»   » డిజె పాటలు వచ్చేశాయ్, మెగా వేడుకకు ఏర్పాట్లు పూర్తి....

డిజె పాటలు వచ్చేశాయ్, మెగా వేడుకకు ఏర్పాట్లు పూర్తి....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న 'దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్' చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం సాయంత్రం శిల్పకళావేదికలో జరుగబోతోంది. అంతకంటే ముందుగానే యూట్యూబ్ ద్వారా ఆడియో రిలీజ్ చేశారు.

ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పాటలను రిలీజ్ చేశారు. దేవి శ్రీ అందించిన సంగీతం అభిమానులను, సంగీత ప్రియులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఆడియోకు సూపర్ హిట్ టాక్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి.


ఐదు పాటలు

సినిమాలో మొత్తం 5 పాటలనున్నాయి. డిజే టైటిల్ సాంగుతో పాటు.. అస్మైక, మెచ్చుకో, సీటీ మార్, బాక్స్ బద్దలైపోయే అంటూ క్లాస్, మాస్, రొమాంటిక్ ఇలా అన్ని రకాలు కలిపి కొట్టాడు దేవిశ్రీ ప్రసాద్.


ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చిరంజీవి

ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చిరంజీవి

ఆదివారం సాయంత్రం ‘డిజె' ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో గ్రాండ్ గా జరుగబోతోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలుస్తోంది.


భారీ రిలీజ్

భారీ రిలీజ్

డిజే ట్రైలర్‌ ఇటీవల విడుదల కాగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం 24 గంటల్లో 7.4 మిలియన్ వ్యూస్, 46 గంటల్లో 10 మిలియన్ వ్యూస్ సాధించి సౌతిండియా రికార్డ్ నెలకొల్పింది. సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు.


జూన్ 23న

జూన్ 23న

దువ్వాడ జనగ్నాధం చిత్రాన్నిజూన్ 23న విడుదల చేస్తున్నారు. బన్నీ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ ఈ చిత్రం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.English summary
Watch & Enjoy DJ - Duvvada Jagannadham Full Songs Jukebox. DJ Movie Starring Allu Arjun, Pooja Hegde. Directed by Harish Shankar & Produced by Dil Raju under the Banner Of Sri Venkateshwara Creations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu