For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘‘మహేష్ బాబు, జనం బానే ఉన్నారు, నేనే నష్టపోయానంటున్న ప్రముఖ దర్శకుడు’’

|

విభిన్నమైన సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తేజ తాజాగా 'సీత' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రంలో మోడర్న్ ఉమెన్‌ ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ తన మనసులోని భావాలను నిర్మొహమాతంగా తెలిపారు. 'సీత' సినిమాలో ఏదైతే చూపించాను తన కూతురు విషయంలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చినపుడు సపోర్ట్ చేస్తానని తెలిపారు. తాను రియల్ లైఫ్‌లో నమ్మే అంశాలనే సినిమాలో చూపిస్తానని తెలిపారు. సినిమాలో హీరోయిన్‌ను ఒకలా చూపించి, నా కూతురు విషయంలో మరోలా ఉండే వ్యక్తిని కాదన్నారు.

పెళ్లి చేయను అని చెప్పాను

పెళ్లి చేయను అని చెప్పాను

నా కూతురుకు చిన్నపుడే చెప్పాను. పెద్దయ్యాక నేను నీకు పెళ్లి చేయను, నువ్వే అబ్బాయిని వెతుక్కోవాలి, నువ్వే పెళ్లి చేసుకోవాలి... వెడ్డింగ్ కార్డులు వేసి, ఇంటింటికి వెళ్లి కార్డులు పంచి మా అమ్మాయి పెళ్లికి రండి అని చెప్పను. అలా డబ్బు వేస్ట్ చేయను అని తేజ గుర్తు చేసుకున్నారు.

కష్టపడి కాపురం చేయొద్దని చెప్పాను

కష్టపడి కాపురం చేయొద్దని చెప్పాను

నువ్వు పెళ్లి చేసుకో... సంవత్సరం తర్వాత నచ్చలేదనుకో వదిలేయ్. నువ్వు సంతోషంగా ఉండటం ముఖ్యం. సొసైటీ కోసం, పక్కింటాళ్ల కోసం, వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చిన అందరి కోసం కష్టపడి కాపురం చేయొద్దు. నచ్చకపోతే వదిలేయ్.... అని తన కూతురుకు సలహా ఇచ్చినట్లు తేజ తెలిపారు.

మహేష్ బాబు, జనం బానే ఉన్నారు, నేనే నష్టపోయా

మహేష్ బాబు, జనం బానే ఉన్నారు, నేనే నష్టపోయా

‘సీత' సినిమా నుంచి జనం ఏం నేర్చుకోవాలనే ప్రశ్నకు తేజ ఆసక్తికరంగా రిప్లై ఇచ్చారు. నా సినిమా చూసి జనాలు నేర్చుకునేంత గొప్ప సినిమాలు తీయను. నాకు అలాంటివి చేతకాదు. ఒక్కసారి ఎప్పుడో ట్రైచేశాను. నీతి చెప్పడానికి ట్రైచేశాను. ‘నిజం' సినిమా వల్ల ఏమీ జరుగలేదు, ఎవ్వరూ మారలేదు. నా డబ్బులైతే పోయాయి. సినిమాలో నటించిన మహేష్ బాబు బానే ఉన్నాడు, చూసిన జనం బానే ఉన్నారు. నీతి చెప్పిన నేను పోయాను. లైఫ్ లో అలాంటి రిస్కులు చేయనని తేజ తెలిపారు.

ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ బాబు.. ఎమోషనల్‌గా లేఖ రాసిన విజయశాంతి

సీత

సీత

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ జంటగా నటించి చిత్రం 'సీత'. సోనూ సూద్, మన్నారా చోప్రా‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందంచగా, శీర్ష రాయ్ సినిమాటోగ్రఫీ సమకూర్చారు. ఏకే ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Director Teja abour Nijam movie failure. The film stars Mahesh Babu, Rakshita, Gopichand, Raasi in the lead roles and music was composed by R. P. Patnaik. Initially Jyothika was considered as the lead role but later replaced. Mahesh Babu and Rameshwari won the Nandi Awards in Best Actor and Best Supporting Actress categories respectively. It was remade as Arjuna in Odia starring Anubhav Mohanty and Gargi Mohanty.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more