For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అంతర్వేదిలో వి.వి.వినాయక్‌ పూజలు...ఎందుకంటే

  By Srikanya
  |

  అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ దర్శకుడు వి.వి.వినాయక్‌ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు మంత్రోచ్చరణలతో ఆశీర్వచనాలను అందించారు.

  అనంతరం వినాయక్‌ మాట్లాడుతూ ....ప్రముఖ సినీ హీరో నాగార్జున తనయుడు అఖిల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం పూర్తయిన సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నామన్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల చేయనున్నట్లు వి.వి.వినాయక్‌ తెలిపారు.

  దర్శకుడు వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ ''నాగార్జున అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాం. సినిమా అంతా బాగొచ్చింది. ఓ సన్నివేశంలో వీఎఫ్‌ఎక్స్‌ కోసం కాస్త సమయం కావాల్సొచ్చింది. ఆ సమయం ఇవ్వకపోతే మా తప్పు అవుతుందనిపించింది. మేమంతా కలసి తీసుకొన్న నిర్ణయమిది. అభిమానులు ఇప్పుడు నిరాశకి గురికావొచ్చు. అందరూ ఆనందపడే గొప్ప సినిమా అవుతుందని మాత్రం మనస్ఫూర్తిగా చెబుతున్నా. సినిమాని ఎప్పుడు విడుదల చేస్తామన్నది త్వరలోనే ప్రకటిస్తామ''న్నారు.

  Director VV VInayak @ Antarvedi Narasimha Swamy temple

  అఖిల్‌ అక్కినేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అఖిల్' . 'ది పవర్‌ ఆఫ్‌ జువా...' అనేది ట్యాగ్ లైన్. సాయేషా సైగల్‌ హీరోయిన్. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్‌, సుధాకర్‌రెడ్డి నిర్మాతలు. అగ్నిగోళాన్ని సైతం తన చేతుల్లో ఇముడ్చుకోగల ధీశాలి ఆ కుర్రాడు. భగ భగ మండే సూర్యుడిని తలపించే అతని పయనం ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగిందో తెలియాలంటే 'అఖిల్‌' చిత్రాన్ని చూడాల్సిందే.

  ''రాజమౌళిగారు విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో ప్రత్యేకమైన ప్రమాణాల్ని నెలకొల్పారు. కేవలం విజువల్‌ ఎఫెక్ట్స్‌ (వీఎఫ్‌ఎక్స్‌) కోసమే ఆయన 'బాహుబలి'ని అనేకసార్లు వాయిదా వేశారు. అది తెలిసీ సాధారణమైన వీఎఫ్‌ఎక్స్‌ సినిమాని విడుదల చేయడం ఎందుకు అనిపించింది. అందుకే 'అఖిల్‌' విడుదలను వాయిదా వేస్తున్నామ''అన్నారు నాగార్జున. ఈ నెల 22న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకొన్నారు. వీఎఫ్‌ఎక్స్‌ కోసమని చిత్రాన్ని వాయిదా వేశారు

  నిర్మాతలు మాట్లాడుతూ...''మాస్‌ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. అఖిల్‌ చేసే యాక్షన్‌ హంగామా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అని చెబుతున్నారు. ఈ సందర్బంగా ఈ చిత్రం ధియోటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.

  నాగార్జున మాట్లాడుతూ ''అఖిల్‌ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆత్రుత నాలో ఉండేది. ఈ మధ్యే చూశా. ఇప్పుడు ప్రేక్షకులకు ఎప్పుడు చూపిద్దామా అనే ఆత్రుతలో ఉన్నా. 22న వస్తుందని అంతా అనుకొన్నాం. వీఎఫ్‌ఎక్స్‌ పని పూర్తికాక వాయిదా వేయాల్సివచ్చింది. అనుకొన్న సమయంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతున్నందుకు బాధగా ఉంది. ఆ సినిమాకు వీఎఫ్‌ఎక్స్‌ ముఖ్యం. ఇప్పటిదాకా చేసిన వీఎఫ్‌ఎక్స్‌ బాగున్నాయి. ఒక చిన్న సన్నివేశంలో వీఎఫ్‌ఎక్స్‌ నచ్చలేదు. అంతా బాగుండి, ఆ ఒక్క సన్నివేశం బాగోలేకపోవడం ఎందుకు అనిపించింది. అది సమయం చాలకపోవడంతోనే అలా జరిగింది. దర్శకుడు వీఎఫ్‌ఎక్స్‌ను వూహించుకొంటూ చిత్రాన్ని బాగా తీశారు. వీఎఫ్‌ఎక్స్‌ బృందం బాగా పనిచేసింది. ఆ ఒక్క సన్నివేశానికి సంబంధించిన పనులు పూర్తవ్వగానే విడుదల తేదీని ప్రకటిస్తా మ''న్నారు.

  సినిమా ఇలా వాయిదా వేయడంవల్ల అభిమానులు నిరుత్సాహపడతారు కదా? అన్న ప్రశ్నకు నాగార్జున బదులిస్తూ ''అభిమానులే కాదు, నేనూ నిరుత్సాహానికి గురయ్యా. వేరే ఏ కారణంతో సినిమా వాయిదా పడటం లేదు. కేవలం వీఎఫ్‌ఎక్స్‌ కోసమే. సినిమా విడుదలయ్యాక అందరూ ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకొంటారన్న నమ్మకం నాకుంది. నేను సినిమా చూసినప్పట్నుంచి షాక్‌లో ఉన్నా. ముఖ్యంగా అఖిల్‌ డ్యాన్సుల్ని చూసి ఆశ్చర్యపోయా. నా ఇంట్లోనేనా ఇంత మంచి డ్యాన్సర్‌ తిరుగుతున్నాడనిపించింది. సినిమా చూసొచ్చాక ఓ ఐదు నిమిషాలు అఖిల్‌ని చూస్తూ అలా ఉండిపోయా. 'ఎక్కడ నేర్చుకొన్నావురా ఇంత డ్యాన్స్‌' అని అడుగుతున్నా. తన స్థాయి నా వూహకి అందలేదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అదే భావనకి గురవుతార''న్నారు.

  Director VV VInayak @ Antarvedi Narasimha Swamy temple

  ఒక మంచి విడుదల తేదీని కోల్పోతున్నారు కదా అంటే ''అఖిల్‌ సినిమా ఎప్పుడు విడుదలైతే అప్పుడే మంచి రోజు. విజయదశమి మంచి రోజే కాదనను. కానీ మంచి సినిమా ఎప్పుడు విడుదల చేసినా బ్రహ్మాండంగా ఉంటుంద''న్నారు. ఇందులో మీరు అతిథి పాత్ర పోషిస్తున్నారట కదా అన్న ప్రశ్నకు అటువంటిదేమీ లేదని నవ్వుతూ సమాధానమిచ్చారు.

  శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

  English summary
  VV Vinayak director is a devotee of Antarvedi Narasimha Swamy. He takes the first copy to the temple and gets special pooja performed there.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X