»   » 'సైరా' గెటప్‌లో బుడ్డోడి హల్ చల్: ఈ చిన్ని 'నరసింహారెడ్డి' ఎవరో తెలుసా?

'సైరా' గెటప్‌లో బుడ్డోడి హల్ చల్: ఈ చిన్ని 'నరసింహారెడ్డి' ఎవరో తెలుసా?

Subscribe to Filmibeat Telugu

వెండితెర మీద అభిమాన హీరో బొమ్మ చూస్తే.. ఫ్యాన్స్‌కు పూనకమే.వాళ్ల కాస్ట్యూమ్స్‌ దగ్గరి నుంచి మేనరిజమ్స్ వరకు ప్రతీది ఫాలో అయిపోతుంటారు. పాపులర్ సినిమాల్లో కాస్ట్యూమ్స్ కు మార్కెట్లోనూ ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆ కాస్ట్యూమ్స్‌లో తమను కూడా హీరోల్లా ఊహించేసుకుని చాలామంది సంబరపడిపోతుంటారు. ఇదే తరహాలో 'సైరా నరసింహా రెడ్డి'లో చిరంజీవి గెటప్ చూసి ముచ్చటపడ్డ ఓ చిన్నారి.. ఆ కాస్ట్యూమ్స్‌లో భలే పోజులిచ్చాడు..

ఇంత జరుగుతోందా?: 'సైరా' ఎటు పోతోంది.., మధ్యలో గుణశేఖర్ ఎందుకు!..

ఎవరీ బుడ్డోడు:

ఎవరీ బుడ్డోడు:

చేతిలో కత్తితో.. 'సైరా నరసింహారెడ్డి' కాస్ట్యూమ్స్ లో మెరిసిపోతున్న ఓ బుడ్డోడి ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఎవరా ఈ చిట్టి తండ్రి? అని చాలామంది ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరి కుమారుడో తెలుసా?.. సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి కుమారుడు.

చిరంజీవిని ఆ గెటప్‌లో చూసి.. :

చిరంజీవిని ఆ గెటప్‌లో చూసి.. :

సైరా షూటింగ్ సెట్‌లో చిరంజీవిని ఆ గెటప్‌లో చూసి.. తనకూ అలాంటి కాస్ట్యూమ్స్ కావాలని తన తండ్రి సురేందర్ రెడ్డిని అడిగాడట ఈ బుడ్డోడు. ముద్దులొలికే మాటలతో కొడుకు తన కోరిక గురించి చెప్పేసరికి.. కాదనలేక సురేందర్ రెడ్డి కూడా 'సై' అన్నాడట.

ఫిదా చేసేశాడు..:

ఫిదా చేసేశాడు..:

ఇంకేముంది.. తండ్రి ఆ కాస్ట్యూమ్స్ తెప్పించడమే ఆలస్యం.. చేతిలో కత్తితో ఈ చిన్ని 'నరసింహారెడ్డి' హల్‌చల్ చేశాడు. ఫోటోలకు భలే పోజులిచ్చాడు. ఆ ఫోటోల్లో బుడ్డోడు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కు ఇప్పుడు చాలామంది ఫిదా అయిపోతున్నారు. ఎంతైనా సురేందర్ రెడ్డి కొడుకా.. మజాకా? అనుకుంటున్నారు నెటిజెన్స్.

Sye Raa Narasimha Reddy faces trouble ‘సై రా’... ఈ వార్తలేంట్రా
 సైరా నరసింహారెడ్డి..:

సైరా నరసింహారెడ్డి..:

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా 'సైరా నరసింహారెడ్డి' తెరకెక్కుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.నయనతార, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 రెండో షెడ్యూల్:

రెండో షెడ్యూల్:

సైరా తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఫిబ్రవరి నుంచి రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. కాగా, ఈ సినిమాకు మొదట ఎ.ఆర్‌. రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత థమన్ లైన్ లోకి వచ్చాడు.

English summary
Director Surender Reddy's son photos are trending in social media, he appeared in SYE RAA chiranjeevi get up.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu