»   » ఆ అంశాలే ఉసిగొల్పాయి.. కసితో సినిమా తీశాను.. గల్ఫ్ దర్శకుడు సునీల్ కుమార్‌రెడ్డి

ఆ అంశాలే ఉసిగొల్పాయి.. కసితో సినిమా తీశాను.. గల్ఫ్ దర్శకుడు సునీల్ కుమార్‌రెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎడారి దేశాలకు వలస వెళ్ళిన లక్షలాది మంది వారి జీవన స్థితి గతులను, గల్ఫ్‌లో నివసిస్తున్న భారతీయులు, వారి భావోద్యోగాలను ఒక అందమైన ప్రేమ కథ నేపథ్యంగా తెరకెక్కిన ఉద్వేగభరిత, వినోదాత్మక చిత్రం గల్ఫ్. ఈ చిత్రం అన్ని హంగులను పూర్తి చేసుకొని జూలై రెండో వారంలో విడుదలకు ముస్తాబవుతున్నది. దుబాయ్, రసల్ కైమా, కువైట్ లాంటి గల్ఫ్ దేశాలలో విస్తృతంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ ఇమ్మడి అందించారు. మస్కట్, యూఏబీ విడుదల చేసిన ఆడియో టీజర్లకు విశేషంగా ఆదరణ లభించిందని చిత్రానికి రీ రికార్డింగ్ కూడా చక్కగా కుదిరింది. సిరాశ్రీ, కాసర్ల శ్యామ్, మాస్టార్జీలు అందించిన సాహిత్యం, అంజనా సౌమ్య, ధనుంజయ్, కే. యం. రాధాక్రిష్ణన్, దీపు, గీత మాధురి, హైమత్, మోహన భోగరాజు ల స్వరాలు, ఆడియోకి మరింత వన్నె తెచ్చాయి. జూలై ఒకటవ తారీఖున ఆడియో విడుదల చేయనున్నాం అని సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి తెలియచేసారు.

సరిహద్దులు దాటిన ప్రేమకథ

సరిహద్దులు దాటిన ప్రేమకథ

సరిహద్దులు దాటిన ప్రేమ కథ అనే క్యాప్సన్ తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తుంది. గతంలో తాము రూపొందించిన ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథల కన్నా పెద్ద కమర్షియల్ విజయాన్ని సాధిస్తుంది. సొంత ఊరు, గంగపుత్రులకన్న ఎక్కువగా విమర్శకుల మన్ననలు పొందుతుంది. ఈ చిత్రాన్ని జూలై రెండో వారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాత యక్కలి రవీంద్రబాబు తెలియజేశారు.

గల్ఫ్ వెతల గురించి..

గల్ఫ్ వెతల గురించి..

మాటల రచయుత పులగం చిన్నారాయణ మాట్లాడుతూ దాదాపుగా ప్రతిరోజు దిన పత్రికల్లో గల్ఫ్ కష్టాల గురించి, వెతలు గురించి ఎదో ఒక వార్త కనిపిస్తూనే ఉంటుంది. అందరికీ తెలిసినట్టే అనిపిస్తూ తెలియని అంశాలెన్నో గల్ఫ్ వెతల్లో కానవస్తాయి. అసలు ఈ నేపథ్యంలో ఇంతవరకు తెలుగులో సినిమా రాకపోవడమే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సునీల్‌కుమార్‌రెడ్డి ఆ లోటు తీర్చేశారు. ఆయనలోని జర్నలిస్ట్ ఈ సినిమా తీయడానికి ఉసిగోల్పినట్టు అనిపిస్తుంది. ఆయన ఇంతకు ముందు తీసిన సినిమాలన్నీ ఒకెత్తు, ఇదొక ఎత్తు, ఈ సినిమాకు డైలాగ్స్ రాసే అవకాశం రావడం ఒక టర్నింగ్ పాయింట్ గా భావిస్తున్నాను అని చెప్పారు.

గల్ఫ్ బాధితుల వ్యధలను..

గల్ఫ్ బాధితుల వ్యధలను..

చిత్ర దర్శకుడు పి. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ మీద తమ యూనిట్ పని చేసింది. గల్ఫ్ దేశాలన్నీ పర్యటించి అక్కడ విజయాలు అందుకున్న వలస కూలీలను లేబర్ క్యాంపుల్లో ప్రత్యేక్షంగా కలిసి, దాదాపు 400 కి పైగా కేస్ స్టడీలు తీసుకుని తయారు చేసుకున్న కథ ఇది. గల్ఫ్ చిత్రం మనస్సుకు హత్తుకునే మాటలతో, అర్దవంతంగాను, వినోదాత్మంగాను, చక్కటి బావోద్వేగాలు, మంచి నటన, కొత్త సన్ని వేశాలు ఉండే విధంగా పులగం చిన్నారాయణ సంభాషణలు అందించారు. డైలాగ్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రం ప్రేక్షకులనందరినీ రంజింప చేస్తూనే ఆలోచింప చేస్తుంది అని తెలిపారు.

జిల్లాలో సేఫ్ మైగ్రేషన్ ప్రచారం

జిల్లాలో సేఫ్ మైగ్రేషన్ ప్రచారం

చిత్ర ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ బీ బాపిరాజు మాట్లాడుతూ ఈ చిత్రానికి ఎక్కువగా ప్రచారం గల్ఫ్ ప్రవాస అవగాహన యాత్ర పేరుతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో తమ యూనిట్, సామాజిక కార్యకర్తలతో, పోలీసు డిపార్టమెంట్ తో, ఇతర ప్రభుత్వ సంస్థలతో సేఫ్ మైగ్రేషన్ అనే ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం అని అన్నారు. ఇప్పటికే తొలి విడుత తెలంగాణలో సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ లో నిర్వహించామని త్వరలో మిగితా జిల్లాలలో కూడా ఈ పర్యటన జరుగుతుంది అని తెలిపారు.

తెరవెనుక.. తెర ముందు..

తెరవెనుక.. తెర ముందు..

చేతన్ మద్దినేని, డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, సూర్య ( పింగ్ పాంగ్), నల్ల వేణు, నాగినీడు, డిగ్గీ, పోసాని కృష్ణమురళి, జీవా, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, భద్ర, బిత్తిరి సత్తి, ప్రభాస్ శ్రీను, శంఖరాభరణం రాజ్యలక్ష్మి, తీర్ద, సన, యఫ్ యం బాబాయ్, మహేష్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. కెమెరా: యస్. వి. శివరాం, ఎడిటింగ్ : కళ్యాణ్ సామ్యుల్, సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి, మాటలు : పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు : డాక్టర్ ఎల్ . ఎస్. రావు, విజయ్, రాజా, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : బి. బాపిరాజు, నిర్మాతలు : యక్కలి రవీంద్రబాబు, యమ్ . రామ్ కమార్ (USA), స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పి సునీల్ కుమార్ రెడ్డి తమ బాధ్యతలను నిర్వహించారు.

English summary
Gulf movie Director P Sunil Kumar Reddy conducted press meet in Hyderabad. He revealed concept of Gulf Movie. In this meet, writer Pulagam Chinnarayana, Executive producer B Bapiraji others attended. This movie slated to release on July Second week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu