»   » రామ్ చరణ్ వివరణ: ఉపాసన తో విడాకులు, సానియా మీర్జాతో లింకా?

రామ్ చరణ్ వివరణ: ఉపాసన తో విడాకులు, సానియా మీర్జాతో లింకా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మేం కలిసే ఉన్నాం..మీరు కాస్త మూసుకోండి అంటున్నాడు రామ్ చరణ్ కొంచెం అటూ ఇటూగా కోపంగా. ఎందుకంటే ఏమీ లేనిచోట నోటి కొచ్చిన రూమర్స్ స్ప్రెడ్ చేసేస్తే ఎవరికైనా కాలుతుంది కదా... దేని గురించి ఈ మ్యాటర్ అంటే...

గత కొద్ది రోజులుగా రామ్ చరణ్, ఉపాసనల వైవాహిక భందం వీగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ కు టెన్నీస్ స్టార్ సానియా మీర్జా కు లింక్ పెడుతూ ఈ వార్తను ప్రచారంలోకి తెచ్చారు.

Also Read: రామ్ చరణ్, సానియా మీర్జా కలిసి....(ఫోటో ఫీచర్)

కొన్ని పబ్లిక్ ఈవెంట్స్ లో వీళ్లద్దరినీ చూసిన కొందరు కథలు అల్లేసి, దాన్ని చరణ్, ఉపాసన ల విడాకల దాకా డవలప్ చేసేసారు. అయితే సర్లే..సర్లే అని ఊరుకున్న రామ్ చరణ్ ఈ విషయమై నోరు విప్పారు.

Divorce Matter: Ram Charan gives clarity

రామ్ చరణ్ మాట్లాడుతూ..తను, ఉపాసన కలిసే ఉన్నామని అన్నారు. అలాగే తమ వైవాహిక జీవితాన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు శ్రీజ వివాహ సన్నాహాలు కూడా చాలా గ్రాండ్ గా సక్సెస్ ఫుల్ గా జరుగుతున్నాయని అన్నారు.

అంతేకాకుండా తాను సానియా మీర్జా మంచి స్నేహితులమని, ఇలాంటి రూమర్స్ పర్శనల్ లైఫ్ పై వ్యాపింపచేయటం మీడియాకు పద్దతి కాదని ఘాటుగానే అన్నాడు.

Also Read: టాలీవుడ్లో హయ్యెస్ట్ రెమ్యూరేషన్ తీసకునే హీరో ఎవరు?

ఇక ఉపాసన ఈ మధ్యకాలంలో ఎక్కువగానే రామ్ చరణ్ తో కనపడుతోంది. ఆయన సినిమా సెట్స్ కు వచ్చి వెళ్తోంది. ఈ సంవత్సరం వారు పిల్లలను కనే ప్లానింగ్ లో ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి ఆనందకరమైన సమయంలో ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టించబుద్ది అవుతుందో...

English summary
Ram Charan claims he and Upasana were enjoying their married life. Stating that he and Sania Mirza were just good friends, Charan urged media not to spread false reports about his personal life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu