»   » ‘భాయ్’టైటిల్ అందుకే పెట్టా... (దర్శకుడు ఇంటర్వూ)

‘భాయ్’టైటిల్ అందుకే పెట్టా... (దర్శకుడు ఇంటర్వూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నేను చిరంజీవి గారి 'శంకర్‌దాదా ఎంబీబీఎస్'కి కో-డెరైక్టర్‌గా చేశాను. హిందీ చిత్రం 'మున్నాభాయ్ ఎంబీబీఎస్'కి అది రీమేక్. ఆ టైటిల్‌లోని 'భాయ్' నాకు క్యాచీగా అనిపించింది. అప్పుడే ఆ టైటిల్ అనుకుని,స్టోరీలైన్ తయారు చేసుకున్నా అంటున్నారు దర్శకుడు వీరభధ్రం. 'అహనా పెళ్లంట', 'పూలరంగడు' సినిమాలతో విజయాలు సొంతం చేసుకొన్న దర్శకుడీయన. నాగార్జునతో 'భాయ్‌' తెరకెక్కించారు. ఆ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా వీరభద్రమ్‌ హైదరాబాద్‌ లో 'ధట్స్ తెలుగు'తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

నేను ఇప్పటివరకు చేసిన రెండు చిత్రాలు విజయవంతమయ్యాయి. మూడో చిత్రం స్టార్ హీరోతో చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ చిత్రం కూడా తప్పక విజయవంతమై నాకు హ్యాట్రిక్ హిట్‌ను అందిస్తుంది. కష్టాన్ని నమ్ముకునే మనస్తత్వంతో ఉన్న నేను ఈ చిత్రానికి పడిన కష్టానికి ఫలితాన్ని తప్పక అందుకుంటానని దర్శకుడు వీరభద్రమ్ తెలిపారు.

ఆదివారం మా యూనిట్ మొత్తం సినిమా చూసింది. అందరికీ సినిమా బాగా నచ్చింది. 'భాయ్'తో హ్యాట్రిక్ సాధిస్తాననే గట్టి నమ్మకం నాలో ఉంది. ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. నాగార్జున గారిది సాయంత్రం ఆరు గంటల వరకు 'భాయ్'గా, ఆరు తర్వాత ప్లేబాయ్‌గా కనిపించే పాత్ర. ఆయన పాత్ర పేరు విజయ్. ఆ పాత్రలో మూడు ఛాయలుంటాయి. స్టిల్స్, ట్రైలర్స్ చూసిన వాళ్లంతా నాగార్జున చాలా అందంగా ఉన్నారని అంటున్నారు. అన్ని విధాలుగా ఈ సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి అంటూ చిత్రం విశేషాలు చెప్పుకొచ్చారు.

ఆయన ఇంటర్వూ స్లైడ్ షోలో...

అప్పట్లోనే...

అప్పట్లోనే...

''అశోసియేట్ డైరక్టర్ గా పనిచేస్తున్నప్పుడే నాగార్జునగారిని దృష్టిలో ఉంచుకొని రకరకాల కథలు రాసుకొనేవాణ్ని. ఆయనతో 'భాయ్‌' పేరుతో ఒక సినిమా తీస్తే బాగుంటుందనే ఆలోచన ఎప్పట్నుంచో ఉండేది. ఆ అవకాశం నాకు ఇప్పుడు దొరికింది. వినోదం, యాక్షన్‌ అంశాలతో మిళితమైన చిత్రమిది. నాగార్జున లాంటి ఒక స్టార్‌ హీరోని తెరపై ఎలా చూడాలనుకొంటారో... అలాగే చూపించాను.

అప్పుడు కథ వినిపించా...

అప్పుడు కథ వినిపించా...


‘పూలరంగడు' పూర్తయ్యాక నాగార్జున షిర్డీసాయి షూటింగ్‌లో సాయిబాబా గెటప్‌లో ఉండగా, కలిశాను. టైటిల్ చెప్పగానే ఆయనకు నచ్చేసింది. దాదాపు గంటన్నర కథ విని, చేద్దాం అన్నారు. విన్నవెంటనే ఆయన పూర్తి సంతృప్తి చెంది సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు.

పవన్ మీద సెటైర్ కాదు..

పవన్ మీద సెటైర్ కాదు..

అసలు ట్రెండ్‌ సెట్‌ చేసింది నాగార్జున. కానీ ఈ డైలాగ్‌ ఎవరినో ఉద్ధేశించో రాసింది కాదు. ‘శివ' సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌. ఆ సినిమాని దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాం. శివని కనెక్ట్‌ చేయడానికే పెట్టాం. పరిశ్రమలో అందరు హీరోలతోనూ పనిచేయాలి. వేరే అభిప్రాయం ఏదీ లేదు. అలాగే డైలాగుల కోసం 5నెలల పాటు నలుగురు రచయితలతో పనిచేశాను. అందుకే ఇప్పుడవి ఇంతగా అలరిస్తున్నాయి.

కొత్త కథలు పుట్టవు...

కొత్త కథలు పుట్టవు...

నాకు తెలిసి కొత్త కథలంటూ పుట్టవు. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో వచ్చిన కథలే రిపీట్ అవుతున్నాయి. కాకపోతే కథనం, కథలోని ఎమోషన్స్, డైలాగ్స్, సాంగ్స్ పరంగా ట్రెండ్ మారుతుందని నా ఫీలింగ్. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని, ‘భాయ్' చేశాను. లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా స్టయిలిష్‌గా ఉండే చిత్రం ఇది. నాగార్జునగారి స్టయిల్‌కి అనుగుణంగా కథను మలిచాను అంటున్నారు

మొదట బెరుకుగా..

మొదట బెరుకుగా..

బ్యాంకాక్‌ షెడ్యూల్లో .. ఆ రోజే భాయ్‌ ఎంట్రీ. ఆరంభం నాగార్జునని డైరెక్ట్‌ చేయడమంటే కాస్త టెన్షన్‌ పడ్డా. కానీ నాగ్‌తో సీన్స్‌ బాగా తీయాలని తపించి పనిచేశాను. రెండ్రోజులకే భాయ్‌కి అసలు విషయం అర్థమైంది. బాగా తీస్తానన్న నమ్మకం నాపై కలిగింది. తొలి షెడ్యూల్ బ్యాంకాక్‌లో ప్రారంభించినప్పుడు కొంచెం బెరుకుగా పనిచేసినా ఆయన ఇచ్చిన ఉత్సాహంతో తరువాత సంతృప్తిగా పనిచేశానని, ఆ తరువాత రషెస్ చూశాక తనను ఆయన ప్రోత్సహించిన తీరుతో మరింత హుషారుగా తయారయ్యానని ఆయన తెలిపారు.

పంచ్ డైలాగ్స్ హైలెట్

పంచ్ డైలాగ్స్ హైలెట్

ఇందులో డైలాగ్స్ భిన్నంగా ఉంటాయి. నాగార్జున గారిని కొత్తగా ఎలా చూపించాలా అని ఆలోచించి, ఆయన కోసం పంచ్ డైలాగ్స్ రాశాం. రజనీకాంత్‌ సినిమాల్లో పంచ్‌ డైలాగ్‌లు ఉంటాయి. ఆ తరహాలోనే భాయ్‌కి పంచ్‌లు రాయించాను. దీనికోసం నలుగురు డైలాగ్‌ రైటర్స్‌ పనిచేశారు. హైదరాబాద్‌లో రెండే ఫేమస్‌. ఒకటి ఇరానీ ఛాయ్‌, రెండోది భాయ్‌.. ఈ డైలాగ్‌ని పోలూరి ఘటికాచలం రాశారు. అన్నపూర్ణ స్టూడియోలో పనిచేయాలనే కల నేటితో నెరవేరిందిమా యువ రచయితల బృందం వాటిని చాలా బాగా రాసింది. అలాగే 'భాయ్' పాతబస్తీ గెటప్ సంబంధించి సీనియర్ రచయిత ఘటికాచలం రాసిన డైలాగ్ ఇప్పటికే పాపులర్ అయ్యింది. కచ్చితంగా ఈ సినిమాతో ఓ కొత్త నాగార్జునను చూడబోతున్నారు.

మ్యూజిక్ కేక

మ్యూజిక్ కేక

భాయ్‌ ఆడియో పెద్ద హిట్టయింది. దేవీశ్రీ మ్యూజిక్‌ ప్రధాన అస్సెట్‌. ముఖ్యంగా భాయ్‌ టైటిల్‌ సాంగ్‌కి విపరీతమైన స్పందన వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఇటీవల విడుదలైన పాటలు అన్ని చోట్లా వినిపిస్తున్నాయి. టైటిల్ సాంగ్ అయితే రింగ్ టోన్‌గా బాగా వినిపిస్తోంది. నాగ్, దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ హిట్. 'భాయ్' ఆ జాబితాలో తప్పకుండా చేరుతుంది. ఈ సినిమాకు తనైతే బాగా న్యాయం చేయగలడనే ఉద్దేశంతోనే ఆయనను సంగీత దర్శకునిగా తీసుకున్నాం. అలాగే ట్రైలర్‌కూ అద్భుతమైన స్పందన వచ్చింది. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో వచ్చిన పాటలన్నీ హిట్ అయ్యాయని, విజయంలో పాటల పాత్ర కూడా ఉంటుందని, అదేవిధంగా ఆర్.ఆర్. ప్లస్‌పాయింట్ అవుతుంది.

కామెడీ చిత్రానికి హైలెట్‌...

కామెడీ చిత్రానికి హైలెట్‌...


బ్రహ్మానందం, ఎం.ఎస్‌ల కామెడీ చిత్రానికి హైలెట్‌గా ఉంటుందని, దాదాపు 90 సినిమాలలో నటించిన నాగార్జున లాంటి స్టార్ హీరోను తాను డైరెక్ట్ చేయగలనన్న నమ్మకం ఈ చిత్రంతో కలిగిందని ఆయన అన్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్స్ కూడా మంచి ఆదరణ పొందాయని భాయ్ చిత్రంతో తప్పక విజ యం సాధించి హ్యాట్రిక్ దర్శకుడిగా నిలుస్తానని ఆయన ముగించారు.

నా కల నెరవేరింది

నా కల నెరవేరింది

"నాగార్జున 'భాయ్'గా నటించడమే కాకుండా, ఆ సినిమాని స్వయంగా నిర్మించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. అన్నపూర్ణ స్టూడియోస్ వంటి పెద్ద బేనర్‌లో పనిచేయంతో నా కల నెరవేరినట్లుగా ఉంది'' .విజయానికి దగ్గరదారిలో ఉండదని నమ్మేవాళ్ళల్లో తాను ఒకడినని, చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతిఒక్కరూ అన్నపూర్ణా స్టూడియో సంస్థలో పనిచేయాలని అనుకుంటారని, అలా అనుకునే తనకు మూడో చిత్రమే దర్శకుడిగా పనిచేసే అదృష్టం రావడం సంతోషాన్నిస్తోందని, నాకు ఇదొక కలలా అనిపిస్తోందని తెలిపారు.

మూడు పాత్రల్లో...

మూడు పాత్రల్లో...

భాయ్‌లో నాగ్‌ చాలా అందంగా ఉన్నారు. కొత్తగా ఉన్నారు అని స్నేహితులు ప్రశంసించారు. ట్విట్టర్లు, ఫేస్‌బుక్‌లో అభిప్రాయాలతో హోరెత్తించారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో నాగార్జున మూడు విభిన్న కోణాల్లో ప్రేక్షకులను మెప్పిస్తారు. తాను నాగార్జునను సరికొత్తగా ఎలా చూపాలనుకున్నానో అలా చూపే ప్రయత్నం చేశానని, అదేవిధంగా హీరో బాడీ లాంగ్వేజ్ కూడా ఈ చిత్రానికి కరెక్టుగా సరిపోతుందని, ఆయన కాక మరో 80 మంది నటీనటులు ఈ చిత్రంలో ఉన్నారని ఆయన వివరించారు.

నాకు కాన్ఫిడెన్స్ కలిగించారు

నాకు కాన్ఫిడెన్స్ కలిగించారు

నా మొదటి రెండు సినిమాలనీ కామెడీ హీరోలతో చేశా. మొదటిసారి పెద్ద స్టార్‌తో చేసే అవకాశం రావడంతో నా ఆనందానికి అవధుల్లేవు. ఈ సినిమాతో అందర్నీ మెప్పించాలనే తపనతో, ఓ సవాలుగా దీన్ని తీసుకుని చేశాను. నాగార్జున గారితో చాలా సౌకర్యంగా పనిచేసుకుపోయాను. ఆయన దర్శకుడికి స్వేచ్ఛనిచ్చే హీరో. తన కెరీర్‌లో ఆయన ఎంతోమంది కొత్తవాళ్లని ప్రోత్సహించారు. ఈ సినిమాతో పెద్ద హీరోని కూడా హ్యాండిల్ చేయగలననే నమ్మకాన్ని ఆయన నాలో కలిగించారు. షూటింగ్ సమయంలో మొదటి షెడ్యూల్ పూర్తవగానే ఆయనకు నాపై బాగా నమ్మకం కలిగింది. చా పనితీరు పట్ల హ్యాపీగా ఫీలయ్యారు. తొలి కాపీ చూశాక చాలా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. నేనైతే సినిమా విషయంలో గట్టి నమ్మకంతో ఉన్నా.

మెచ్చుకున్నారు...

మెచ్చుకున్నారు...

