twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి సినిమాల్లో పెద్దగా లాభాలు తీసుకు రాని ఒకే ఒక్క మూవీ.. క్లారిటి ఇచ్చిన నిర్మాత

    |

    దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా వచ్చిన ఆ సినిమా బాలీవుడ్ జనాలను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రాజమౌళి కెరీర్ లో ఇప్పటివరకు ఓటమి అంటూ లేదని అందరికి తెలిసిన విషయమే. కానీ ఒక సినిమా మాత్రం ఆయన కెరీర్ లో అనుకున్నంతగా సక్సెస్ ఏమి కాలేదట. కేవలం బయటకు అది సూపర్ హిట్ మూవీ అని హైలెట్ చేశారు. ఇటీవల రాజమౌళితో ఒక సినిమాకు వర్క్ చేసిన సీనియర్ నిర్మాత ఆ విషయాన్ని తెలియజేశారు.

    సీరియల్ ద్వారా

    సీరియల్ ద్వారా

    దర్శకుడు రాజమౌళి మొదట శాంతి నివాసం అనే సీరియల్ ద్వారా దర్శకుడిగా బుల్లితెరలో వర్క్ చేశాడు. అప్పట్లో ఆ సీరియల్ కు మంచి గుర్తింపు లభించింది. కె.రాఘవేంద్రరావు శిష్యుడిగా రాజమౌళి మొదట్లోనే దర్శకేంద్రుడిని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఎడిటింగ్ వర్క్ కూడా నేర్చుకొని ఆ తరువాత కొన్ని రోజులు తన తండ్రి విజేయేంద్ర ప్రసాద్ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా కూడా వర్క్ చేయడం జరిగింది.

    నిర్మాతలు ఎగబడ్డారు

    నిర్మాతలు ఎగబడ్డారు

    ఇక రాజమౌళి మొదట డైరెక్ట్ చేసిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఆ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. రాజమౌళి మీద నమ్మకంతో ఆ సినిమాను కె.రాఘవేంద్రరావు మరొక నిర్మాతతో సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఇక ఆ తరువాత సింహాద్రి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ తరువాత రాజమౌళితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎగబడ్డారు.

    వరుస విజయాలు

    వరుస విజయాలు

    ఇక రాజమౌళి మూడవ సినిమా సై. ఆ తరువాత ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి 1 , బాహుబలి 2.. ఇలా వరుసగా బాక్సాఫీస్ హిట్స్ తో తన స్థాయిని పాన్ ఇండియా రేంజ్ వరకు పెంచుకున్నాడు. రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

    ఆ సినిమా సక్సెస్ కాలేదు

    ఆ సినిమా సక్సెస్ కాలేదు

    సాధారణంగా రాజమౌళి సినిమాల లిస్టు చూస్తే దాదాపు అన్ని సినిమాలు కూడా హిట్ అని అనుకుంటారు. కానీ ఒకే ఒక్క సినిమా మాత్రం నిర్మాతకు పెద్దగా లాభాలు అందించలేదు. అలాగని పెద్దగా నష్టాలను కూడా కలిగించింది కాదు. అదే సై సినిమా. నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా వచ్చిన ఆ సినిమాను ఏ.భారతి అనే డిస్ట్రిబ్యూటర్ నిర్మించారు.

    నితిన్ ను అనుకోలేదు..

    నితిన్ ను అనుకోలేదు..

    ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత భారతి అప్పట్లో సై సినిమా విశేషాలపై స్పందించారు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు అని అంతే కాకుండా ఆ సినిమాలో నితిన్ ను తీసుకోవద్దని కూడా కొన్నిసార్లు అనుకున్నట్లు తెలియజేశారు. సై సినిమా గురించి తెలిశాక పెద్ద స్టార్స్ తగో చేయాలని అనుకున్నాను. కానీ నితిన్ తండ్రితో పాటు నితిన్ కూడా మా ఇంటికి వచ్చి అలా చేయవద్దని అన్నట్లుగా భారతి తెలియజేశారు. ఇక ఆ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో రాజమౌళి నాతో మారో సినిమా చేయాలని అనుకున్నప్పటికి సెట్టవ్వలేదని భారతి వివరణ ఇచ్చారు.

    English summary
    Director ss rajamouli career biggest unprofitable movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X