»   » పూరీ పైనేనా 'ఏక్ నిరంజన్' నిర్మాత కామెంట్?

పూరీ పైనేనా 'ఏక్ నిరంజన్' నిర్మాత కామెంట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభాస్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో ఏక్ నిరంజన్ చిత్రాన్ని నిర్మించిన ఆదిత్యరామ్...విపరీతంగా పెరిగిన స్టార్స్ రెమ్యునేషన్లపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ..దర్శకులు, స్టార్స్ రీజన్ బుల్ లెవివ్స్ కు దిగి రెమ్యునేషన్స్ తీసుకోవాలి. అలాగే దర్శకులు కూడా అనవరసమైన ఖర్చుని ఎవాయిడ్ చేయాలి. అలాగే మరింత ఎక్కువ సేపు తాము చేస్తున్న చిత్రంపై దృష్టి పెట్టాలి. అలాగే స్టార్ కి ఎంత సేలబులిటీ మార్కెట్లో ఉందో దాన్నిబట్టి బడ్జెట్ ప్లాన్ చేయాలి. ఇవన్నీ ఎందుకంటే కేవలం మూడు పర్శంట్ మాత్రమే లాస్ట్ ఇయర్ సక్సెస్ రేటు ఉంది. నేను కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ని కంట్రోల్ లో పెట్టుకుంటే సమస్య సాల్వ్ అవుతుందనుకుంటున్నాను అన్నారు. ఇక ఏక్ నిరంజన్ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కామెంట్ చేసారని పరిశ్రమ వర్గాల్లో వినపడుతోంది. ఆయనకి మొదట చెప్పిన బడ్జెట్ ని మించి దాదాపు 26 కోట్లు ఏక్ నిరంజన్ చిత్రానికి అయ్యింది. దాంతో మొదట ప్రకటించినట్లుగా వరసగా పది సినిమాలు ఆయన నిర్మించటం లేదు. పూరీ జగన్నాధ్..ఆ చిత్రం షూటింగ్ సమయంలో నిర్లక్ష్యం గా వ్యవహించాడని, అదే ఆయన మనస్తాపానికి కారణం అయ్యిందని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం హిట్టవుతే ఆ కథ వేరేగా ఉండేదని, అప్పుడు ఈ లెక్కలు ఏమీ రావని చెప్పుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu