»   » టుడే రిలీజ్..రవితేజ 'డాన్ శీను' ప్రివ్యూ

టుడే రిలీజ్..రవితేజ 'డాన్ శీను' ప్రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎవరైనా డాక్టరో, ఇంజినీరో అవ్వాలనుకొంటారు. మరి శీనేంటీ డాన్‌ అవ్వాలనుకోవడం అంటారా..? దానికో స్ఫూర్తి ఉందండోయ్‌. అమితాబ్‌ బచ్చన్‌ 'డాన్‌' సినిమాయే అందుకు కారణం. శీను (రవితేజ)కు ఐదేళ్ల వయసు నుంచి అమితాబచ్చన్‌ అంటే చాలా అభిమానం. అమితాబ్‌ పోషించిన పాత్రలను తనకు ఆపాదించుకుంటూ శీను డాన్‌గా మారే క్రమంలో జరిగిన సంఘటనల సమాహారామే ఈ చిత్ర కథాంశం. అలాగే రవితేజ అమితాబ్ డాన్ చిత్రానికి వీర ఫ్యాన్ గా ఆ డైలాగులు చెబుతూ మై హూ డాన్ అంటూ తిరుగుతూంటాడు. అతన్ని ఊళ్ళో వాళ్ళంతా డాన్ శీను అని పిలుచుకుంటూంటాడు. దాన్ని నిజం చేసుకోవటానికి అతను హైదరాబాద్ వస్తాడు. అక్కడ డాన్ గా ఉన్న శ్రీహరి మనుషులను కొడతాడు. ఎందుకు కొట్టావు అంటే నీ దృష్టిలో పడటానికే అంటాడు.

దాంతో అతను రవితేజని ఎలా గయినా ఇరికించాలని ముంబయిలో మరో పెద్ద డాన్ చెల్లెలను లైన్ లో పెట్టమని పురమాయిస్తారు. దాంతో అక్కడికి వెళ్ళిన శ్రీను తను పురమాయించిన అమ్మాయిని కాక తన చెల్లినే లైన్ లో పెట్టాడని తెలుసుకున్నా ఒరిజనల్ డాన్ రవితేజని ఏం చేస్తాడు...అలాగే రవితేజకు అంత అవసరం ఏమొచ్చిందనే ప్లాష్ బ్యాక్ సెకెండాఫ్ లో ఉంటుందంటున్నారు. శీనుకు సమఉజ్జీగా నర్సింగ్‌ (శ్రీహరి) ఉంటాడు. ఈ ఇద్దరికీ ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెరపైనే చూడాలి అంటున్నారు నిర్మాతలు.

శ్రియ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, సయాజీ షిండే, వేణుమాధవ్‌, బ్రహ్మాజీ, యాష్‌ పాల్‌ శర్మ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, కో-డైరెక్టర్‌: తరణీరావు, కెమెరా: సమీర్‌ రెడ్డి, సంగీతం: మణిశర్మ, కథ, స్కీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని, నిర్మాత: వెంకట్‌, నిర్మాణం: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu