మరో సారి మెగాపవర్ చాటుకోనున్న రామ్ చరణ్...!?

By Sindhu

హీరోగా రామ్ చరణ్ ఇమేజ్ పెరగడంలో కీలకపాత్ర పోషించిన 'మగధీర' చిత్రాన్ని ఇప్పుడు తమిళంలోకి 'మావీరన్' పేరుతో అనువదించారు. ఈ తమిళ వెర్షన్ ను తమిళనాడులోనూ, బెంగళూరులోనూ ఈ శుక్రవారం (మే 27) భారీ ఎత్తున వందలాది స్క్రీన్స్ పై రిలీజ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ చిత్రం రిలీజ్ పలు కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు రెడీ అయింది.

ఇటీవలి కాలంలో ఈ 'మావీరన్' కు భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేబట్టారు. ఆడియోను కూడా ఆమధ్య చెన్నయ్ లో ఘనంగా తమిళ సినీ ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేశారు. తెలుగులో ఈ చిత్రం రికార్డు విజయం సాధించడంతో తమిళ చిత్ర పరిశ్రమ ఈ చిత్రం రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఉదయనిది స్టాలిన్ కి చెందిన రెడ్ జెయింట్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ అక్కడ విడుదల చేస్తోంది. మరి రామ్ చరణ్ తమిళంలో కూడా మెగాపవర్ చూపిస్తాడో లేదో వేచి చూడాల్సిందే....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X