For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రాజకీయ చెత్త చేరకుండా చూడండి, శాలువాల ఖర్చు కూడా దండగే : వివి వినాయక్

  By Bojja Kumar
  |

  అనారోగ్యం కారణంగానో, సరైన ఉపాధి లేక పోవడం వల్లనో కష్టాల వలయంలో చిక్కుకున్న సినిమా ఆర్టిస్టులు, టెక్నిషియన్లు, సినిమా కార్మికులకు, పేదలకు సహాయం కోసం ఏర్పాటైన సంస్థ 'మనం సైతం'. నటుడు కాదంబరి కిరణ్ నేతృత్వంలో నడుస్తున్న ఈ సంస్థకు మెగా స్టార్ చిరంజీవితో పాటు సినీ ప్రముఖులు తమవంతు సహాయం అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు. ఈ సంస్థకు తన వంతుగా సహాయం అందించిన ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.

  వినాయక్ మళ్లీ షాకిచ్చాడు.. అఖిల్ దారిలోనే..!
  రాజకీయ చెత్త చేరనీయవద్దు: వినాయక్

  రాజకీయ చెత్త చేరనీయవద్దు: వినాయక్

  ‘మనం సైతం' అనే సంస్థ సినిమా ఇండస్ట్రీ వారిచే, వారి సహాయంతో ముందుకు సాగుతున్న సంస్థ కావడం గర్వకారణంగా ఉంది. కాదంబరి కిరణ్ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటువంటి సంస్థలు పెరుగుతున్నపుడు పదవులు, ఎలక్షన్లు, రాజకీయాలు ఈ చెత్తంతా చేరుతుంది. ఈ సంస్థలో అలాంటివి చేరకుండా చూడాలి. చీమలు పుట్టలు పెడితే పాములు వచ్చి ఉంటాయన్నట్లు... దయచేసి ఆ పరిస్థితి ఒక మంచి సంస్థకు రానివ్వద్దు.... అని వివి వినాయక్ అన్నారు.

   శాలువాల ఖర్చు కూడా దండగే

  శాలువాల ఖర్చు కూడా దండగే

  నా తరుపున ఒక లక్ష రూపాయలు కిరణ్ గారికి ఇస్తున్నాను. దాన్ని ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించండి. ఎలాంటి సహాయం కావాలన్నా ఫోన్ చేయాలని కోరుతున్నాను. ఇక్కడికొచ్చే గెస్టులకు ఈ శాలువాలు కూడా ఇవ్వద్దు. ఈ ఖర్చు కూడా అనవసరంగా పెట్టవద్దు. ఇది కూడా ఓ పేదవాడికి పెట్టండి.... అని వివి వినాయక్ సూచించారు.

  కష్టాల్లో ఉన్న వారిని ఇండస్ట్రీ పెద్దలు దగ్గరకు రానివ్వరనే అపోహ ఉంది

  కష్టాల్లో ఉన్న వారిని ఇండస్ట్రీ పెద్దలు దగ్గరకు రానివ్వరనే అపోహ ఉంది

  ఒక ఉద్యమంలా మొదలు పెట్టిన ‘మనం సైతం' సంస్థకు సినిమా పెద్దల దీవెనలు పెద్ద సంఖ్యలో రావడం నా అదృష్టం. మా లాంటి చిన్న వారికి ఏదైనా కష్టం వస్తే ఎవరూ చెప్పుకునే వారు కాదు. కష్టంలో ఉన్న మనిషిని దగ్గరికి రానివ్వరు, అవకాశం ఇవ్వరు అనే అపోహ ఉండేది. నేను చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత కాదని తేలింది. పెద్దలందరూ తప్పకుండా ఆశీర్వదిస్తారు, మనకు వెన్నంటి ఉంటారని నమ్మి నేను కష్టం చెప్పుకోవడం మొదలు పెట్టాను..., పెద్దలు ఇచ్చి సహాయాన్ని, ధైర్యాన్ని పేదల వరకు తీసుకెళ్లగలుతున్నాను అని కాదంబరి కిరణ్ అన్నారు.

   చిరంజీవిగారు 2 లక్షల ఏనుగుల బలం ఇచ్చారు

  చిరంజీవిగారు 2 లక్షల ఏనుగుల బలం ఇచ్చారు

  చిరంజీవిగారు ఇంటికి పిలిచి నువ్వు చేసే కార్యక్రమాలు చాలా బావున్నాయి, ఈ క్షణం నుండి నేను నీ వెనకాల ఉన్నానని బయటకు వెళ్లి చెప్పుకో, అప్పటి వరకు ఖర్చు పెట్టు అని 2 లక్షలు ఇచ్చారు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, ఏ ధైర్యం కావాలన్నా నేను ఉన్నా, ఏ ఆసుపత్రికి ఫోన్ చేయాలన్నా నేనున్నాను, ఎక్కడి రావాలన్నా నేను సిద్ధమే అని చెప్పి.... 2 లక్షల రూపాయలు ఇచ్చి రెండు లక్షల ఏనుగుల బలాన్ని నాకు ఇచ్చారు..... అని కాదంబరి కిరణ్ అన్నారు.

  వీరంతా సహాయం చేశారు

  వీరంతా సహాయం చేశారు

  జోవిలపల్లి సంతోష్ కుమార్ గారు, కొరటాల శివగారు, రామ్ నామగిరి, బందరు బాబీగారి భార్య ఆకుల కవితగారు, ప్రవీన్ కుమార్ యాదవ్, బివి నాయుడు, ఎం ఓబులేష్, పూరి జగన్నాథ్, జువ్వాడి వెంకటేశ్వర్ రావు, వల్లభనేని అనిల్, గౌరీ శంకర్ ధార, చింతల సుబ్రహ్మణ్యం, హరీష్ శంకర్, పుట్ట గోవింద్ ఇలా అనేక మంది సహాయం చేశారు అని కాదంబరి కిరణ్ అన్నారు.

  English summary
  Director VV Vinayak Superb Speech at Manam Saitham Press Meet. Manam Saitham Kadambari Group is a global humanitarian relief and development organization responding to human sufferings in emergency and disaster situations around the world. In addition to our emergency relief efforts in natural or man-made disasters, we also work on long term relief and development programs.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more