»   »  దాడి చేసింది అల్లు శిరీషే : డిజె ఫైజా

దాడి చేసింది అల్లు శిరీషే : డిజె ఫైజా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఓవర్ ది మూన్ క్లబ్‌లో ఆదివారం రాత్రి 'ప్రముఖ నటుడి సోదరుడు' తనపై, తన ఫ్రెండ్స్ దాడి చేసినట్లు ఒకరు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వారు తమపై దాడి చేసింది అల్లు శిరీషే అని స్పష్టం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న ఫోటోలను సాక్ష్యాలుగా చూపెడుతున్నారు. అయితే...యాక్టర్ సన్నిహితులు మాత్రం, ఫోటోలో కనిపిస్తున్నది అల్లు శిరీష్ కాదు, అతని సోదరుడు... అల్లు వెంకట్ అంటున్నారు.

'ఇంటర్నెట్లో అతని ప్రొఫైల్ చెక్ చేసాము, అతను అల్లు శిరీషే. అతను ఒక ఫేమస్ యాక్టర్ సోదరుడు. కానీ మేము పబ్ మేనేజ్ మెంట్, అక్కడున్న ఇతర వ్యక్తుల ను అడిగితే ఎవరూ అతని పేరు చెప్పలేదు. ఆదివారం ఉదయమే మేము హైదరాబాద్ వదిలి వచ్చాము. మేము ఫిర్యాదు చేసేప్పుడు అతని పేరు మాకు తెలియదు. ఇప్పుడు పోలీసులకు ఫోటోలు పంపాము' అని...ఫిర్యాదు చేసిన డిజె ఫైజా చెబుతున్నారు.

అయితే...శిరీష్ స్పోక్ పెర్సన్ వి. శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ...ఆ ఫోటోలో ఉన్నది వెంకటేష్, అందులో దాడి చేసినట్లు ఏమీ లేదు అని చెప్పుకొచ్చారు. జూబ్లీ హిల్స్ ఇన్స్ పెక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి.....ఫోటోలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామంటున్నారు.

English summary

 Ma Faiza, the DJ who was reportedly assaulted by an "actor's brother" and his friends in the Over the Moon club on Sunday, claimed the assaulter was actor Allu Sirish.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu