»   » డీజే విడుదల మూడువారాలు ఆలస్యం: పొరపాట్లు సరిదిద్దటానికేనా..??

డీజే విడుదల మూడువారాలు ఆలస్యం: పొరపాట్లు సరిదిద్దటానికేనా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆల్రెడీ విడుదలైపోతే మళ్ళీ ఆలస్యం ఏమిటీ అనుకుంటున్నారా? ఈ విడుదల ఇక్కడ కాదులెండి కేరళ లో. బన్నీ ప్ర‌తి సినిమా మాలీవుడ్ లో విడుద‌లై మంచి విజ‌యం సాధిస్తుంటుంది. తాజాగా దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రాన్ని కూడా మ‌ల‌యాళంలో విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాత‌లు. తెలుగులో దాదాపు గా 100 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టిన డీజే మ‌ల‌యాళంలోను మంచి వ‌సూళ్ళ‌ను రాబ‌డుతుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. జూలై 14న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో డీజే చిత్రానికి డివైడ్ టాక్ రాగా, మాలీవుడ్ లో పాజిటివ్ టాక్ అందుకుంటుంద‌ని యూనిట్ భావిస్తుంది

గత కొన్నేళ్లలో అల్లు అర్జున్‌కు కేరళలో మాంచి ఫాలోయింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. అతడి సినిమాలు అక్కడి స్టార్ హీరోల స్థాయిలో భారీగా రిలీజవుతాయి. బన్నీ లాస్ట్ మూవీ 'సరైనోడు'.. 'యోధవు' పేరుతో విడుదలై కేరళలో మంచి వసూళ్లు రాబట్టింది. అక్కడ బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని పిలుచుకుని ఓన్ చేసుకునేంత ఇష్టం బన్నీ అంటే కేరళ యువకులకి. అందుకే ఇక్కడ విడుదలైన ప్రతీ బన్నీ సినిమా మళయాలం లోకి వెళ్ళాల్సిందే.


Dj To Be Released On July 14 In Malayalam

తెలుగులో రిలీజైన మూడు వారాల తర్వాత.. అంటే జులై 14న 'డీజే' మలయాళ వెర్షన్ విడుదల కానుంది. ఈ టైం ఎందుకంటే డబ్బింగ్ లోపాలు లేకుండా చూడటానికి, అలాగే ప్రమోషన్ కూడా కొంచెం గట్టిగా చేయడం కోసం ఇలా గ్యాప్ తీసుకున్నారేమో. ఎప్పట్లాగే బన్నీ తన సినిమా విడుదలకు ముందు కేరళలో పర్యటించబోతున్నాడు. ఐతే బన్నీ గత సినిమాలతో పోలిస్తే 'డీజే'కు నెగెటివ్ టాక్ బాగా వచ్చింది.


ఇది మరీ రొటీన్ సినిమా అన్న విమర్శలొచ్చాయి. కథ ముందే తెలిసిపోవడం. సినిమా టాక్ స్ప్రెడ్ అయిపోవడం 'డీజే'కు ప్రతికూలంగా మారదా అన్న సందేహాలున్నాయి. ఐతే 'సరైనోడు'కూడా ఇలాగే ముందే కథ తెలిసిపోయినా అక్కడ అవేమీ మైనస్ కాలేదు. ఈసారి కూడా అలాగే జరగొచ్చు మరి...


English summary
Bunny has stupendous fan base in Kerala and all his movies get a wide release over there. Duvvada Jagannadham is all set for a massive release in Kerala on July 14th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu