»   » 'బద్రీనాధ్' స్క్రిప్టుతో వివి వినాయక్ పూజలు

'బద్రీనాధ్' స్క్రిప్టుతో వివి వినాయక్ పూజలు

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్‌ అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి పాదాలవద్ద బద్రీనాథ్‌ స్క్రిప్ట్‌ను ఉంచి పూజలు చేశారు. ఆలయం వద్ద ఆయనకు అర్చకులు, అభిమానులు స్వాగతం పలికారు. ఠాగూర్‌ నిర్మాత మధు నిర్మాణ సారథ్యంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్ ‌పై అల్లు అర్జున్‌, తమన్నా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ నిర్మాత. కథ చిన్నికృష్ణ, కెమెరా రవివర్మ, సంగీతం కీరవాణి అం దిస్తున్నారు.

అంతర్వేది మెరక వీథిలో నూతన విగ్రహ ప్రతిష్ట జరిగిన రామాలయానికి ఐదు వేల రూపాయల విరాళాన్ని వినాయక్‌ అందజేశారు. ఆయన వెంట నిర్మాత మధు, వినాయక్‌ తండ్రి కృష్ణారావు, సోదరుడు సురేంద్ర, ఎంపీపీ లింగోలు మహలకి, ఆలయ ట్రస్టీ జంపన అర్జునరాజు ఉన్నారు.

బద్రీనాథ్‌ చిత్రం తనకు 11వ చిత్రమని దర్శకుడు వినాయక్‌ అన్నారు. అంతర్వేది ఆలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రేమ కథా చిత్రాన్ని ఈ నెల 25న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu