»   »  ‘ఈడు గోల్డ్ ఎహే’ తో నిరాశపరిచా, క్షమించండి అంటూ...

‘ఈడు గోల్డ్ ఎహే’ తో నిరాశపరిచా, క్షమించండి అంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''ఈడు గోల్డ్ ఎహే చిత్రాన్ని మెచ్చిన వాళ్లకు థ్యాంక్స్. ఈ సినిమాతో నిరాశ పరిచినందుకు మత్రం మన్నించమని కోరుతున్నా. ఆత్మ పరిశీలన చేసుకుని.. ఈసారి స్క్రిప్టు విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటాను.

'ఈడు గోల్డ్ ఎహే' స్క్రిప్టు.. మేకింగ్ విషయంలో నిర్మాత అనిల్ సుంకర నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయన నిజమైన జెంటిల్మన్'' అన్నారు దర్శకుడు వీరూపోట్ల. అయితే సినిమా రిలీజ్ అయ్యి ఎంతో కాలం కాకముందే ఇలా ఓపెన్ అయ్యిపోవటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కానీ దానికి కారణముంది.


బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి విజయవంతమైన చిత్రాలు అందించిన వీరూ.. 'ఈడు గోల్డ్ ఎహే'తో నిరాశ పరిచాడు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఫైనల్ గా సినిమా ఫ్లాప్ అని తేల్చారు.

అయితే వీరూ పోట్ల అద్బుతమైన స్క్రిప్టు తెచ్చాడని, ఈ సినిమా విషయంలో వీరూకు నిర్మాత అనిల్ సుంకర ఫ్రీడమ్ ఇవ్వలేదని.. ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరూ పోట్ల ఇలా స్పందించాల్సి వచ్చింది.


సునీల్‌ సరసన సుష్మారాజ్‌, రిచా పనయ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పునీత్‌ ఇస్సార్‌, డా|| నరేష్‌, అరవింద్‌, చరణ్‌, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, ప్రభాస్‌, భరత్‌, అనంత్‌, రాజా రవీంద్ర, లంబోదర, మాస్టర్‌ అక్షిత్‌, నల్లవేణు, గిరిధర్‌, సుదర్శన్‌, విజయ్‌, జోష్‌ రవి, పి.డి.రాజు, పవన్‌, గణేష్‌, కోటేశ్వరరావు, జగన్‌, సత్తెన్న, అవంతిక, బేబి యోధ, లలిత, లక్ష్మి, శ్రీలేఖ, అశోక్‌ తలారి మిగతా పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దేవరాజ్‌, సంగీతం: సాగర్‌ ఎం. శర్మ, ఆర్ట్‌: వివేక్‌ అన్నామలై, ఫైట్స్‌: గణేష్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికిపాటి, కో-ప్రొడ్యూసర్‌: అజయ్‌ సుంకర, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు పోట్ల.

English summary
"Thanks to whoever liked #EeduGoldEhe. And apologies to the ones who disappointed. Will introspect and come up with a better script next time," posted Veeru Potla on his Twitter handle.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu