»   » సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ కు పితృ వియోగం

సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ కు పితృ వియోగం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిత్ర పరిశ్రమకు తండ్రిలాంటి వారైన వేటూరి సుందరరామ్మూర్తి మరణవార్త ఇంకా ముగియకుండానే మరో దర్శకుడు తన తండ్రిని కోల్సాయాడు ..సెన్సేషనల్ డైరక్టర్ వివి వినాయక్ కి పితృవియోగం కలిగింది..రాజమండ్రి శివార్లలోని బొల్లినేని హార్ట్ కేర్ సెంటర్, రాజమండ్రిలో చికిత్స పొందుతూ..వినాయక్ తండ్రి కృష్ణారావు(70) ఈ రోజు(మంగళవారం) తన తుది శ్వాసను విడిచారు..మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లుకి తరలించారు. తన తండ్రి మరణ వార్త విన్న వినాయక్ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాడు. తనకు సకలం తన తండ్రే అని ఆయన వెనుక ప్రోత్సాహంతోనే నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాననీ వినాయక్ విలపించాడు. వినాయక్ తండ్రి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu