»   » ఇలా అనేసాడేంటి?:చిరంజీవిని టార్గెట్ చేసిన సురేంద్రరెడ్డి, రీమేక్స్ జోలికి వెళ్లనంటూ స్పష్టీకరణ

ఇలా అనేసాడేంటి?:చిరంజీవిని టార్గెట్ చేసిన సురేంద్రరెడ్డి, రీమేక్స్ జోలికి వెళ్లనంటూ స్పష్టీకరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని అందరు స్టార్ డైరక్టర్స్ కూ ఉంటుంది. అయితే ఆయన సినిమాలు చేయకండా ఆ మధ్యన గ్యాప్ తీసుకోవటంతో దర్శకులు నిరుత్సాహపడ్డారు. కానీ ఆయన మళ్లీ ఫామ్ లోకి వచ్చి తన 150 వ చిత్రం ఖైధీ నెంబర్ 150 మొదలెట్టారు. ఈ నేపధ్యంలో మళ్లీ దర్సకులంతా ఆయన కోసం స్క్రిప్టులు రెడీ చేసుకోవటం మొదలెట్టారు. ఆయన 151,152 చిత్రాలకు ఓ ప్రక్క చిరంజీవి కూడా కథలు వింటున్నారు.

ఈ నేపధ్యంలో చిరంజీవితో తదుపరి చిత్రం ఎవరు చేస్తారనే టాపిక్ మొదలైంది. బోయపాటి శ్రీను తో చిరంజీవి 151 వ చిత్రం చేసే అవకాసం ఉందని వినపడుతూంటే ఊహించని విధంగా సీన్ లోకి సురేంద్రరెడ్డి వచ్చారు. ఆయన కథ చిరంజీవి విని ఓకే చేసారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సురేంద్ర రెడ్డి ఖరారు చేసి తెలిపారు.


ఈ శుక్రవారం విడుదలవుతోన్న ధృవ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సురేందర్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసారు. దాంతో మీడియా లో ఈ వార్త హైలెట్ అయ్యింది. సురేంద్రరెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుందనే విషయం కూడా ఆయన చెప్పారు.


కిక్ సినిమాలా...

కిక్ సినిమాలా...

"చిరంజీవి గారితో సినిమాకు సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుంది. ‘కిక్' సినిమాలా ఓ యాక్షన్ కామెడీలో చిరంజీవిని చూడాలన్నది నా కోరిక. అలాంటి సినిమాయే ఆయనతో చేస్తా" అని అన్నారు.


ఇప్పటికే చర్చలు పూర్తి..

ఇప్పటికే చర్చలు పూర్తి..

ఈ కాంబినేషన్ లో రెడీ అయ్యే చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే అవకాసం ఉందని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్..చిరంజివి కు సొంత బ్యానర్. ఈ మేరకు రామ్ చరణ్ , అల్లు అరవింద్ తో కూడా చర్చలు జరిగినట్లు చెప్తున్నారు. మొదట ఈ కథని రామ్ చరణ్ కు చెప్పటం జరిగిందని, ఆ కథ విన్న వెంటనే చిరంజీవి, అల్లు అరవింద్ కు పంపి, కథని వాళ్లకు నేరేట్ చేయించినట్లు సమాచారం.


మూడు రోజులు టైమ్ తీసుకుని

మూడు రోజులు టైమ్ తీసుకుని

కెరీర్‌లో మొదటిసారి ఒక రీమేక్ చేశా. నిజానికి రీమేక్ సినిమా చేయాలన్నది నా ఆలోచన కాదు. రామ్ చరణ్‌తో కలిసి ఒక సినిమా చేయాలని ఆయనతో ట్రావెల్ చేస్తూ వస్తున్నా. కొన్ని కథలు అనుకున్నాం కానీ, చరణ్ అదే సమయంలో ‘తని ఒరువన్' చూసి, ఇది రీమేక్ చేద్దాం అన్నారు. రీమేక్ అంటే నేనూ మొదట భయపడ్డా. ఒక రెండు, మూడు రోజులు టైమ్ తీసుకొని ఓకే చెప్పా.


నాకైతే చాలా ..

నాకైతే చాలా ..

రీమేక్స్ అందరూ అనుకునేంత సులువు కాదు. మనం సొంతంగా తయారు చేసిన కథలు ఓపెన్ స్పేస్‍లో మంచో, చెడో మన క్రియేటివ్ యాంగిల్‌లో చేసేయొచ్చు. రీమేక్స్ విషయంలో మాత్రం అన్నీ పద్ధతిగా, ముందే తెలిసిన ఫార్మాట్‌లో, మన క్రియేటివిటీ జోడించి తీయాలి. అది నాకైతే చాలా కష్టమనిపించింది.


రీమేక్..వద్దు

రీమేక్..వద్దు

ధృవని ఎంత ఎంజాయ్ చేశానో, అంత కష్టపడ్డా కూడా. చరణ్ గారితోనే ఓ సారి చెప్పానిది, ‘మళ్ళీ రీమేక్స్ జోలికి వెళ్ళన'ని. పూర్తిగా మార్చుకోగలిగే అవకాశం ఉన్న సినిమాలైతే తప్ప రీమేక్స్ చేయను అని తేల్చి చెప్పారు సురేంద్ర రెడ్డి.


