»   » శంకర్ 'రోబో 2' ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

శంకర్ 'రోబో 2' ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రజనీకాంత్ 'రోబో' హిట్టయిన తరవాత 'రోబో 2' చేయాలని శంకర్‌ నిర్ణయించుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించడానికి రజనీకాంత్‌ సంసిద్ధత వ్యక్తం చేయలేదని టాక్‌. 'ఐ' తరవాత రజనీని ఎలాగైనా ఒప్పించాలనుకొన్నాడు శంకర్‌. కానీ రజనీకాంత్‌ మాత్రం 'రోబో 2'కి సిద్ధం కాలేదు. అందుకే ఈ ప్రాజెక్టుని అజిత్‌తో సెట్‌ చేయాలని చూస్తున్నాడు శంకర్‌.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అజిత్‌ కూడా శంకర్‌తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాడట. మొత్తానికి ఇప్పుడు 'రోబో 2' వీళ్లిద్దరి కాంబినేషన్‌కి ఓ రూపం ఇచ్చింది. ఈ చిత్రంలో కథానాయికగా ఐశ్వర్యరాయ్‌ నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అజిత్‌, ఐశ్వర్య ఇద్దరూ ద్విపాత్రాభినయం చేస్తారట. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలుస్తాయి. అలాగే ఈ కొత్త ప్రాజెక్టు ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 14న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Director Shankar's Robo 2 first look date

అలాగే... బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ఇందులో విలన్ పాత్ర పోషించనున్నట్లు సమాచారం. విలన్ పాత్రపై అమీర్ ఆసక్తి చూపుతున్నాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పలువురు బాలీవుడ్‌ హీరోలను పరిశీలించిన డైరెక్టర్‌ శంకర్‌ హీరో అమీర్‌ఖాన్‌ వద్ద తన అన్వేషణను ఆపినట్లు సమాచారం.

ఇక సినిమా స్క్రిప్ట్‌కు ఎంతో ప్రాముఖ్యతనిచ్చే అమీర్‌ఖాన్‌ శంకర్‌ చెప్పిన కథను ఎట్టకేలకు ఓకే చెప్పినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. 2010లో విడుదలై అద్భుతాలు సృష్టించిన 'రోబో'కు ఈ సినిమా కొనసాగింపు. అయితే అమీర్‌ఖాన్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కిస్తున్న 'రోబో-2' బాలీవుడ్‌ గతరికార్డులన్నింటిని చెరిపేస్తుందని సినీవర్గాల అంచనా.

English summary
As per sources Shankar is going to direct Ajith’s next film and the film is expected to be announced this Sunday, while first look is planned to be unveiled on February 14th.
Please Wait while comments are loading...