»   » సంపూ నడిరోడ్డు మీద కట్ డ్రాయర్‌తో నటిస్తా అన్నాడు.. బూతులు తిట్టారు.. కొట్టారు.

సంపూ నడిరోడ్డు మీద కట్ డ్రాయర్‌తో నటిస్తా అన్నాడు.. బూతులు తిట్టారు.. కొట్టారు.

Posted By:
Subscribe to Filmibeat Telugu

హృదయ కాలేయం సినిమా సంచలన విజయాన్ని సాధించినప్పటికీ తమకు ఆనందం కలిగించలేదని, ఆ చిత్రం తనకు, హీరో సంపూర్ణేష్ బాబుకు ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చిందని దర్శకుడు స్టీవెన్ శంకర్ (సాయి రాజేశ్) ఇటీవల ఓ య్యూట్యూబ్ చానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. హృదయ కాలేయం సినిమా రిలీజ్ తర్వాత బయటకు వెళ్లాలంటేనే భయమేసేదని, ఎవరు తమపై దాడి చేస్తారో అనే భయం తమను వెంటాడేదని తన అనుభవాలను స్టీవెన్ శంకర్ వెల్లడించారు.

చాలా నీచంగా దుర్భాషలాడారు..

చాలా నీచంగా దుర్భాషలాడారు..

సినిమా విడుదలైన తర్వాత సిని పరిశ్రమలోని ఓ టాప్ కమెడియన్, డైరెక్టర్‌తో కలిసి ఓ సెవెన్‌స్టార్ హోటల్‌కు డిన్నర్‌కు వెళ్లాం. డిన్నర్ ముగిసిన తర్వాత వాష్ రూమ్ వద్ద కొందరు సంపూను చాలా నీచంగా దుర్భాషలాడారు. అయినా సంపూ పట్టించుకోకుండా వదిలేశారు. ఆ తర్వాత వారు తనతో కూడా గొడవ పడ్డారు. అక్కడ నా ముఖంపై గాయం కూడా అయిందని స్టీవెన్ శంకర్ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తమపై దాడి చేసిన వారికే వారు సపోర్ట్ చేశారు అని చెప్పుకొచ్చారు.

చెత్త సినిమా తీసి..

చెత్త సినిమా తీసి..

సంప్రదాయ సినిమా నిర్మాణం, కథ, కథనాన్ని ఎంచుకొని ఓ చెత్త సినిమాను తీసి అందరి దృష్టిని ఆకర్షించాలని ఓ ప్రయత్నం చేశాం. తమిళ, మలయాళంలో వచ్చిన కొన్ని చిత్రాలు హృదయకాలేయానికి స్ఫూర్తి అని స్టీఫెన్ శంకర్ పేర్కొన్నారు. ఆ సినిమా తీసిన తర్వాత చాలా మంది ఫోన్లు చేసి బూతులు తిట్టేవారని, సోషల్ మీడియాలో చాలా ఛండాలమైన కామెంట్లు పెట్టేవారని తన అనుభవాలను తెలిపారు.

విచిత్ర వేషాధారణతో..

విచిత్ర వేషాధారణతో..

ఓ చెత్త కథను తయారు చేసుకొని హీరో కోసం వెతుకుతుండగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సంపూర్ణేశ్ బాబు కనిపించారు. విచిత్రమైన అతడి వస్త్రాధారణ, తీరు తనను చాలా ఆకట్టుకొన్నాయి. అందరికీ ఫోటో పంచుతూ అవకాశం ఇవ్వాలని అడుగుతూ సంపూ నా కంట పడ్డాడు. నా కథకు హీరో అతనే నేను ఫిక్స్ అయ్యాను. కానీ అతడు చేస్తాడా లేదా అనే సందేహం మొదలైంది.

అవమానాలకు గురి అయి..

అవమానాలకు గురి అయి..

ఒకరోజు అతడిని పిలిచి కథ చెప్పాను. కథ విన్న వెంటనే ఎప్పుడు మొదలు పెడుదాం అని సంపూ అడిగాడు. అయినా నాకు నమ్మకం కుదర్లేదు. అందుకే అతడికి పరిస్థితి వివరించా. ఈ సినిమా చేస్తే ఇక కెరీర్ ఉండకపోవచ్చు. బయట చాలా అవమానాలకు గురికావాల్సి ఉంటుంది. నీవు ఎప్పుడు ఎదుర్కొనని పరిస్థితిని చూడాల్సి వస్తుంది అని సంపూకు చెప్పానని స్టీవెన్ శంకర్ చెప్పాడు.

కట్ డ్రాయర్‌తో నటిస్తా..

కట్ డ్రాయర్‌తో నటిస్తా..

దాంతో నీవు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు. నీవు జూబ్లీహిల్స్ నడి రోడ్డు మీద బట్టలు విప్పేసి కట్ డ్రాయర్‌తో నటించమన్నా నటిస్తాను అని ధైర్యంగా చెప్పడంతో నాకు కొంత నమ్మకం కలిగింది. అప్పుడే కొన్ని షరతులు పెట్టాను. సినిమా పూర్తయ్యి విడుదలయ్యేంత వరకు ఏది చెపితే అది చేయాలని సూచించాను. అందుకు సంపూ కూడా పాటించాడు అని స్టీవెన్ శంకర్ వెల్లడించాడు.

పేర్లు అలా మార్చాం..

పేర్లు అలా మార్చాం..

సినిమా ప్రారంభానికి ముందే సొంత పేర్లను కాకుండా కొత్త పేర్లను పెట్టుకోవాలని అనుకొన్నాం. అందుకే నర్సింహాచారిని సంపూగా, తన పేరు సాయి రాజేశ్‌ను స్టీవెన్ శంకర్, ఇతర సాంకేతిక నిపుణుల పేర్లను కూడా మార్చడం జరిగిందని సాయి రాజేశ్ చెప్పారు.

English summary
Director Steven Shankar shares his experiences after Hrudayakaleyam movie release. He said, We were scared to go out in public. Many peoples scolded and targeted over phone and physically. Those moments are very horrible to us despite movie hit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu