‘దోచేయ్’ ఇంట్రడక్షన్ సాంగ్ (వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: నాగ చైతన్య కథానాయకుడిగా, కృతి సానన్ హీరోయిన్ గా.... ‘స్వామిరారా'ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దోచేయ్'. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్ 3న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలను ఈ రోజు(మార్చి 28) నుండి ఏప్రిల్ 1 వరకు రోజుకో పాటను విడుదల చేయబతోున్నారు.

ఇందులో భాగంగా ఈ రోజు ‘నచ్చితే ఏ పనైనా..నవ్వుతూ చేసి రానా..ఎవ్వడు ఏమిటన్నా..ఆగక సాగిపోనా' అంటూ సాగే పాటను విడుదల చేసారు. ఇది ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రడక్షన్ సాంగ్. ఏప్రిల్ 1 వరకు మొత్తం 4 పాటలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 2న సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఏప్రిల్ 3న లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది.

Dohchay-Nacchite Ye Panaina Song Teaser

ఏప్రిల్ 17న సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల చేయడానికి నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. యువసామ్రాట్ నాగ చైతన్య సరసన కృతి సానన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, రవిబాబు, రావు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, కెచ్చా కంపక్డే, విజయ్, డాన్స్: జానీ, శేఖర్, ఆర్ట్: నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్ ఈదర, కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్, కథ-దర్శకత్వం: సుదీర్ వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X