»   » ప్రముఖ నటి, దర్శకురాలు వైశాలి కాసరవల్లి మృతి

ప్రముఖ నటి, దర్శకురాలు వైశాలి కాసరవల్లి మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ కన్నడ నటి, దర్శకురాలు, ఫ్యాషన్ డిజైనర్ వైశాలి కాసరవళ్లి (59) సోమవారం సాయంత్రం బెంగుళూరులో కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా షుగర్, మరియు తీవ్రమైన మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్నారు. చనిపోయే ముందు ఆమె నేత్ర దానం చేశారు. ప్రఖ్యాత దర్శకుడు గిరీష్ కాసరవల్లి ఆమె భర్త. 'తాయిసాహేబా' చిత్రానికి గాను ఆమె జాతీయ అవార్డు అందుకున్నారు. కర్ణాటక నాటక అకాడమీ, రాజ్యోత్సవ అవార్డులు కైవసం చేసుకున్నారు. మొత్తం 73 చిత్రాల్లో నటించిన ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. రెండు కన్నడ సీరియల్స్‌కూ దర్శకత్వం వహించారు.

1952 ఏప్రిల్ 12న గుల్బర్గలో జన్మించిన వైశాలి...బూతయ్యన మగ అయ్యు ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు. శాంతినివాస ఆమె చివరి చిత్రం.మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు విల్సన్ గార్డెన్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 12 నుంచి మూడు గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని రవీంద్రా కళాక్షేత్రలో ఉంచుతారు. వైశాలి మృతి పట్ల ముఖ్యమంత్రి యడ్యూరప్ప, సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నటులు పునీత్ రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్ తదితరులు వైశాలికి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మృతికి ధట్స్ తెలుగు ప్రగాఢ సంతాపం తెలియచేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu