twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్ కు పండుగ : మెగా హిట్ చిత్రంపై డాక్యుమెంటరీ!

    By Srikanya
    |

    ముంబై :ఇరవయ్యేళ్ల క్రితం వచ్చి ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'దిల్‌వాలే దుల్హనియే లేజాయేంగే' . దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా నిర్మాణం విషయంలో ఆసక్తికరమైన అంశాలున్నాయి. అందుకే వాటి గురించి ఓ డాక్యుమెంటరీ రూపొందించింది లండన్‌ ఫిల్మ్‌ స్కూల్‌కు చెందిన ఓ బృందం. ఐదుగురు సభ్యులతో కలసి నతాస్జా రాఠోడ్‌ అనే ఫిల్మ్‌ స్కూల్‌ విద్యార్థి ఈ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు.

    దీని కోసం ఆ సినిమా చిత్రీకరణ జరిగిన లండన్‌, స్విట్జర్లాండ్‌తోపాటు మన దేశంలోనూ పర్యటిస్తున్నారు. ఇటీవల ఈ బృందం స్విట్జర్లాండ్‌లో పర్యటించింది. ''ఈ సినిమాకు పని చేసినవారు, చిత్రీకరణ జరిగిన ప్రాంతాల్లోని వ్యక్తుల అనుభవాలను తెలుసుకోవాలనుకున్నాం. అందుకే ఇటీవలే స్విట్జర్లాండ్‌ వెళ్లొచ్చాం. ఈ పర్యటన మేం జీవితంలో మరచిపోలేం'' అని చెప్పారు నతాస్జా రాఠోడ్‌.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ చిత్రం జాతీయ అవార్డుతో పాటు ఏడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు పొందింది. మరాఠా మందిర్‌లో తొలిసారిగా 1995 అక్టోబరులో ప్రదర్శన ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతిరోజూ ప్రదర్శితమై సుదీర్ఘకాలం ప్రదర్శించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలైనప్పుడు ఈ స్థాయిలో గొప్ప చరిత్ర సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆదిత్య చోప్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది ఆదర్శప్రేమకథ. యువతరం లోనే కాకుండా, మధ్యవయస్కుల, వయోవృద్ధుల హృదయాలపై కూడా చెరగని ముద్రవేసి ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది.

    Documentary on ‘Dilwale Dulhania Le Jayenge’ in the making

    కధగా చూస్తే...యూరప్‌ ట్రిప్‌లో సిమ్రన్‌ (కాజోల్‌) అనే ఎన్నారై అమ్మాయితో ప్రేమలో పడ్డ పంజాబీ అబ్బాయి రాజ్‌ (షారుఖ్‌ఖాన్‌) తన ప్రేమను గెలిపించుకోడానికి తనతో పాటు ఆమెను లండన్‌ తీసుకెళ్లడం కోసం ఎన్నికష్టాలు పడ్డాడనేది ఇందులోని ప్రధానాంశం. రాజ్‌ పాత్రతో ప్రతి అబ్బాయి సహానుభూతి చెందడం, తనను తాను చూసుకోవడం వల్లే ఆ పాత్ర అమితాదరణ పొందగలిగింది. ఆ పాత్రలో షారుఖ్‌ తనదైన శైలిలో నటించి జీవించాడు. అతని జోడీగా కాజోల్‌ సమానంగా నటించింది. బాలీవుడ్‌ హిస్టరీలో టాప్‌హిట్‌ ఫెయిర్‌గా వీరిద్దరూ నిలిచిపోయారు.

    రాజ్‌ మల్హోత్రా, సిమ్రాన్‌ సింగ్‌ పాత్రల్లో షారుక్‌ ఖాన్‌, కాజోల్‌ జీవించారు. ఇంకా అమ్రిష్‌పురి, అనుపమ్‌ఖేర్‌, ఫరీదా జలాల్‌.. చేసినవి సహజమైన పాత్రలే అన్నట్లుగా అనిపిస్తాయి. అంతగా ఆ పాత్రలకు ప్రాణం పోశారు. మనం చూస్తున్నది సినిమా అని మరిచిపోయి జీవితాన్నే చూస్తున్నామా! అనే భావన కలిగిస్తుందీ సినిమా. డీడీఎల్‌ మహత్యం అదే.

    తెలుగులోనూ పెద్ద హిట్టే ఈ చిత్రం తెలుగులో ప్రేమించి పెళ్లాడతా పేరుతో అనువాదమైంది. ఓవైపు హిందీ సినిమా ఆడుతున్నా, మరోవైపు తెలుగు చిత్రానికి కూడా అద్భుతమైన ఆదరణ లభించింది. కొన్ని కేంద్రాల్లో వంద రోజులాడింది కూడా. ట్రెండ్‌, భాష, ప్రాంతానికి అతీతమైన సినిమాగా డీడీఎల్‌ నిలిచింది. గత 19 ఏళ్లలో అన్ని భారతీయ భాషల చిత్రాలపైనా డీడీఎల్‌ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆ చిత్రంలోని ఒక సీనైనా ఏదో సినిమాలో కనిపించడం విశేషం.

    ఇక ముంబయిలోని మరాఠా మందిర్‌లో 1009 వారాల పాటు నిర్విరామంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఈ సంవత్సరం ...ఫిబ్రవరి 18 ...తో తెరపడింది. గత డిసెంబరులో 1000 వారాలు అయిన సందర్భంగా అక్కడ వేడుకలు సైతం జరిపారు.

    వేడుకలకి ఆ సినిమా హీరో హీరోయిన్లు షారూఖ్‌ఖాన్‌, కాజోల్‌లు హాజరయ్యారు. ఈరోజు ఉదయం ఈ చిత్రాన్ని చివరిసారి ప్రదర్శించారు. థియేటర్‌లో రోజూ కొత్త చిత్రాల నాలుగు ప్రదర్శనలు నిర్వహిస్తూ అదనంగా దీన్ని ప్రదర్శించడం సిబ్బందికి కష్టంగా ఉందని భావించిన యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

    English summary
    ‘Dilwale Dulhania Le Jayenge’ (1995) is still regarded as one of the most iconic romantic films to come out of Bollywood, even twenty years after its release. The film has fans from around the globe, and now, final year students, Natashja Rathore and her crew of five, from the London Film School, are making a documentary on the cultural impact that the film has left behind.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X