»   » దిశాపటానికి చేదు అనుభవం.. హోటల్‌లో వెంటపడిన..

దిశాపటానికి చేదు అనుభవం.. హోటల్‌లో వెంటపడిన..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటి దిశా పటానికి ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఓ అభిమాని ఆమె వెంట పడి వేధించడం వివాదాస్పదమైంది. అయితే సదరు అభిమానిపై దిశాపటానీ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వదిలేయడం గమనార్హం. ఈ విషయాన్ని ఇటీవల ఆమె మీడియాకు వెల్లడించారు.

భయపడిపోయాను..

భయపడిపోయాను..

నేను ఇటీవల ఓ బ్రాండ్ షూటింగ్ కోసం ఢిల్లీకి వెళ్లాను. ఆ సందర్భంగా ఓ వ్యక్తి చికాకు గురిచేశాడు. అతడి ప్రవర్తన చూసి నేను విపరీతంగా భయపడి పోయాను అని దిశా పటానీ తెలిపింది.

ఎక్కడికి పోయినా వెంటపడ్డాడు..

ఎక్కడికి పోయినా వెంటపడ్డాడు..

ఢిల్లీలో ఉన్న రోజులు నన్ను కలుసుకోవడానికి ఆ వ్యక్తి తీవ్రంగా ప్రయత్నించారు. హోటల్‌కు పలుమార్లు వచ్చాడు. హోటల్ సిబ్బంది వారించినా ఊరుకోలేదు. నేను సినిమా చూడటానికి థియేటర్‌‌కు వెళ్లినా, షాపింగ్ మాల్‌కు వెళ్లినా వెంటపడ్డాడు.

సిబ్బందితో గొడవకు..

సిబ్బందితో గొడవకు..

కొన్నిసార్లు హోటల్ సిబ్బందితో వాగ్వాదం దిగాడు. హోటల్ లోపలికి సిబ్బందిపై దాడికి కూడా పూనుకొన్నాడు. చివరికి పోలీసుల సహాయంతో అతడిని అక్కడి నుంచి పంపించివేయడంతో సమస్య పరిష్కారమైంది అని దిశా పటాని వెల్లడించింది.

కొన్నిసార్లు ఇబ్బందే..

కొన్నిసార్లు ఇబ్బందే..

ఆ ఘటన అంతటితో ఆగిపోవడంతో గొప్ప రిలీఫ్ కలిగింది. ఫ్యాన్స్ అభిమానం చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు దిగ్భ్రాంతికి లోనవుతాను. అభిమానులు హద్దు మీరి వ్యవహరించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అని దిశా తన ఆవేదనను వ్యక్తం చేసింది.

ఎంఎస్ ధోని

ఎంఎస్ ధోని

ఎంఎస్ ధోని చిత్రంతో బాలీవుడ్‌లో ప్రవేశించిన దిశాపటానికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఓ కాలేజీలో లవ్ ట్రీకి దిశ ఫొటోను పెట్టి పూజించారు. ప్రేమ వృక్షానికి కండోమ్ దండలు కట్టి తమ అభిమానాన్ని చాటుకోవడం చర్చనీయాంశమైంది.

English summary
Two-film-old Disha Patani is finally getting to know the scary side of being in showbiz. The actor was stalked by a male fan when she was in Delhi for a brand shoot recently. Disha told "I am relieved that the episode is over. When I got to know about it, I was in for a shock. It was an unpleasant experience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu