టాడు:

  సునీల్ మాత్రమే తట్టాడు:

  మలయాళంలో సూపర్ హిట్టయిన '2 కంట్రీస్' సినిమాకు నిర్మాతలు నా సన్నిహితులే. సినిమా అక్కడ హిట్ అవడంతో తెలుగులో దాన్ని రీమేక్ చేయాలని నాకు వారు సలహా ఇచ్చారు. అలా.. ఈ సినిమాలోని దిలీప్ పాత్రకు ఎవరైతే బాగుంటుందా? అని ఆలోచించినప్పుడు తెలుగులో నాకు తట్టిన నటుడు 'దిలీప్' మాత్రమే.

  పాపం సునీల్.. మళ్లీ కమెడియన్‌గా.. ఆదుకొన్న క్లోజ్‌ఫ్రెండ్!

  అందుకే నిర్మాతగా:

  అందుకే నిర్మాతగా:

  తెలుగులో ఈ సినిమా రీమేక్ చేయడం కోసం నేనో నిర్మాతను కలిశాను. అయితే ప్రస్తుతం సునీల్ మార్కెట్ దెబ్బతిని ఉండటంతో.. నేను చెప్పినట్లు అమెరికాలో కాకుండా.. బ్యాంకాక్‍లో తీద్దామన్నారు. కానీ కథకు అది సెట్ అవదు. అందుకే నేనే నిర్మాతగా మారాను అని శంకర్ చెప్పుకొచ్చారు.

  హీరోగా నో హ్యపీ, త్రివిక్రమ్‌తో1000 కోట్ల మూవీ, చిరుకు వడ్డీతో ఇవ్వాలి : హీరో సునీల్

  వచ్చినా.. పోయినా..:

  వచ్చినా.. పోయినా..:

  ఒక నిర్మాత ఆలోచనలకు టెక్నీషియన్ ఆలోచనలకు గ్యాప్ ఉంటుంది. సినిమా వల్ల డబ్బులొచ్చినా పోయినా అది నాకే జరగాలన్న ఉద్దేశంతోనే నేనే నిర్మాతగా మారి సినిమా చేయాల్సి వచ్చింది.

  అది నాకు అనవసరం :

  అది నాకు అనవసరం :

  సునీల్ ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. ప్రతీ హీరోకు హిట్స్.. ఫ్లాప్స్ ఉంటాయి. కాకపోతే మన పాత్రకు ఒక నటుడు సరిపోతాడనుకున్నప్పుడు.. అతని ట్రాక్ రికార్డ్ గురించి పట్టించుకోకూడదు. ఎందుకంటే సినిమాకు రైట్ కాస్టింగ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి నాకు అది అనవసరం.

  శంకర్ ట్రాక్ రికార్డ్:

  శంకర్ ట్రాక్ రికార్డ్:

  దర్శకుడిగా శంకర్ ట్రాక్ రికార్డు మిగతా దర్శకుల కంటే భిన్నమైనదనే చెప్పాలి. ఫక్తు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కాకుండా సామాజిక ఇతివృత్తాల్ని తెరపై అద్భుతంగా చూపించడంలో ఆయన నేర్పరి.
  ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఎన్ కౌంటర్ ' 'శ్రీ రాములయ్య ' 'జయంమనదేరా ' 'భద్రాచలం ' 'ఆయుధం ' వంటి చిత్రాలు మంచి విజయాలు అందుకోవడంతో పాటు ఆయన దర్శకత్వ ప్రతిభను చాటాయి.

  ఈ సినిమాతో సునీల్.. :

  ఈ సినిమాతో సునీల్.. :

  ఇప్పటిదాకా సునీల్‌ను డైరెక్ట్ చేసిన దర్శకులకు శంకర్‌కు తేడా ఉంది. కాబట్టి.. సునీల్ హీరోయిజాన్ని శంకర్ కొత్తగా చూపిస్తారా?, లేక సునీల్ మీద ఎక్కువగా ఆధారపడకుండా తన దర్శకత్వంతో శంకరే మొత్తం భారాన్ని మోశారా?.. అన్నది సినిమా విడుదలైతే కానీ చెప్పలేం. ఒకవేళ ఈ సినిమాతో సునీల్ హిట్ సాధిస్తే మాత్రం.. ఆయన కెరీర్ కాస్త గాడిన పడ్డట్లే అని చెప్పాలి.

  English summary
  2 Countries is the latest and an upcoming movie of hero Sunil and this movie is slated for a release on 29th of December. 2 Countries movie is directed by N Shankar and this movie is the remake of Malayalam blockbuster movie of the same name.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X