»   » సక్సెస్ ఫుల్ గా డాన్ శీనుకి వంద రోజులు...

సక్సెస్ ఫుల్ గా డాన్ శీనుకి వంద రోజులు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బేనర్ లో, రవితేజలాంటి అగ్ర హీరోతో తొలి సినిమా చేసే అవకాశం రావడం, అది 100 రోజులు పూర్తి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకట్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటున్నారు గోపిచంద్ మలినేని. రవితేజ, శ్రియ జంటగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'డాన్ శీను".

శుక్రవారానికి ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా గోపిచంద్ పై పై విధంగా స్పందించారు. 'కిక్ తర్వాత మా ఆర్.ఆర్.మూవీ మేకర్స్‌ లో రవితేజతో తీసిన 'డాన్ శీను" శతదినోత్సవ చిత్రం కావడం ఆనందంగా ఉంది" అని అచ్చిరెడ్డి తెలిపారు. 'అన్ని ముఖ్య కేంద్రాల్లో ఈ చిత్రం 100 రోజులు ప్రదర్శించబడింది. మా సంస్థకు మరో మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అని సురేష్‌రెడ్డి అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu