»   » ‘డిజె’ వాయింపు మొదలైంది: వారిని బొక్కలో తోసేందుకు తొలి అడుగు!

‘డిజె’ వాయింపు మొదలైంది: వారిని బొక్కలో తోసేందుకు తొలి అడుగు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'డిజె-దువ్వాడ జగన్నాథమ్' సూపర్ కలెక్షన్లతో దూసుకెలుతోంది. నాలుగు రోజుల్లోనే రూ. 75 కోట్ల కలెక్షన్ సాధించిన ఈ చిత్రం వారం రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అయితే పైరసీ మాఫియా ఈ చిత్రం కలెక్షన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.

డీజే' సినిమా మొత్తాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో అలర్టయిన 'డిజే' చిత్రం బృందం సైబర్ క్రైమ్ ఏసీపీ రఘువీర్‌ను కలిసి పైరసీ లింకులను చూపించి ఫిర్యాదు చేశారు.


యాంటీ ఫ్యాన్స్ హస్తముందా?

యాంటీ ఫ్యాన్స్ హస్తముందా?

పైరసీ చేస్తున్నవారికి కొందరు యాంటీ ఫ్యాన్స్ కూడా సపోర్టు ఇస్తున్నట్లు సమాచారం. మరో వైపు పైరసీ లింకులను కొందరు సోషల్ మీడియా గ్రూఫుల ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చిత్ర బృందం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అందరినీ బొక్కలో తోయించడమే లక్ష్యం...

అందరినీ బొక్కలో తోయించడమే లక్ష్యం...

‘డిజే'ను దెబ్బ కొట్టేందుకు పైరసీ చేస్తున్న వారిని, సోషల్ మీడియా ద్వారా లింకులు పోస్టు చేస్తూ ఈ పైరసీని ప్రోత్సహిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అందరి వివరాలు సేకరిస్తున్నారు

అందరి వివరాలు సేకరిస్తున్నారు

‘డిజె' పైరసీ వ్యవహారంతో సంబంధమున్న వారి అందరి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. త్వరలోనే వారిని అరెస్టు చేసేందుకు పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారు.


ఇది హెల్దీ కాంపిటీషన్ కాదు...

ఇది హెల్దీ కాంపిటీషన్ కాదు...

ఇటీవల థాంక్స్ మీట్లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ..... ఒకప్పుడు హీరోల అభిమానుల మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉండేదని, ఇపుడు పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పక్క హీరో సినిమాను దెబ్బకొట్టేందుకు కొందరు అభిమానులు ప్రయత్నిస్తున్నారని, ఇది ఇండస్ట్రీకి మంచిది కాదని తెలిపారు. డిజె పైరసీ విషయంలో హెల్ఫ్ చేసిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానులకు హరీష్ శంకర్ థాంక్స్ చెప్పారు.


English summary
Duvvada Jagannadham team has filed a police complaint about many social media handles and people indulging in piracy!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu