దిశ సలియాన్ మరణానికి ముందు.. ఫామ్‌ హౌజ్‌లో నిర్మాత బర్త్ డే.. ఆ అర్ధరాత్రి ఏం జరిగింది?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపైనే కాకుండా ఆయన మాజీ మేనేజర్ దిశా సలియాన్ అనుమానాస్పద మృతిపై ఎన్నో అనుమానాలు గత ఏడాది కాలంగా వ్యక్తం అవుతున్నాయి. దిశా సలియాన్ మరణించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ట్విట్టర్‌లో Did Disha Attend Ekta Party అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతున్నది. అయితే ఆ పార్టీకి వెళ్లినట్టు ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందనే విషయం మిస్టరీగా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు అనేక ప్రశ్నలు స్పందిస్తూ..

దిశా సలియాన్ మరణించి ఏడాది

దిశా సలియాన్ మరణించి ఏడాది

బాలీవుడ్‌లో ఐశ్వర్యరాయ్‌తోపాటు పలువురు పెద్ద స్టార్లకు మేనేజర్‌గా వ్యవహరించిన దిశా సలియాన్ అనూహ్య పరిస్థితుల్లో జూన్ 8, 2020లో మరణించారు. 14 అంతస్తుల భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకొన్నారనే వార్త బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపింది. ఆమెది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ నెటిజన్లు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుండటం తెలిసిందే.

పోలీసులకు ఫోన్ కాల్...

పోలీసులకు ఫోన్ కాల్...

అయితే తన మరణానికి ముందు దిశా సలియాన్ ఓ పార్టీకి హాజరయ్యారు. అక్కడ జరిగిన సంఘటనలతో భయాందోళనలకు లోనైన ఆమె పోలీసులకు ఫోన్ చేసిందనే విషయం వైరల్ అయింది. అయితే ఆమె చివరి కాల్ పోలీస్ ఎమర్జెన్సీ సేవలకు కాదు.. ఆమె లాస్ట్ ఫోన్ కాల్ ఆమె స్నేహితురాలు అంకితకు అంటూ ముంబై పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించారు.

ముంబైలోని ఫామ్‌హౌజ్‌లో పార్టీ

ముంబైలోని ఫామ్‌హౌజ్‌లో పార్టీ

ఇదిలా ఉండగా, జూన్ 7వ తేదీ రాత్రి ముంబైకి కొద్ది దూరంలోని కజ్రత్ ఫామ్ హౌస్‌లో జరిగిన ఓ పార్టీకి దిశా సలియాన్ హాజరయ్యారనే విషయం బయటకు వచ్చింది. ప్రముఖ టీవీ ఛానెల్ తన రిపోర్టర్‌ను ఆ ఫామ్ హౌస్‌ వద్ద వివరాలు సేకరించడానికి వెళ్లడం వివాదంగా మారింది. ఆ రిపోర్టర్‌ను, వీడియో జర్నలిస్టును ఇద్దరిని అరెస్ట్ చేయడం మరింత అనుమానాలకు తావిచ్చింది.

ఏక్తా కపూర్ బర్త్ డే పార్టీ అంటూ ఆరోపణలు

ఏక్తా కపూర్ బర్త్ డే పార్టీ అంటూ ఆరోపణలు

అయితే జూన్ 7వ తేదీ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ జన్మదినం కావడం యాదృచ్చికం కావడం జరిగింది. అయితే కొందరు మాత్రం కజ్రత్ ఫామ్ హౌస్‌లో జరిగింది ఏక్తా కపూర్ బర్త్ డే పార్టీ అని కొందరు ఆరోపించారు. అయితే వాటికి ఆధారాలు దొరకపోవడంతో అవి ఆరోపణలుగా మిగిలిపోయాయి. ఈ క్రమంలో నెటిజన్లు భారీ ఎత్తున Did Disha Attend Ekta Party అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేయడంతో దిశా మరణంపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకు దిశా ఆ పార్టీకి అటెండ్ అయిందా అనేది ఇంకా ప్రశ్నగానే మిగిలింది.

Recommended Video

Producer Natti Kumar Given Clarity Over దిశ ఎన్‌కౌంటర్ Movie
దిశ మరణం తర్వాత సుశాంత్ ఆత్మహత్య

దిశ మరణం తర్వాత సుశాంత్ ఆత్మహత్య

ఇక దిశ సలియాన్ తన మరణానికి ముందు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఫోన్ కాల్ చేశారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. దిశ సలియాన్ మరణం చెందిన కొద్ది రోజులకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కూడా సంభవించింది. అయితే ఈ ఇద్దరి మరణాల వెనుక బాలీవుడ్ మాఫియా హస్తం ఉందనే విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ కేసులను సీబీఐ, ఈడీ, ఎన్సీబీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరికి న్యాయం జరుగాలనే అభిప్రాయాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X