twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడు వినాయక్‌ బహిరంగ క్షమాపణ

    By Srikanya
    |

    తిరుపతి : 'నాయక్‌' సినిమాలో విలన్ పాత్ర(రాహుల్‌దేవ్‌)కు గండిపేట గండి బాబ్జీ అని పేరు పెట్టడంపై ఆ చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్‌ ఆదివారం పరవాడ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి బహిరంగ క్షమాపణ చెప్పారు. చిత్ర విజయోత్సవ కార్యక్రమానికి విశాఖ వచ్చిన ఆయన విమ్యాక్స్‌ థియేటర్‌ వేదికపైకి బాబ్జీని ఆహ్వానించి క్షమాపణ కోరారు. గండి బాబ్జీ పేరు బాగుందని ప్రతినాయకుడి పాత్రకు ఈ పేరు పెట్టామే తప్ప, ఆ పేరుతో మాజీ ఎమ్మెల్యే ఉన్నారని తనకు తెలియదని వినాయక్‌ అన్నారు.

    బాబ్జీ మనోభావాలు దెబ్బతిన్నందుకు చింతిస్తున్నానని, విశాఖ జిల్లాలో నాయక్‌ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో ప్రతినాయకుడి పాత్రకు గండి బాబ్జీ పేరును తొలగించినట్లు వివరణ ఇచ్చారు. తమకు సహకరించినందుకు బాబ్జీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినాయకుడి పాత్రకు తన పేరు పెట్టారని చిత్ర దర్శకుడు వినాయక్‌, నిర్మాత దానయ్య, సమర్పకుడు రాధాకృష్ణపై మాజీ ఎమ్మెల్యే బాబ్జీ పెందుర్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

    రామ్‌చరణ్‌తేజ హీరోగా నటించిన నాయక్ సినిమాలో ప్రతి నాయకుడికి తన పేరును వాడినందుకు చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు గండి బాబ్జి మంగళవారం పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాయక్ సినిమాలో ప్రతినాయకుడి పేరును గండిపేట గండి బాబ్జిగా పెట్టడం పట్ల ఆయన అభ్యంతరం తెలియచేశారు. తనను కించపరిచేవిధంగా ఈ సినిమాలో తన పేరును ప్రతి నాయకుడికి పెట్టడంపై తన అభ్యంతరాన్ని చిత్ర సమర్పకుడు రాధాకృష్ణ, నిర్మాత దానయ్య, దర్శకుడు వివి వినాయక్‌కు తెలిపానని, అయినా వారి నుంచి స్పందన రాకపోవడంతో సినిమా యూనిట్‌పై క్రిమినల్ కేసు పెట్టాలంటూ సిఐకి అందచేసిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

    తనను కించపరచడమే కాకుండా, రాజకీయంగా తన ఎదుగుదలను అడ్డుకునే విధంగా ఈ చిత్రంలోని తన పేరును వాడుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరును తొలగించే వరకూ రాష్ట్రంలో చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. అలాగే, చిత్రానికి సంబంధించి యూనిట్ సభ్యులతో మాట్లాడినా, ప్రజా ప్రతినిధిగా తనకు గౌరవం ఇవ్వలేదని, స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అన్నారు. మొత్తా నికి వివాదం ఓ కొలిక్కి వచ్చింది.

    English summary
    Nayak director VV Vinayak has told apology to Former MLA Gandi Babji on villain name in cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X