»   » విడుదలే కాలేదు అప్పుడే సీక్వెలా..?

విడుదలే కాలేదు అప్పుడే సీక్వెలా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న దర్శకుల్లో విక్రం కుమార్ ఒకరు. చేసే ప్రతి సినిమాలో ఓ కొత్త కథా వస్తువుతో ప్రేక్షకులను అలరిస్తున్న విక్రం కుమార్ సూర్యతో 24 సినిమా చేశాడు. 24 సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సూర్య మరోసారి తన నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించాడని తెలుస్తుంది.

అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా సీక్వెల్ కూడా తీసే ఆలోచనలో ఉన్నాడట విక్రం కుమార్. అయితే సీక్వెల్ చేసేది రేపు సినిమా విడుదలయ్యక.. టాక్ ను బట్టి నిర్ణయిస్తారట., బాలీవుడ్ లో ఎలా ఉన్నా సౌత్ లో మాత్రం 24 సినిమా సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని అంటున్నారు దర్శకుడు. తమిళ, తెలుగు బాషలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్ రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.


director vikram kumar sequal plan for surya's Movie 24

అలాగే బాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు కూడా రీమేక్ చేయడానికి ఉవ్విల్లురుతున్నారు. అయితే ఈ రీమేక్ కూడా 24 రిసల్ట్ ను బట్టే ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సూర్య సరసన సమంత, నిత్య మీనన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం మాత్రమే కాక ఐదు రకాల షేడ్స్ లలో కనిపించనున్నాడు..


యూ.ఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోల రూపంలో సినిమా షోస్ పడుతున్నాయి. మరి రేపు రిలీజ్ అవుతున్న 24 ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

English summary
The director of the upcoming science fiction thriller movie 24 Vikram Kumar is planning for sequel .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu