»   » ఓ వైపు ‘స్పైడర్’ సీన్లు.... అబ్బే అదేం లేదంటున్న చిత్ర యూనిట్!

ఓ వైపు ‘స్పైడర్’ సీన్లు.... అబ్బే అదేం లేదంటున్న చిత్ర యూనిట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పైడర్‌' చిత్రానికి సంబంధించిన సీన్లు లీకైటనట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య మహేష్ బాబుపై చిత్రీకరించిన ఓ యాక్షన్ సీన్ తో పాటు, కొన్ని సన్నివేశాలు యూట్యూబ్ లో దర్శనమిచ్చాయి.

ఈ అంశంపై 'స్పైడర్‌' చిత్రబృందం ట్విటర్‌ ద్వారా స్పందించింది. 'స్పైడర్‌ ఫుటేజ్‌ లీకైనట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. కొందరు కావాలని తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు.' అని ట్వీట్‌ చేసింది.


ఇంటర్నెట్, వాట్సాప్‌లో లీక్ సీన్లు

ఓ వైపు చిత్ర బృందం అలాంటిదేమీ లేదని ప్రకటన చేసినప్పటీకి ఇంటర్నెట్, వాట్సాప్ లాంటి మాధ్యమాల్లో లీకైన సీన్లు దర్శనమిస్తున్నాయి. అయితే ఇవి కేవలం చిత్రీకరణ జరుపుతుండగా తీసిన సీన్లు కావడంతో సినిమాపై పెద్దగా ఎఫెక్టు చూపక పోవచ్చని అంటున్నారు.


స్పైడర్

స్పైడర్

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా ఎస్.జె.సూర్య నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు.


భారీగా క్రేజ్

భారీగా క్రేజ్

మహేష్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌ మొదటి సారి కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో స్పెషల్‌ క్రేజ్‌ ఏర్పడింది. ఇటీవల విడుదలైన టీజర్ మంచి స్పందన వచ్చింది.హై టెక్నికల్ వ్యాల్యూస్

హై టెక్నికల్ వ్యాల్యూస్

టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందుతున్న 'స్పైడర్‌' చిత్రం సూపర్‌స్టార్‌ మహేష్‌ కెరీర్‌లోనే ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుందని టీజర్‌ని చూసిన ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


రెండో సాంగ్

రెండో సాంగ్

‘స్పైడర్' చిత్రానికి సంబంధించి సంబంధించి ఇప్పటికే ‘బూమ్ బూమ్' అనే సాంగ్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 4న ‘హాలీ హాలీ' అనే రెండో పాటను రిలీజ్ చేయబోతున్నారు.తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.


English summary
"Do NOT believe rumours about ANY leakage of #SPYder footage.Some elements are spreading Fake videos." Team Spyder tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X