»   » అల్లు అర్జున్ సరసన అనుష్క సూటవుతుందా..?

అల్లు అర్జున్ సరసన అనుష్క సూటవుతుందా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసమే కమలహాసన్ చిత్రం 'విశ్వరూపం' నుంచి తను బయటకు వచ్చేసినట్టు ప్రచారం కూడా జరిగింది. ఈ చిత్రంలో నటించడానికి అల్లు అర్జున్ అంగీకరించాడు. ఇందులో అనుష్కను కథానాయికగా తీసుకోవడానికి సెల్వా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్ కి అనుష్క కూడా పాజిటివ్ గా స్పందించిందట.

అసలు మొదట్లో వేసుకున్న షెడ్యులు ప్రకారమైతే ఈ సినిమా ఆగష్టులోనే ప్రారంభం కావాల్సి వుంది. అయితే, అర్జున్, అనుష్క ఇద్దరూ కూడా ఇతర ప్రాజక్టులలో బిజీగా వుండడం వల్ల, ఇది నవంబర్ లో మొదలవుతుందని అంటున్నారు. ఈలోగా సెల్వా ఎప్పటి నుంచో పెండింగులో వున్న తన 'ఎరాండం ఉలగాం' సినిమాను పూర్తి చేస్తాడు. ఇదిలా ఉంచితే, ఆమధ్య వచ్చిన 'ఖలేజా'లో మహేష్ బాబు పక్కనే అనుష్క అతనికి అక్కలా కనిపించిందన్న కామెంట్లు వినిపించిన నేపథ్యంలో... ఆల్రెడి అనుష్క, అల్లు అర్జున్ క్రిష్ దర్శకత్వంలో 'వేదం" సినిమాలో నటించారు. అయితే హీరోయిన్ గా కాదు.మరి లారెన్స్ దర్శకత్వంలో అర్జున్ పక్కన ఇంకెలా వుంటుందో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి!

English summary
For the first time in their careers, stylish actor Allu Arjun and South India's reigning actress Anushka will romance onscreen in the forthcoming by director Lawrence.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu