»   »  అల్లు అర్జున్ ‘కింగ్ ఆఫ్ సోషల్ మీడియా’.... 46 గంటల్లో కోటి!

అల్లు అర్జున్ ‘కింగ్ ఆఫ్ సోషల్ మీడియా’.... 46 గంటల్లో కోటి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'దువ్వాడ జగన్నాధమ్' చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలన విజయం సాధించింది. ట్రైలర్ విడుదలైన 46 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్(కోటి) సాధించింది. అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే ట్రైలర్ ఇంత భారీ విజయం సాధించడానికి కారణం. దీంతో అల్లు అర్జున్ కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అంటూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఈ ట్రైలర్ విడుదలైన తొలి 24 గంటల్లోనే 7.4 మిలియన్ వ్యూస్ సాధించి..... నాన్ బాహుబలి సౌతిండియా రికార్డ్ నమోదు చేసింది. 46 గంటలు గడిచేలోపు ఫేస్ బుక్, యూట్యూబ్ లలో కలిపి 10 మిలియన్ వ్యూస్ మార్కను అందుకుంది.

అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

ఈ నెల 23న ‘డిజె' చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ మరింత హ్యాపీగా ఉంది. సినిమాను గ్రాండ్ స్కేల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదే బిగ్గెస్ట్ హిట్ అవుతుందా?

ఇదే బిగ్గెస్ట్ హిట్ అవుతుందా?

ఇప్పటి వరకు బన్నీ కెరీర్లో రేసుగుర్రం, సరైనోడు బిగ్గెస్ట్ హిట్. ప్రస్తుతం ‘డిజె' సినిమాపై అంచనాలు చూస్తుంటే..... బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే బన్నీ కెరీర్లోనే బిగ్ సినిమాగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.

సూపర్ కాంబినేషన్

సూపర్ కాంబినేషన్

బన్నీ స్టార్ ఇమేజ్ తో పాటు దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్, గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ కొట్టి హరీష్ శంకర్ కూడా తోడవటంతో ‘డిజె' సినిమాకు ఊహించని క్రేజ్ వచ్చింది.

డిజె ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం

డిజె ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం

అయితే డిజె ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు కూడా కొందరు యాంటీ ఫ్యాన్స్ ప్రయత్నిస్తుండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
The trailer of Tollywood star Allu Arjun’s upcoming film Duvvada Jagannadham aka DJ has set the internet on fire. The promo video went viral amassing a combined 10 million views on YouTube and Facebook within 46 hours of its release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu