For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సందీప్ కిషన్ ‘డికె బోస్’ రిలీజ్ డేట్ ఛేంజ్

  By Srikanya
  |

  హైదరాబాద్ : సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'డీకే బోస్‌'. నిషా అగర్వాల్‌ హీరోయిన్. ఎన్‌.బోస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శేషురెడ్డి, ఆనంద్‌రంగా నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇప్పటికే మంచి రేటుకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రేమ కథా చిత్రమ్‌లో కామెడీ పండించిన సప్తగిరి ఈచిత్రంలోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పాత్ర పోషిస్తున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

  నిర్మాతల్లో ఒకరైన శేషుడ్డి చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'సెన్సార్ కార్యక్షికమాలు పూర్తయ్యాయి. యు.ఎ. సర్టిఫికెట్ లభించింది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా అనూహ్య మలుపులతో సాగిపోయే ప్రేమకథా చిత్రమిది. సందీప్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుంది. అచ్చు సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. యువతతో పాటు కుటుంబవూపేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలున్న చిత్రమిది' అన్నారు.

  'చిన్నతనం నుంచే డీకే బోస్‌కు పోలీస్ అంటే ఎంతో క్రేజ్. ఖాకీ చొక్కా వేసుకొని తన పవంటో చూపించాలని ఆశపడుతుంటాడు. అయితే నిజాయితీగా పనిచేసే సిన్సియర్ పోలీస్ అధికారిగా వుండటం అతనికిష్టం వుండదు. ఈట్‌మనీ, డ్రింక్‌మనీ, స్మోక్‌మనీ అతని పాలసీ. డబ్బు కోసం ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధంగా వుంటాడు. జీవితంలో ఎదగటానికి అతనికి ఓ సిద్ధాంతం వుంటుంది. ఎవరేం చెప్పినా ఖాతరు చేయని తత్వమతనిది. అలాంటి యువ పోలీస్ అనుకోకుండా ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అనంతరం జరిగే ఆసక్తికర సంఘటనల సమాహారమే 'డీకే బోస్' చిత్ర ఇతివృత్తం' అంటున్నాడు దర్శకుడు ఎన్.బోస్.

  కాగా...ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం "Groundhog day" ఆధారంగా రూపొందుతున్నట్లు టాలీవుడ్ లో, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రోజు ఆగిపోవటంతో నెగిటివ్ గా ఉన్న హీరోలో మార్పు వస్తుంది. అలాంది కథే... 'డీకే బోస్‌' అంటున్నారు. నిజానిజాలు విడుదల అయితే కానీ తెలియవు. నిర్మాతలు మాట్లాడుతూ ''అవినీతిపరుడైన యువ పోలీసు అధికారి కథ ఇది. పైసా ముట్టందే ఏ పనీ చేయని అతగాడు ప్రేమలో పడ్డాక ఎలా మారిపోయాడన్నది తెరపైనే చూడాలి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ నెలాఖరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.

  దర్శకుడు ఎన్.బోస్ మాటల్లో... 'ఆ పోలీస్‌ఆఫీసర్ డబ్బు కోసం ఎలాంటి పనినైనా చేయడానికి సిద్ధపడతాడు. తాను పోలీస్‌ఆఫీసర్‌గా గోల్డ్‌మెడల్స్ అందుకోవాలని రాలేదు. గోల్డ్ బిస్కెట్స్ సంపాందించడానికి వచ్చాను అనుకునే తత్వం అతనిది. అలాంటి ఆ యువ పోలీస్ ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అప్పుడు అతనిలో వచ్చిన మార్పేమిటి? అనేది చిత్ర కథ అన్నారు. ఈ చిత్రంలో సంపత్ కుమార్, అన్నపూర్ణమ్మ, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, అజయ్ కుమార్, మల్లాది, సత్తెన్న, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు.

  English summary
  Sundeep Kishan and Nisha Agarawal are playing the lead in the film titled as 'DK Bose'. The film is to be directed by AN Bose. Anand Ranga and Seshu Reddy are jointly producing the film, under the banner of Random Thoughts banner, Sundeep Kishan will seen in the role of a police officer in the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X