twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా కేసుల్లో మనమే నంబర్‌వన్‌గా నిలుస్తాం.. దర్శకుడు తేజ సెన్సేషనల్ కామెంట్స్

    |

    ఒకప్పుడు చైనాలో కరోనా వైరస్ వచ్చిందంటే.. అందరూ అది సాధారణ విషయంగా పరిగణలోకి తీసుకున్నారు. తీరా అది మన దేశానికి మెల్లిగా పాకినప్పుడు.. అది మనల్ని ఏం చేయగలదని అందరూ అనుకున్నారు. తీరా ప్రస్తుత పరిస్థితిని చూస్తే ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా ఇండియా వెళ్తోంది. ఇప్పటికే మూడు లక్షలకు పైగా కరోనా కేసులు భారతదేశంలో నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితిపై దర్శకుడు తేజ స్పందించాడు.

    మనమే నంబర్ వన్..

    మనమే నంబర్ వన్..

    మనందరి ఆటిట్యూడ్‌ చూస్తుంటే కరోనా కేసులు ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదని హెచ్చరించాడు. ప్రస్తుతం రోజు పదకొండు, పన్నెండు వేల కేసులు నమోదు అవుతున్నాయని, భవిష్యత్తులో రోజుకు లక్ష వచ్చే దశకు చేరుకుంటామని పేర్కొన్నాడు. కోట్లు దాటుతాయని, మనదేశంలోనే అత్యధిక కేసులుంటాయని, మనమే నంబర్‌వన్‌గా నిలుస్తామని పేర్కొన్నాడు.

    అలా వ్యాప్తి..

    అలా వ్యాప్తి..

    కరోనా వ్యాప్తికి కారణం మన ఆటిట్యూడ్‌ అని తెలిపాడు. మనకు కరోనా లేదనీ, మనం కలుసుకునేవాళ్లకు కరోనా లేదనుకుంటున్నామని తెలిపాడు. కరోనా లేదు అనుకొని సూపర్‌మార్కెట్‌ వెళుతున్నామని, అక్కడి వస్తువుల్ని కొని బుట్టలో వేసుకుంటున్నామని, కూరగాయాలు అమ్మేవాడికి కరోనా లేదనుకొని అతడి నుంచి కొంటున్నామని తెలిపాడు. వాటిని తీసుకొచ్చి మన ఇంట్లో డైనింగ్‌టేబుల్‌, సోఫాల మీదా పెడుతున్నామని పేర్కొన్నాడు.

    నమ్మకం ఉండాలి...

    నమ్మకం ఉండాలి...


    మనతో పాటు మనకు వస్తువుల్ని అమ్మినవాడికి, కొనుగోలు చేసిన వస్తువులపైన ఎక్కడా కరోనా లేదు అని గట్టి నమ్మకంతో ఉంటున్నామని అన్నాడు. కానీ అన్ని చోట్ల కరోనా ఉంటుందని తెలిపాడు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే మనం కొనే వస్తువులు మీద ఉందని నమ్మాలని తెలిపాడు. స్నేహితులు, చుట్టుపక్కల ఉన్నవారందరికి ఉందని నమ్మండని, వారి ద్వారా మనకు కరోనా వస్తుంది, మన కుటుంబాలకు వస్తుందని నమ్మండని అన్నాడు. కూరగాయల్ని నేరుగా ఇంట్లోకి తీసుకెళ్లకుండా వాటిని నీళ్లలో వేసి పసుపుతో శుభ్రంగా కడగండని, చేతులు, ముఖాన్ని శుభ్రపరుచుకున్న తర్వాతే లోపలికి వెళ్లండని తెలిపారు.

    Recommended Video

    Vakeel Saab Director Venu Sriram About Trivikram Srinivas
    తేజ బిజీగా..

    తేజ బిజీగా..

    దర్శకుడు తేజ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లను రెడీ చేస్తున్నాడు. అందుకు గానూ తేజ ఆన్ లైన్ ద్వారా ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. రానా, గోపీచంద్‌లతో తీయబోయే తన చిత్రాలకు గానూ ఓ 50మంది కొత్త నటీనటులు కావాలని పేర్కొన్నాడు.

    English summary
    Director Teja About Coronavirus In India. Teja Suggests People That Stay Home stay Safe otherwise india will be in Number One position.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X