»   » దువ్వాడ క్లైమాక్స్ మళ్ళీ రీషూట్? అసలేం జరిగిందీ

దువ్వాడ క్లైమాక్స్ మళ్ళీ రీషూట్? అసలేం జరిగిందీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే - దువ్వాడ జగన్నాధం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. రీసెంట్ గా పూర్తయిన అబుదాబి షెడ్యూల్ తో 90శాతం వరకూ షూట్ కంప్లీట్ అయిందని చెప్పారు. ఆ తర్వాత హైద్రాబాద్ లో షెడ్యూల్ ప్రారంభించాల్సి ఉండగా.. గత 10 రోజుల నుంచి బన్నీ అందుబాటులో లేడు. అసలు షూట్ ఎక్కడిదాకా వచ్చినో ఖచ్చితంగా చెప్పే వాళ్ళెవరూ లేరు గానీ ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ కాస్త తేడా గా ఉంది... క్లైమాక్స్ లో ఇప్పుడు మార్పులు మొదలు పెట్టారట.

షూటింగ్ ఆగిపోయింది

షూటింగ్ ఆగిపోయింది

కొన్ని వారాలుగా ‘దువ్వాడ జగన్నాథం' షూటింగ్ ఆగిపోయింది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈమూవీకి సంబంధించిన పాటల చిత్రీకరణ కోసం అబూదాబి వెళ్ళివచ్చిన తరువాత అల్లుఅర్జున్ ఈసినిమాకు సంబంధించిన క్లైమాక్స్ విషయంలో కొన్ని సందేహాలు ఏర్పడటంతో ఈ మూవీ క్లామాక్స్ మార్చమని దర్శకుడు హరీష్ శంకర్ కు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.


దువ్వాడ జగన్నాథం

దువ్వాడ జగన్నాథం

రేసు గుర్రం.. సరైనోడు విషయంలో కూడా బన్నీ ఇలాగే క్లైమాక్స్ విషయంలో రీ షూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అవి బ్లాక్ బస్టర్స్ గా.. బన్నీ కెరీర్ బెస్ట్ గా నిలిచాయి. హరీష్ శంకర్ క్లైమాక్స్ ను తిరిగి రాయడం పూర్తి చేసి.. అది అల్లు అర్జున్ కి పూర్తిగా నచ్చాకే.. డీజే షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని అంటున్నారు. బన్నీ ‘దువ్వాడ జగన్నాథం' మూవీ క్లైమాక్స్ విషయంలో చాల మార్పులు చేసారంటూ చెప్పుకుంటున్నారు మరి.


రేసుగుర్రం, సరైనోడు

రేసుగుర్రం, సరైనోడు

ఇదిలా ఉంటే ఇంటర్వెల్ మీద కూడా బలమైన దృష్టే పెట్టారట అల్లు అర్జున్ గత చిత్రాలు రేసుగుర్రం, సరైనోడు సినిమాల్లోని ఇంటర్వెల్ బ్యాంగ్ కి భారీ రెప్పాన్స్ వచ్చింది. 'రేసుగుర్రం' సినిమాలో సరదా ఉండే బన్నీ క్యారెక్టర్ ఇంటర్వెల్ వచ్చేసరిగా ఓ రేంజ్ ఎమోషన్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాడు.


ఇంటర్వెల్ ఎపిసోడ్

ఇంటర్వెల్ ఎపిసోడ్

ఇక 'సరైనోడు'లో అయితే ఇంటర్వెల్ ఎపిసోడే క్లైమాక్స్ ఎపిసోడ్ మాదిరి డిజైన్ చేసి మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు ఏ మాత్రం తగ్గని రేంజ్ లో 'డీజే' మూవీలో ఇంటర్వెల్ ఎపిసోడ్ ని దర్శకుడు 'హరీష్ శంకర్' ప్లాన్ చేశాడట. ఈ సినిమా మే నెలలో ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి


English summary
According to a News there seems to be some issue with the climax of the film Duvvada jagannadham and currently, Harish Shankar is rewriting it. some reshoots came into place. DJ Duvvada Jagannadham is going for such climax reshoot soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu