»   »  ‘దోచేయ్’ ఆడియో వేడుక హైలెట్స్ (ఫోటోస్)

‘దోచేయ్’ ఆడియో వేడుక హైలెట్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ చైతన్య, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దోచెయ్'. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సన్నీ ఎం.ఆర్ సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక హైదరాబాద్ లో శుక్రవారం సాయంత్రం జరిగింది. నాగార్జున, కీరవాణి, రాజమౌళి,సుకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ఆడియో సీడీలు, థియేట్రికల్ ట్రైరల్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ...‘మంచి ఫీల్ ఉన్న సినిమా ఇది. సుధీర్ వర్మని కలిసి కథ విని, పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్స్ అన్నీ చూసాను. ప్రసాద్ గారికి ఇండస్ట్రీలో మంచి గౌరవం ఉంది. ఆయన మంచి తనమే ఆయనకు శ్రీరామరక్ష. సుధీర్ తో నేనూ ఓ సినిమా చేస్తాను' అన్నారు.

దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ..‘నాకు సంగీతం గురించి పెద్దగా తెలియదు. వినగానే బావుందనిపిస్తే వెంటనే మా హీరోకి వినిపిస్తాను. తనకీ నచ్చితే ఒకే. సన్నీ చాలా వైవిధ్యమైన సంగీతాన్ని ఇచ్చాడు.' అన్నారు.

నాగ చైతన్య మాట్లాడుతూ...‘రెండు వారాల ముందు నాలుగు పాటలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసాం. మంచి స్పందన వచ్చింది. నా కెరీర్లో ఇది నైస్ ఆల్బమ్. సినిమాలో ఆరు పాటల్లో రెండు పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ లాగా వస్తాయి. సుధీర్ ఈ సినిమాను కొత్తగా ప్రజెంట్ చేసాడు. ఈ సినిమాతో ట్రెండ్ సెట్ చేస్తాడు' అన్నారు.

సీడీ ఆవిష్కరణ

సీడీ ఆవిష్కరణ


‘దోచెయ్' మూవీ సీడీ ఆవిష్కరిస్తున్న దృశ్యం.

బుల్లెట్ బాబుగా బ్రహ్మానందం

బుల్లెట్ బాబుగా బ్రహ్మానందం


ఈ చిత్రంలో బుల్లెట్ బాబు అనే పాత్రలో హీరోగా నటించాను. నా పోర్షన్ చాలా నీట్ గా, ఫ్రెష్ గా చేసాడు అని బ్రహ్మానందం అన్నారు.

కాన్సెప్టు

కాన్సెప్టు


''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్‌ వర్మ.

నటీనటులు

నటీనటులు


ఈ చిత్రంలో నాగ చైతన్య, కృతి సనన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

సాంకేతికవర్గం

సాంకేతికవర్గం


ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

English summary
Photos of Telugu movie Dochay Audio Launch on April 10, 2015. Kirti Sanon, Nagarjuna, Naga chaitanya, Brahmanandam and other celebs were present in the event.
Please Wait while comments are loading...