twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్: ఆ రోజు అభిమానులకు పూనకాలే.., అద్దిరిపోయే టీజర్

    |

    తెరపై ఓ కొత్త కథను పరిచయం చేయబోతున్నామంటే ముందు దానిపై ఎటెన్షన్ క్రియేట్ అయ్యేలా చూసుకోవాలి. కానీ అప్పటికే పాపులర్ అయిన కథను.. జనంలో రకరకాల అభిప్రాయాలతో ముడిపడి ఉన్న కథను తెరపై చూపించబోతున్నామంటే.. జనం కంటే ముందు తామే అలర్ట్‌గా ఉండాలి.

    రిసీవ్ చేసుకోవడానికి జనం సిద్దంగా ఉన్నప్పుడు.. వాళ్లను మెప్పించేలా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తీయడం పెద్ద సవాలే. ఇప్పుడు ఆ సవాల్‌ను ఎదుర్కోవడానికి సిద్దమైపోయింది బాలయ్య-తేజ కాంబినేషన్. ఇందుకోసం గట్టిగానే కసరత్తులు మొదలుపెట్టింది.

    టీజర్ షూటింగ్..

    టీజర్ షూటింగ్..

    ఎన్టీఆర్ జీవిత చరిత్ర నేపథ్యంలో రాబోతున్న బయోపిక్ కు సంబంధించి ఓ టీజర్ సిద్దం చేయాలని భావిస్తున్నారట చిత్ర యూనిట్. ఇందుకోసం ఇప్పటికే అనుకున్న ఓ కాన్సెప్టుతో టీజర్ షూట్ చేశారట. టీజర్ అంటేనే చూపించి చూపించకుండా.. వినిపించి వినిపించకుండా ఉంటుంది కాబట్టి.. అదే తరహాలో సినిమాపై క్యురియాసిటీ పెంచాలని భావిస్తున్నారట.

    Recommended Video

    RGV’s biopic Lakshmi’s NTR : Here Lakshmi Parvathi's response
    ఎలా ఉండబోతుంది?

    ఎలా ఉండబోతుంది?

    ఈ టీజర్ లో భారీ డైలాగ్స్ గానీ ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలయ్య గానీ కనిపించరట. మరేం కనిపిస్తాయంటే.. ఓ వెహికల్ మాత్రం బాగా హైలైట్ అవుతుందట.

    ఏంటా వెహికల్:

    ఏంటా వెహికల్:

    అప్పట్లో ఎన్టీఆర్ ఒక మెటాడోర్ వెహికల్‌ను కాస్త మోడర్న్‌గా తయారుచేసి తన రాజకీయ యాత్రల కోసం ప్రచార రథంగా వాడుకున్నారు. దాన్నే చైతన్య రథం అని కూడా పిలిచేవారు. అప్పట్లో ఆ వెహికల్‌కు డ్రైవర్‌గా హరికృష్ణ ఉండేవారు. ఇప్పుడదే వెహికల్‌ను టీజర్‌లో చూపించనున్నారట.

    ఎన్టీఆర్ 'డైలాగ్'..

    ఎన్టీఆర్ 'డైలాగ్'..

    ఇక టీజర్ విషయానికొస్తే.. చైతన్య రథంపై ఎన్టీఆర్ ప్రసంగిస్తున్న తరహాలో వెనుక నుంచి ఒక సీన్ షూట్ చేయబోతున్నారట. చైతన్య రథంపై ఫోకస్ చేసి.. అక్కడి నుంచి కెమెరా కాస్త పైకి తీసుకెళ్లి.. 'నా తెలుగింటి ఆడపడుచులారా.. తమ్ముళ్ళారా' అంటూ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పడం మొదలెట్టగానే షాట్ కట్ చేస్తారట. ఇంతవరకు టీజర్ లో చూపించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.

    ఫైనల్‌గా చెప్పొచ్చేది..:

    ఫైనల్‌గా చెప్పొచ్చేది..:

    గురువారం రోజు రామకృష్ణ స్టూడియోలో ఈ టీజర్‌ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ వర్ధంతి రోజైన జనవరి 18న దీన్ని విడుదల చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి టీజర్ ద్వారా బయోపిక్ అఫీషియల్‌గా మొదలైంది అని చెప్పడమే తప్పితే.. ఇందులో బాలయ్య లుక్స్ గానీ, అందులో చూపించబోయే అంశాల గురించి పెద్దగా ఏమి ఉండదని తెలుస్తోంది.

    English summary
    Teja and Balakrishna shot a special teaser on Thursday in Hyderabad’s Ramakrishna Studios. The teaser will be launched on a special occasion to officially mark the announcement of the project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X