»   » ‘ఊపిరి’ మూవీపై వివి వినాయక్ కామెంట్

‘ఊపిరి’ మూవీపై వివి వినాయక్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మార్చి 25న విడుదలైన ఊపిరి సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఊపిరి సినిమాను చూసి అభినందిస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఊపిరి సినిమా వీక్షించారు.

అనంతరం వి.వి.వినాయక్ మాట్లాడుతూ ''ఊపిరి సినిమా చూశాను ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. ఊపిరి చిత్రాన్ని ఒక విభిన్నమైన కథాంశంతో, కొత్త తరహా చిత్రాన్ని తీసిన వంశీపైడిపల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాగార్జున వంటి పెద్ద హీరో ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయడం చాలా గొప్ప విషయం. ఆయన సూపర్బ్ గా నటించారు. అలాగే కార్తీ, తమన్నా క్యారెక్టర్స్ కూడా బావున్నాయి. ఊపిరితో తెలుగు సినిమాకు ఊపిరి పోసిన పివిపిగారికి, యూనిట్ కు నా అభినందనలు. వంశీపైడిపల్లి, అఖిల్ రెండో సినిమా చేస్తున్నారని తెలిసి చాలా హ్యపీగా ఫీలయ్యాను. వంశీ, అఖిల్ తో చేసే సినిమా డెఫనెట్ గా సూపర్ హిట్ అవుతుంది'' అన్నారు.

 Director VV Vinayak appreciates Oopiri

రాజమౌళి ప్రశంసలు...
మార్నింగ్ షో నుండే 'ఊపిరి' చిత్రానికి పాజిటివ్ పీడ్ బ్యాక్ వస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి... సినిమాపై, దర్శకుడు వంశీపై, నాగార్జున, కార్తీలపై ప్రశంసల వర్షం కురిపించారు. 'నాకు బాగా నచ్చిన చిత్రాల్లో ఇంటబుల్స్ ఒకటి. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాను వంశీ సరిగా హ్యాండిల్ చేస్తాడని అనుకోలేదు. కానీ నా ఊహ తప్పు అని నిరూపించాడు. థాంక్స్ వంశీ' అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు. కార్తీ చాలా బాగా చేసాడు. నాగార్జున గారు నిజమౌన పాత్ బ్రేకర్. ఊపిరి మిమ్మల్ని చాలా కాలం పాటు వెంటాడే నిజమైన ఎంటర్టెనర్. ఈ సినిమాను మిస్ కావొద్దు అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు.

'ఊపిరి' చిత్రాన్ని పివిపి సంస్థ రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళంలో తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 వేల థియేటర్లలో ఈ సినిమాను ఈ రోజు రిలీజ్ చేసారు. ఈ సినిమాకు పబ్లిసిటీ కోసం కూడా బాగా ఖర్చు పెట్టారు. ఆల్రెడీ అన్ని చోట్ల నుండి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.

English summary
Tollywood Director VV Vinayak appreciates Nagarhuna, Karthi starrer 'Oopiri', directed by Vamsi Paidipally.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu