»   » సీనియర్ నటి రాధికను అవమానం చేసారు..బాధాకరం, నిర్మాత క్షమాపణ

సీనియర్ నటి రాధికను అవమానం చేసారు..బాధాకరం, నిర్మాత క్షమాపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సీనియర్ నటి రాదిక గురించి ప్రత్యేకంగా ఈ రోజు చెప్పేదేముంది. తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేసి, తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తున్న ఆమె అంటే అందరికీ అభిమానమే. అయితే తాజాగా ఆమె నటించిన విజయ సేతుపతి చిత్రం ధర్మ దురైలో ఆమెను ఇన్సల్ట్ చేసారంటున్నారు శరత్ కుమార్.

ఈ విషయమై శరత్ కుమార్ చేసిన ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచుతోంది. ధర్మదురై ని ఆయన తన భార్య రాధికతో కలిసి చూసి ఈ కామెట్స్ చేసారు. తమన్నా, విజయసేతుపతి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో రాధిక కీ రోల్ చేసింది.


ఇక ఆయన బాధ పడింది..సినిమాలో ఆమె పాత్ర గురించి కాదట. టైటిల్ కార్డ్ లలలో రాధిక వంటి సీనియర్ పేరు ని ఎక్కడో కొత్త ఆర్టిస్ట్ లు పేర్లు వేసాక వేయటం ఆయన్ని బాధించింది. అంతటి సీనియర్ ని, నటిని ఎలా గౌరవించాలో ఇండస్ట్రీకి తెలియదా అన్నారు. ఇది రాధికకు సీనియర్ నటిగా జరిగిన అవమానమే అన్నారు ఆయన.

స్లైడ్ షోలో మరిన్ని నిర్మాత,దర్శకులు ఏమంటున్నారో చూద్దాం

నిర్మాత ఆర్.కె సురేష్ మాట్లాడుతూ..

నిర్మాత ఆర్.కె సురేష్ మాట్లాడుతూ..

ఈ విషయమై ధర్మ దొరై నిర్మాత సురేష్ మాట్లాడుతూ...ఇది ఇంటెన్షనల్ గా చేసింది కాదు, కేవలం టెక్నికల్ ప్లాబ్లమ్ , రాధికా మేడం అంటే మాకందరికీ చాలా గౌరవం అన్నారు

క్షమించమంటున్నా

క్షమించమంటున్నా


ఈ చిత్రం రిలీజ్ పోస్టర్స్ అన్నిటిలోనూ రాధికా ని ఉండేలా చూసాం. పొరపాటున జరిగిన ఈ విషయంలో ఆమెకు క్షమాపణ చెప్తున్నాను అన్నారు.

ఆరాదకుడుని

ఆరాదకుడుని

ఈ చిత్రం దర్శకుడు సీను రామసామి మాట్లాడుతూ ..తను రాధికకు వీరాభిమానిని అని, ఇంకా ఎక్కువ ఆరాధకుడుని అని చెప్పుకొచ్చారు. జరిగిన పొరపాటుకు బాధపడుతున్నాం అన్నారు

ఎంత అభిమానం అంటే

ఎంత అభిమానం అంటే

రాధిక అంటే నాకు ఎంత అభిమానం అంటే ...నా తదుపరి చిత్రంలోనూ ఆమెదే కీ రోల్. ఆవిడ డేట్స్ ఎక్కువ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒప్పుకోమని అడుగుతున్నాం అని దర్శకుడు చెప్పుకొచ్చాడు

చెప్తూనే ఉన్నా

చెప్తూనే ఉన్నా

సీనియర్స్ ని గౌరవించాలి అని అసెస్టెంట్స్ కు చెప్తూనే ఉన్నా, అయినా పొరపాటు జరిగింది. అందుకు చాలా బాధ పడుతున్నాం అన్నాడు దర్శకుడు

కలెక్షన్స్ బాగున్నాయి

కలెక్షన్స్ బాగున్నాయి

ఇక ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగానే రాబట్టుతోంది. ఫస్ట్ వీకెండ్ లోనే ఐదున్నర కోట్లు రాబట్టింది.

English summary
Was Raadhika Sarathkumar, one of the finest actresses Tamil cinema has ever seen, insulted by the makers of Vijay Sethupathi's Dharma Durai, which had her playing a key role? That's exactly what veteran actor and politician Sarathkumar has said, much to the surprise of many.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu