twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చావుబేరం: టైటిల్ మాకే కావలంటూ టాప్ ప్రొడ్యూసర్స్

    By Srikanya
    |

    బెంగళూరు: సిని పరిశ్రమలో వ్యక్తులు విచిత్రంగా ఉంటారు. ఒక్కోసారి డబ్బు తప్ప వేరే ప్రయారిటీ లేనట్లు బిహేవ్ చేస్తూంటారు. అటువంటి సంఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐఎఎస్ అధికారి డికె రవి..మొన్న సోమవారం అనుమానస్పద మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఆ మృతి ని బేస్ చేసుకుని కొందరు పెద్ద నిర్మాతలు సినిమా లు చెయ్యాలని, అందుకు ఆయన పేరుతో అంటే డికే రవి అనే టైటిల్ ని లేదా డిప్యూటి కమీషనర్ రవి అని గాని ఇవ్వమని ఫిల్మ్ ఛాంబర్ కి పరుగెత్తటం అందరినీ నివ్వెరపరిచింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    వాణిజ్య పన్నుల ఉన్నతాధికారిగా గత రెండు మాసాల వ్యవధిలో పన్ను ఎగ్గొడుతున్న స్థిరాస్తి వ్యాపారులు, బిల్డర్లు, కార్పొరేట్‌ సంస్థలు, వజ్రాలు, స్వర్ణాభరణాల వ్యాపారులపై రవి దాడుల్ని సాగించారు. రూ.మూడు నాలుగు వందల కోట్ల పన్ను వసూలు చేశారు. ఆయన చేసిన దాడుల వల్ల తీవ్రంగా నష్టపోయిన వారు కక్ష సాధింపులకు దిగి ఉండవచ్చేమోనని అనుమానిస్తున్నారు.

    ధోరణిని మార్చుకోక పోతే అంతం తప్పదని రవిని ఫోన్ ద్వారా మాఫియా బెదరించినట్లు సమాచారం ఉందన్నారు. తొలి నుంచి కేసును దారి తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందున సీఐడీ పోలీసులు నిజాయితిగా విచారణ జరిపినా.. ప్రజలు నమ్మబోరని, సీబీఐచే విచారణ జరిపించాలన్నారు.

    DK Ravi - Kannada top Producers want this title

    వాణిజ్యపన్నుల శాఖ అదనపు కమిషనర్‌ డి.కె.రవికి చెందిన తావరకెరెలోని సెయింట్‌ జాన్స్‌ హుడ్‌ అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌లో సీఐడీ అధికారులు బుధవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. రవి ఉపయోగించిన ల్యాప్‌టాప్‌, రెండు చరవాణిలను స్వాధీనపరచకున్నారు. సీఐడి అధికారులు కుమారస్వామి, సిరిగౌరిల నేతృత్వంలోని 12 మంది సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. ఆగ్నేయ విభాగం డీసీపీ రోహిణి కటోచ్‌ కూడా రవికి చెందిన ల్యాప్‌టాప్‌, చరవాణిలు, పర్సు తదితరాలను సీఐడీ అధికారులకు అప్పగించారు. రవి కారు డ్రైవరు, అపార్ట్‌మెంట్‌ కాపలాదారుడిని, చుట్టుపక్కల ప్లాట్‌లలో ఉంటున్న వారిని విచారించారు. రవికి చెందిన సోషల్‌ నెట్‌వర్కు సైట్లు, స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్న కొన్ని సందేశాలను వీక్షించేందుకు పాస్‌వర్డ్‌లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారిణి సిరిగౌరి తెలిపారు. నిపుణుల సహకారంతో పాస్‌వర్డ్‌లను చేధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఆమె వివరించారు.

    మరో ప్రక్క అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఐఏఎస్‌ అధికారి డి.కె.రవి కేసును సీబీఐకు అప్పగించాలంటూ ఆన్‌లైన్లో సంతకాల సేకరణ (ఈ-పిటిషన్‌) ప్రారంభమైంది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను డిమాండ్‌ చేస్తూ www.change.orgవెబ్‌సైట్‌లో సంతకాల ఉద్యమం ప్రారంభమైంది. సంతకాలను సేకరిస్తోన్నట్లు ప్రకటించిన కొద్ది నిమిషాల్లో 52,904 మంది సంతకాల్ని చేశారు.

