»   »  మీనా మొగుడు కావాలంటే...

మీనా మొగుడు కావాలంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Meena
చాలా కాలంనుంచీ మీనా,ఆమె తల్లి పెళ్ళి కొడుకు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే వారికి నచ్చే వాడు ఇప్పటి వరకూ తారసపడలేదుట. ఇక ఆమె కు భర్త అయ్యే వాడు ఎలా ఉండాలనేది తల్లీ,కూతుళ్ళు స్పెసిఫిక్ గా చెపుతున్నారు. ఆ వివరాలు...వరుడు చెన్నైలో సెటిల్ అయ్యి ఉండాలి. ఎందుకంటే మీనా ఆమె తల్లి తండ్రులకు ఒక్కత్తే కూతరు కాబట్టిట. వారికి దగ్గరిగా ఉండాలని కోరుకుంటోంది కాబట్టి.


ఇక ఆమె వయిస్సు 30 సంవత్సరాలు (పుట్టిన తేది September 16, 1978).కాబట్టి వరుడు ఓ మూడేళ్ళు అయినా పెద్దవాడయి ఉండాలి. సినిమా వాళ్ళ మీద పెద్ద ఆసక్తి లేదుట. బిజెనెస్ గానీ సాఫ్ట్ వేర్ వాళ్ళయితే మేలుట. ఇక ఆమెను ఆమెగా ప్రేమించేవాడు అయ్యుండాలిట. అంతేగానీ డబ్బు,కీర్తి అవి చూసి ఇష్టపడి ఆశపడేవాడు అయ్యుండకూడదట. ఇలా...ఇంకా చాలా ఉన్నాయట. ముందు అతని నవ్వు నచ్చాలిట...

సింపుల్ సిటీ నచ్చాలట...అలాగే ప్రస్తుతం ఆమె మళ్ళీ బిజీ అవుతోంది కాబట్టి కెరీర్ కి అడ్డుపడకూడదట. ఇంకా...చాలా ఉన్నాయంది నవ్వుతూ...ముందు ఆమెకి నచ్చాలి కాబట్టి ట్రై చేసేవారు ఆమెకు కనపడి రెస్యూమ్ ఇవ్వటం బెటర్. ఇక ఇంతకు ముందే ఆమె కన్నడ నటుడు సుదీప్ ని వివాహం చేసుకుందని వార్తలు వచ్చాయి కదా అని అడిగితే కోపంతో అవి రూమర్స్ అని వెళ్ళిపోయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X