'హైదరాబాద్‌లో రెండు ఫేమసు. ఒకటి ఇరానీ ఛాయ్‌... రెండు ఈ భాయ్‌' తరహా సంభాషణలు చాలా ఉంటాయి. ఈ సినిమా పేరు, సంభాషణల గురించి చెప్పగానే నాగార్జున 'ఈ సినిమా చేస్తున్నాం' అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. ఆయన ఈ సినిమా చేయడమే కాదు... సొంతంగా నిర్మించడానికి ముందుకు రావడం కూడా ఓ గొప్ప అనుభూతినిచ్చింది. తొలి అడుగులు వేస్తున్న నాకు అన్నపూర్ణ స్టూడియోస్‌లాంటి ఓ సంస్థలో సినిమా తీయడం గర్వంగా ఉంది. ప్రేక్షకుడు ప్రతీ సన్నివేశాన్ని ఆస్వాదించేలా చిత్రాన్ని తీర్చిదిద్దాం. తొలి కాపీ చూశాక నాగార్జునగారు ఎంతో మెచ్చుకొన్నారు. ఆయన ఇందులో పోషించిన పాత్ర మూడు కోణాల్లో సాగుతుంది''. అన్నారు.

డిఫరెంట్ ఎక్సపీరియన్స్...

డిఫరెంట్ ఎక్సపీరియన్స్...

'స్టార్‌ హీరోతో సినిమా చేయడం ఒక భిన్నమైన అనుభవం. నాకు అప్పటికే రెండు సినిమాలు చేసిన అనుభవం ఉంది. నాగార్జునలాంటి స్టార్‌ హీరోతో మాత్రం పనిచేయలేదు. అందుకే 'భాయ్‌' చిత్రీకరణకోసం తొలి రోజు సెట్‌కి వెళ్లినప్పుడు కాస్త కంగారుపడ్డాను. కానీ నాగార్జునగారు ఎంతో స్వేచ్ఛనిచ్చి నన్ను ప్రోత్సహించారు. నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఒక నటుడిగా, నిర్మాతగా నాకు ఏమేం కావాలో అవన్నీ సమకూర్చారు. నా కష్టాన్ని చూసి భుజం తట్టారు. ఒక పెద్ద హీరోతో సైతం అలవోకగా సినిమాని తీయొచ్చనే నమ్మకాన్ని నాలో కల్పించారు నాగార్జున. 'హలోబ్రదర్‌', 'కింగ్‌' తదితర చిత్రాల్లో ఆయన పంచిన వినోదం చూసి నేను మరింత ఆత్మవిశ్వాసంతో ఈ సినిమాని తీర్చిదిద్దా''. అన్నారు.

చెల్లి సెంటిమెంట్

చెల్లి సెంటిమెంట్


ఈ సినిమాలో చెల్లెలి సెంటిమెంట్ ఉంది. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో ఓ హీరోయిన్ అయిన జరా షా ఇందులో నాగార్జున చెల్లెలిగా బాగా నటించింది.నాగార్జున సౌకర్యమైన హీరో. అతడితో పనిచేయడం గొప్ప అనుభవం. అలాగే నాగ్‌ కొత్తవారిని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. నాలానే ఎందరినో ప్రోత్సహించారాయన. అలాగే దర్శకుడికి స్వేచ్ఛనివ్వడంలో ఆయన తర్వాతే. నిర్మాణ విలువల్లోనూ ఏమాత్రం తగ్గరు. కొన్నిసార్లు నేచురల్‌ లొకేషన్‌లో షూటింగ్‌ చేద్దామంటే ఇబ్బందికర పరిస్థితి. దానిని దృష్టిలో ఉంచుకుని రూ.కోటి పైగా ఖర్చు చేసి సెట్‌ వేశారంటే బడ్జెట్‌ విషయంలో ఆయన రాజీలేనితత్వం అర్థమవుతుంది.

నెక్ట్స్ చిత్రాలు

నెక్ట్స్ చిత్రాలు

'నేను తీసింది రెండు సినిమాలే అయినా... తెరపై వినోదాల్ని పండించడంలో పట్టున్న దర్శకుడనే పేరు నాకు లభించింది. నాపై అది మరింత బాధ్యతని పెంచింది. ఇ.వి.వి.సత్యనారాయణగారి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాను. వినోదాత్మక సన్నివేశాలను తెరకెక్కించడంలో ఆయనే నాకు స్ఫూర్తి. ఎలాంటి నేపథ్యంతో నేను సినిమాలు తీసినా... వినోదాన్ని మాత్రం మరిచిపోను. థియేటర్‌కి వచ్చే ప్రతీ ప్రేక్షకుడు కోరుకొనే అంశం అదే. 'భాయ్‌' తర్వాత చేయబోయే సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాను'' అని చెప్పారు.

English summary
Bhai is an upcoming Telugu film directed by Veerabhadram Chowdary and produced by Akkineni Nagarjuna under Annapurna Studios in association with Reliance Entertainment. starring Akkineni Nagarjuna and Richa Gangopadhyay in the lead roles.While Prasanna and Sonu Sood playing in important roles. The film marks the debut of actor Prasanna in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X