»   » రవితేజ్ ఆమెకు ఇచ్చినట్టే ఈ గ్లామర్ క్వీన్ కీ ఇచ్చేస్థాడా...!?

రవితేజ్ ఆమెకు ఇచ్చినట్టే ఈ గ్లామర్ క్వీన్ కీ ఇచ్చేస్థాడా...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కిక్"..రవితేజ, ఇలియానాలకు హిట్ పెయిర్ గా పేరు తెచ్చిన చిత్రమిది. 'ఖతర్నాక్" తో ప్లాప్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రవితేజ, ఇలియానాల కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతోంది అనగానే చాలా మంది పెదవి విరిచేశారు. అయితే ఆ పెదవి విరుపులకు భిన్నంగా ఈ చిత్రం మ్యాజిక్ చేసి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. వాస్తవానికి హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంటేనే రెండో అవకాశం గగనం అయిపోతున్న ఈ రోజుల్లో రవితేజ, ఇలియానాల కాంబినేషన్ అందుకు విరుద్దంగా తొలుత భారీ ప్లాప్ ను ఆ తర్వాత భారీ హిట్ ను నమోదు చేసుకుని ఫట్ వున్నా హిట్ ను పొందవచ్చని నిరూపించుకుంది.

కాగా ఇప్పుడు అదే కోవలోకి రవితేజ మరో నాయికను చేర్చనున్నాడు. ఆమె ఎవరో కాదు శ్రియ. ఈ గ్లామర్ క్వీన్ రవితేజతో తొలిసారి నటించిన 'భగీరథ" చిత్రం ప్లాప్ అయినప్పటికీ ఈ రెండో చిత్రం 'కిక్" తరహాలోనే వారి కాంబినేషన్ కు హిట్ పెయిర్ గా మార్చుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. అన్నట్టు ఈ రెండు చిత్రాల (కిక్, డాన్ శీను)ను ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం గమనార్హం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X