టీమ్ తో డిస్కస్ చేసాకే

టీమ్ తో డిస్కస్ చేసాకే

ధృవ ...విషయంలో ఒరిజనల్ తని ఒరువన్ కు పెద్దగా మార్పులేమీ చేయలేదు. నాకు కథలో ఎక్కడెక్కడ మార్పులు చేయొచ్చు అనిపించిందో అవి టీమ్‌తో డిస్కస్ చేసి చేశా. అదేవిధంగా తని ఒరువన్ డైరెక్టర్ మోహన్ రాజాతో కూడా ఈ మార్పుల గురించి మాట్లాడా. తమిళ సినిమాలో ఉండే అసలైన కంటెంట్‌ను మాత్రం ఎక్కడా మార్చలేదు. అలా చేస్తే సినిమాయే పాడవుతుంది.


చాలా కష్టపడి మరీ

చాలా కష్టపడి మరీ

చెర్రీ గురించి సురేంద్రరెడ్డి మాట్లాడుతూ...రామ్ చరణ్ చాలా కాలంగా పరిచయం. నన్నడిగితే ఆయనంత హానెస్ట్ పర్సన్‌ని నేనెక్కడా చూడలేదు. ఒక మాట ఇచ్చాడంటే, మనం మర్చిపోయినా, ఆ మాట మీదే నిలబడి ఉంటాడు. సినిమా విషయానికొస్తే, ‘ధృవ' కోసం నేను ఓ కొత్త లుక్ కోరుకుంటున్నా అని చెప్పా. టీమ్‌తో డిస్కస్ చేసి, కష్టపడి ఆ సిక్స్‌ప్యాక్ లుక్ రెడీ చేశాడు. అతడి డెడికేషన్ చూస్తే ఎవరికైనా ఇంకా బాగా పనిచేయాలన్న ఉత్సాహం వస్తుంది.


ఒక్క మాట మాట్లాడకుండా..

ఒక్క మాట మాట్లాడకుండా..

‘తని ఒరువన్' రీమేక్ చేస్తున్నామని చెప్పి, నేను చేసిన మార్పులు చూపించిన వెంటనే, ఒక్క మాట మాట్లాడకుండా సినిమా అరవింద్ స్వామి ఒప్పుకున్నారు. ఆయన ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తారని చెప్పగలను. రీమేక్ చేస్తున్నప్పుడు నాకు ఎలా ఉండేదో, ఆయనా అలాగే ఫీల్ అయ్యేవాడు.


నేను ఏదొకటి చేస్తేనే కదా..

నేను ఏదొకటి చేస్తేనే కదా..

ఒక కంటెంట్‌ను మనం అర్థం చేస్కున్న విధానానికి తగ్గట్టు ఒక మేకింగ్‍ని ఫాలో అవుతాం. ఇక్కడ తప్పకుండా నా మార్క్ ఉంటుంది. చాలామంది వేరేవారి కథలను తీయడం కూడా ఈజీ అనేస్తారు. అందులో కూడా మేకింగ్ పరంగా నేను ఏదొకటి చేస్తేనే కదా సినిమా వచ్చేది అన్నారు సురేంద్రరెడ్డి.


అదే నా నమ్మకం..

అదే నా నమ్మకం..

ఇప్పటికే సక్సెస్ అయిన కంటెంట్ కాబట్టి సాధారణంగా అన్ని సినిమాలతో పోల్చితే ధృవ సినిమా విషయంలో కాస్త ఎక్కువ కాన్ఫిడెంట్‌గా ఉన్నా. రేపు ప్రేక్షకులు చూసి బాగుందంటారన్న నమ్మకంతోనే ఉన్నా అని తన నమ్మకాన్ని వ్యక్తం చేసారు సురేంద్రరెడ్డి.


ఎక్కడా తగ్గటం లేదు

ఎక్కడా తగ్గటం లేదు

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ', సినీ అభిమానుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈనెల 9న భారీ ఎత్తున విడుదలవుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని మొదట్నుంచీ చెబుతూ వస్తోన్న టీమ్, ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు.


రేపు వీళ్లు ముగ్గరూ...

రేపు వీళ్లు ముగ్గరూ...

గత ఇరవై రోజులుగా ఇక్కడే ప్రమోషన్స్ నిర్వహించిన టీమ్, తాజాగా అమెరికాలోనూ ఇదే స్థాయిలో ప్రమోట్ చేయాలని అక్కడికి వెళ్ళేందుకు రెడీ అయిపోయింది.
రామ్ చరణ్‌తో పాటు విలన్ అరవింద్ స్వామి, దర్శకుడు సురేందర్ రెడ్డి రేపు యూఎస్ బయల్దేరుతున్నారు. గురువారం రోజున ప్రదర్శితమయ్యే ప్రీమియర్ షోస్‌కి చరణ్ కూడా స్వయంగా హాజరవుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి.


English summary
Surender Reddy expressed his dream to direct Mega Star Chiranjeevi. He said he will direct Mega Star Chiranjeevi and revealed that he already readied the script which has high action and entertainment values.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu