twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నాన్నకు ప్రేమతో' నెగిటివ్ టాక్ పై సుకుమార్

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'నెగెటివ్‌టాక్ వస్తే సినిమా ఎందుకు ఆడుతుంది? బి.సి.కేంద్రాల నుంచి కూడా సినిమా చాలా బాగుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. టెర్మినేటర్ చిత్రం మన దగ్గరి బి.సి.సెంటర్లలో కూడా వందలరోజులు ఆడింది. టెక్నికల్, స్క్రీన్‌ప్లే అంశాల్ని పక్కనబెడితే ఆ సినిమాలోని ఎమోషన్‌తో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు' అంటున్నారు దర్శకుడు సుకుమార్. నాన్నకు ప్రేమతో కథలోని ఇంటిలిజెంట్ ఎలిమెంట్స్ వల్ల సినిమా కొన్ని వర్గాల వారికే చేరువయిందనే విమర్శలపై ఆయన ఇలా స్పందించారు.

    సుకుమార్ మాట్లాడుతూ...అలాగే నాన్నకు ప్రేమతో చిత్రంలోని ఎమోషన్, ఫాదర్ సెంటిమెంట్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. నా గత సినిమాలకు మా సొంత ఊరి నుంచి ఎప్పుడూ ఫోన్‌కాల్స్‌రాలేదు. కానీ ఈ సినిమా బాగుందంటూ వందలకాల్స్ వచ్చాయి. పరిశ్రమ నుంచి వి.వి.వినాయక్, వక్కంతం వంశీ, కొరటాల శివ ఫోన్ చేసి సినిమా అద్భుతంగా వుందని ప్రశంసించారు.

    సినిమా చూసి భావోద్వేగాల్ని ఆపుకోలేక ఏడుస్తూ బయటకు వచ్చామని చాలా మంది అన్నారు. 1 (నేనెక్కడినే) చిత్రాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఆవిష్కరించలేకపోయాననే అసంతృప్తి వుంది కానీ..నాన్నకు ప్రేమతో విషయంలో నా భావాల్ని అనుకున్న రీతిలో తెరకెక్కించానని భావిస్తున్నాను అని వివరించారు.

    Director Sukumar on Nannaku Pramatho Negitive talk

    ఇక సినిమా నిర్మాణ సమయంలో బి.సి.సెంటర్ల వారికి రీచ్ అవుతుందో లేదో అని భయపడలేదు. అలా అనుకుంటే ఇంత పెద్ద సినిమా చేసేవాణ్నికాదు. 1 సినిమా తీస్తున్నప్పుడు బి.సి. కేంద్రాల వారికి రీచ్ కాదేమోనని భయపడ్డాను. నాన్నకు ప్రేమతో కథలోని తండ్రి సెంటిమెంట్, సున్నితమైన భావోద్వేగాలతో ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారనిపించింది. అందుకే ఎటువంటి భయాల్లేకుండా ఈ సినిమా తీశాను అని చెప్పుకొచ్చారు.

    ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్‌ : రవీందర్‌, ఫైట్స్‌ : పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి, పాటలు : చంద్రబోస్‌, డాన్స్‌ : రాజు సుందర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుకుమార్‌.

    English summary
    Director Sukumar very happy with Nannaku Prematho Out put.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X