twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR For Oscars: RRR ఆస్కార్ ప్రయాణం ప్రారంభం.. 15 విభాగాల్లో పరిశీలించాలంటూ ప్రచారం

    |

    దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన కళాఖండం RRR చిత్రం. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతి ఎల్లలు దాటింది. RRR మూవీకి వచ్చిన ప్రశంసలు చూసి కచ్చితంగా ఆస్కార్ కు నామినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ భారత్ తరఫున ఆస్కార్ అవార్డుల పోటికి అధికారిక ఎంట్రీకి గుజరాతీ చిత్రం ఛెల్లో షో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. దీని తర్వాత అనేక నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక తాజాగా RRR చిత్రాన్ని నేరుగా ఆస్కార్ కు పంపించేందుకు క్యాంపెయిన్ స్టార్ అయింది.

    అభిమానుల నుంచి నిరసనలు..

    అభిమానుల నుంచి నిరసనలు..

    భారత్ తరపున ఆస్కార్ అవార్డుల పోటీకి అధికారిక ఎంట్రీగా గుజరాతీ చిత్రం ఛెల్లో షో సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ప్రకటించడంపై సినీ అభిమానుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. రాజమౌళి దర్వకత్వం వహించిన RRR మూవీ ఆస్కార్ 2023 నామినేషన్‌కు ఎంపికవుతుందని భావించిన సినీ అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. ఛెల్లో షో సినిమా ఇప్పటికే నామినేషన్‌ను సాధించినప్పటికీ RRR ఆస్కార్ నామినేషన్ సాధించే పోటీలో ఉందనే వార్త ప్రస్తుతం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.

    ఆ చిత్రాలను పరిగణనలోకి తీసుకొంటారు..

    ఆ చిత్రాలను పరిగణనలోకి తీసుకొంటారు..

    అకాడమీ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచర్ ఫిలిం కేటగిరిలో నామినేషన్‌కు ముఖ్యంగా అమెరికాలో లేదా ఇంగ్లీష్‌లో రూపొందించే చిత్రాలను పరిగణనలోకి తీసుకొంటారు. అయితే ఇతర దేశాల్లో రూపొంది.. అమెరికాలో రిలీజైన సినిమాలను కూడా నామినేషన్‌కు స్వీకరించే నిబంధన ఉంది. ఈ క్యాటగిరిలో వివిధ దేశాల నుంచి ఉత్తమ చిత్రాలను నామినేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోమని కోరుతున్నారు. అయితే తమ దేశం తరఫున నామినేషన్‌ పంపే బాధ్యతను యూకేలో బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, ఇండియాలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అప్పగించారు.

    జోక్యం లేకుండా నేరుగా..

    జోక్యం లేకుండా నేరుగా..

    అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జోక్యం లేకుండా నేరుగా కూడా ఆస్కార్ అవార్డుకు నామినేషన్ కోసం పంపే వెసులుబాటు కూడా ఉంది. ఆస్కార్ బరిలో (95th Academy Awards) RRRను నిలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దిశగా RRR మూవీ యూనిట్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే FYC (For Your Consideration) క్యాంపెయిన్ మొదలు పెట్టింది. ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ కొన్ని థియేటర్లలో ఆడిని సినిమాలను ఆస్కార్స్ కు కన్సిడర్ చేసేందుకు పంపమని చెబుతోంది. అందులో భాగంగానే ఈ క్యాంపెయిన్ ప్రారంభమైంది.

    15 క్యాటగిరీల్లో RRR..

    ఈ పరిశీనలకు సంబంధించి ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ నటుడు (రామ్ చరణ్, ఎన్టీఆర్), ఉత్తమ సహాయ నటుడు (అజయ్ దేవగణ్), ఉత్తమ సహాయ నటి (అలియా భట్), ఉత్తమ సంగీత దర్శకుడు (ఒరిజినల్ స్కోర్)తోపాటు సౌండ్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా 15 క్యాటగిరీల్లో RRR సినిమాను కన్సిడర్ చేయాలంటూ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

    అంతులేని ప్రేమతో..

    ఈ క్యాంపెయిన్ పై రాజమౌలి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ ట్వీట్ చేశాడు. ''మా నటీనటుల, సాంకేతిక నిపుణులు చెమట ధారపోసి, ప్రేమతో ఆసక్తితో చేసిన పనిని ప్రేక్షకులందరి అంతులేని ప్రేమతో ఇక్కడికి తీసుకొచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో ప్రేమ పొందడం నిజంగా ఒక కలలా ఉంది. ఇక విధిరాత ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాం'' అని ట్వీట్ లో రాసుకొచ్చాడు.

    చివరి వరకు ఎవరైతే..

    అలాగే ఆస్కార్ కోసం RRR క్యాంపెయిన్ (RRR For Oscars) ప్రారంభమైన నేపథ్యంలో హాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ రస్ ఫిషర్ ''బెస్ట్ పిక్చర్ నామినీలను స్టేజిపై నిలబెట్టి చివరి వరకు ఎవరైతే నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తారో వాళ్లకు ఆస్కార్ ఇవ్వాలి'' అని ట్వీట్ చేశారు. ఈ ఐడియా నచ్చిందని కార్తికేయ నవ్వుతూ ట్వీట్ చేశాడు.

    English summary
    Director SS Rajamouli RRR Movie Unit Started For Your Consideration Campaign Over 95th Academy Awards Under 15 Categories.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X