    కనీసం మూడు కోట్ల సంతకాలను సేకరించాలని రవి అభిమానులు, పరిచయస్తులు, ఉద్యోగులు వాట్సప్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా విజ్ఞప్తులను పంపుతున్నారు. దేశ వ్యాప్తంగా కనీసం మూడు కోట్ల మంది యువకుల సంతకాలను సేకరిస్తే కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం సీబీఐకు అప్పగిస్తోందని అభిమానులు ఆశ పడుతున్నారు. కాగా, సామాజిక అనుసంధాన సైట్లయిన ఫేస్‌బుక్‌, ట్విట్టర్లలో కూడా డి.కె.రవి మృతికి సంబంధించి పలు అనుమానాలను వ్యక్తీకరించేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. ఆయనది ఆత్మహత్య కాదని, హత్యేనంటూ పోస్టింగ్‌లు వస్తున్నాయి.

    ఈనెల 16న మధ్యాహ్నం తన ప్లాట్‌లో అనుమానస్పదంగా మృతి చెందిన ఐఏఎస్‌ అధికారి డి.కె.రవి ఆరోజు ఉదయం 10.15కు కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయం నుంచి నేరుగా తన కొత్త ప్లాట్‌కు వెళ్లారు. ఇంటికి వెళ్లిన తరువాత 11.22సమయంలో వచ్చిన ఒక ఫోన్‌ కాల్‌ను ఆయన మాట్లాడారు. ఆ కాల్‌ ఓ ఐఏఎస్‌ అధికారి నుంచి వచ్చింది. దానికి ఆయన సౌమ్యంగానే, ఎటువంటి ఆందోళన, ఆత్రుత లేకుండా మాట్లాడారని తేలింది. కాగా తావరకెరెలోని సెయింట్‌ జాన్స్‌ హుడ్‌ అపార్ట్‌మెంట్‌ ఆవరణలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ స్టోరేజ్‌ బాక్స్‌ను సీఐడీ అధికారులు బుధవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు.

    ఆయన ప్లాట్‌ను వెతుక్కుంటూ ముగ్గురు అగంతకులు వచ్చి వెళ్లినట్లు సమాచారం. నాగరబావిలోని రవి మామ హనుమంతరాయప్ప, భార్య కుసుమలను సీఐడీ అధికారులు వేర్వేరుగా మూడు గంటల పాటు విచారణ చేశారు. సోమవారం ఉదయం రవి తమతో కలిసి అల్పాహారాన్ని తీసుకుని కార్యాలయానికి బయలుదేరి వెళ్లారని హనుమంతరాయప్ప తెలిపారు. తన అన్న కుమార్తె వివాహం ఉండటంతో తన కుమార్తె నాగరబావిలోనే ఉంటుందని, అల్లుడు, కుమార్తె మధ్య ఎటువంటి వివాదాలు లేవని స్పష్టీకరించారు.

    రవి ఆత్మహత్య చేసుకున్న చోట డెత్‌నోట్‌ ఉందని మొదట ప్రకటించిన అధికారులు, అనంతరం అటువంటిదేమీ లేదని మాటమార్చారు. ఉరి వేసుకునేందుకు ఉపయోగించిన వస్త్రం కూడా దృఢంగా లేదని, ఉరి ముడి కూడా అసహజంగా ఉందని రవి కుటుంబ సభ్యులు, అభిమానులు ఆరోపించారు.

    ప్రొబేషనరీ అధికారిగా హాసన జిల్లా హొళేనరసీపురలో పని చేసినప్పుడు కూడా ఆయన పలు అక్రమాలను వెలికి తీశారు. సెలవుపై వూరికి వెళ్లినప్పుడు తమ పొలంలో పట్టుపురుగుల కోసం మల్బరీ ఆకుల్ని సేకరించటం, ఇతర భూమిలో సేద్యాన్ని చేసేందుకు ఆసక్తి కనబరిచేవారు. దిల్లీలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే సమయంలో తగినంత డబ్బు లేకపోవటంతో పొలంలో ఉన్న చింత, వేప చెట్లను విక్రయించి తండ్రి ఆయనకు డబ్బు ఇచ్చారు. పేదరికంతో తాను అనుభవించిన సమస్యలు ఇతరులు అనుభవించకూడదన్న ధ్యేయంతో ఆయన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు, వ్యక్తిత్వ వికాస శిబిరాలను నిర్వహించారు.

    English summary
    Honest IAS officer DK Ravi of Bangalore, who has died in mysterious circumstances last Monday, has now become a bone of contention for top producers in Kannada Film Industry.The moment Ravi’s death news came out, many top producers of Sandalwood have rushed to film chamber to register this title “DK Ravi” and “Deputy Commissioner Ravi”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X