»   » సెక్సువల్ గా హెరాస్ , డైరక్టర్ పై కేసు పెట్టిన వర్మ హీరోయిన్

సెక్సువల్ గా హెరాస్ , డైరక్టర్ పై కేసు పెట్టిన వర్మ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి (ఆగిపోయిన సినిమా) ఫొటో షూట్ తో పరిచయమై, పాపులరైన అనుకృతి పై దర్శకుడు యోగి కేసుపెట్టబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.

ఇప్పుడు ఆమె ....ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యోగి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని,సెక్సవల్ గా హెరాస్ చేస్తున్నాడని,చంపేస్తానని భయపెడుతున్నాడని ఆరోపిస్తూ కేసు పెట్టింది. అంతేకాకుండా యోగి తనను అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించమని కోరుతున్నాడని, అంతకు ముందు తనకు వినిపించిన స్క్రిప్టులో అవి లేవని చెప్తోంది. కాగా పాప సినిమాలో తన పాత్ర డైలాగ్స్ అసభ్యంగా ఉన్నయని, ఇవి తన ఇమేజ్ ను దెబ్బతీస్తాయని హీరోయిన్ అనుకృతి చెప్పింది.

ఇక యోగి వెర్షన్ ఏమిటీ అంటే..ఆమె ఓ టాలీవుడ్ నటుడుని పెళ్లిచేసుకోబోతోందని, అందుకే తమకు కో ఆపరేట్ చేయటం లేదని చెప్తున్నారు. ఈ సినిమా నుంచి అనుకృతి అర్ధాంతరంగా తప్పుకుందని యోగి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై యోగి స్పందిస్తూ.. షూటింగ్ మొదలుకావడానికి ముందే హీరోయిన్ అనుకృతికి స్క్రిప్ట్, డైలాగ్స్ వినిపించామని, వాటిలో ఎలాంటి అసభ్యత లేదని, మొదట ఒప్పుకొని షూటింగ్ మధ్యలో ఇలా తప్పుకోవడం దారుణమని అన్నాడు.

ఇప్పటివరకు షూట్ చేసిన సీన్ల తాలూకు రషెస్ తనకు తిరిగి ఇచ్చేస్తే రెమ్యునరేషన్ తరిగి ఇచ్చేస్తానని హీరోయిన్ అనుకృతి అంటున్నారని దర్శకుడు యోగి చెప్పారు. రెమ్యునేషన్ తిరిగి ఇచ్చేస్తుంది ఓకే, కాని షూటింగ్ కు అయిన ఖర్చు ఎవరు ఇస్తారు, అందుకోసం ఖచ్చు పెట్టిన సమయం ఎవరు ఇస్తారు అని అంటున్నారు నిర్మాతలు. మరి ఈ వివాదం ఏ ఒడ్డుకు చేరుతుందో చూడాలి.

స్లైడ్ షోలో ... ఆమె రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి కోసం చేసిన ఫొటో షూట్ ఫొటోలు చూడవచ్చు.

వివాదం

వివాదం

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘శ్రీదేవి' సినిమాతో సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు.

టీచర్ అనేసరికి

టీచర్ అనేసరికి

చిన్నప్పుడు నేను మా సరస్వతి టీచర్ కి అట్రాక్ట్ అయ్యేవాడిని, దాన్ని బేస్ చేసుకుని ‘శ్రీదేవి' సినిమా చేస్తున్నాను అంటూ ఆయన చెప్పడంతో పెద్ద దుమారమే రేగింది.

ఆందోళనలు

ఆందోళనలు

ఉపాధ్యాయ సంఘాలతో పాటు మహిళా సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి.

సమాధానం

సమాధానం

వర్మ ఈ ఆందోళన కార్యక్రమాలు, విమర్శలపై తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. కొంత మందికి నా సినిమా పోస్టర్ కంటే నా ప్రెస్ నోట్‌లో నేను ప్రస్తావించిన ‘సరస్వతీ టీచర్' అంశం ఎక్కువగా కోపం తెప్పించిందని తెలిసింది.

నేను మల్లీ చెబుతున్నా..

నేను మల్లీ చెబుతున్నా..

చిన్నప్పుడు నేను మా సరస్వతి టీచర్ కి అట్రాక్ట్ అయ్యేవాడిని. ఈ మాట నేను ఈ మధ్య ఆవిడకి కూడా చెప్పాను. ఆవిడ దాన్ని అర్థం చేసుకున్నారు.

ఎందుకంటే...

ఎందుకంటే...

‘యవ్వనం వికసిస్తున్న రోజుల్లో అలాంటి భావాలు కలుగడం చాలా సహజం' అనే ఇంగిత జ్ఞానం ఆవిడకు ఉంది కాబట్టి! ఆవిడకే ఏ సమస్య లేనప్పుడు, వేరే ఏమీ తెలియనివాళ్లకు ఏం సమస్యో...నాకు సమస్య అయ్యి కూర్చుంది.

వెర్రితనం

వెర్రితనం

ఇక నా సినిమా పోస్టర్ చూసి, కథేమిటో వాళ్లే ఊహించేసుకుని...పోస్టర్ లో ఉన్న అమ్మాయి ‘టీచర్' అని ఫిక్సయిపోతే...అంతకన్నా వెర్రితనం లేదు.

ఆశ్చర్యం

ఆశ్చర్యం

ప్రెస్ నోట్ లో అంత క్లియర్ గా నేను రాసిన తర్వాత కూడా అర్థం చేసుకోలేనంత నిరక్షరాస్యత వాళ్లలో ఉండటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.

సెన్సార్ ఉందిగా

సెన్సార్ ఉందిగా

మొత్తం సినిమా తీసాక, అందులో అభ్యంతరమైన సన్నివేశాలుంటే...ఆ వ్యవహారం చూడ్డానికి సెన్సార్ బోర్డ్ ఉంది. సెన్సార్ బోర్డ్ ను అధిగమించి...వీళ్లే నిర్ణయాలు తీసుకొంటామంటే..ఇక సెన్సార్ బోర్డ్ ఎందుకు? అని అప్పట్లో మండిపడ్డారు.

English summary
Anukriti approached the police and filed a complaint against Yogesh alleging that the director had tried to harass her sexually and threatened to kill her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu