»   » హిట్ ..హీరో ది అయితే ఫ్లాఫూ హీరో కే: 'సరైనోడు' హీరోయిన్

హిట్ ..హీరో ది అయితే ఫ్లాఫూ హీరో కే: 'సరైనోడు' హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అయినా హిట్, ఫ్లాఫ్ లను బట్టి హీరోయిన్స్ ప్రతిభను లెక్కగట్టలేం. ఓ సినిమా హిట్టయితే హీరోలకే ఆ క్రెడిట్‌ వెళ్లిపోతుంటుంది. ఫ్లాప్‌ అయితే హీరోయిన్స్ ని నిందించడం దేనికి? అంటూ సూటిగా ప్రశ్నిస్తోంది కేధరిన్ ధెరిస్సా.

అదేంటో కేథరిన్ థెరిసా కు తొలి నుంచి పెద్ద సినిమాలు వస్తున్నా, కెరీర్ సాఫీగానే ఉన్నా, అందానికి లోటు లేకున్నా సక్సెస్ మాత్రం ఆమె దరిచేరటంలేదు. ఈ విషయమై ఆమె కూడా చిరాకుగా ఉన్నట్లు ఉంది. అంతెందుకు ఈ మధ్యనే ఆమె అల్లు అర్జున్ చిత్రం సరైనోడు లో ఎమ్మల్యే పాత్రలో కనిపించింది.

వరసా సినిమాలో మెరుస్తున్నా, అవకాశాల్ని అందిపుచ్చుకొంటున్నా.. వాటిని విజయాలుగా మలచుకోలేకపోతోంది కేథరిన్‌. అయితే తన వంతు ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది. 'సరైనోడు'లో యంగ్‌ ఎమ్మెల్యేగా కనిపించి ఆకట్టుకొంది. ఇంత పెద్ద మాస్‌, కమర్షియల్‌ చిత్రంలో స్థానం దక్కడం కేథరిన్‌కి ఇదే తొలిసారి. అందుకే సినిమా విడుదలకు ముందే హిట్‌ కొట్టినంత సంబర పడింది.

ఎమ్మల్యేగా ఆమె ఆ పాత్రలో గ్లామర్ ఒలకబోసి కుర్రాళ్లకు కిక్కు ఎక్కించింది. కథలో పెద్దగా ప్రయారిటీ లేకపోయినా అల్లు అర్జున్ కొంతకాలం పాటు లవ్ చేసే అమ్మాయిగా పాత్రలో లీనమై పొగరు, ప్రేమ వంటివి అలవోకగా తన ఫేస్ లో ప్రతిఫలించింది. అయితేనేం...ఈ సినిమాకు కూడా మిక్సెడ్ టాక్ రావటం ఆమెను భాధ పెట్టినట్లుంది. అయితే అది పైకి వ్యక్తం చేయటంలేదు, కానీ ఆమె మాటల్లో వ్యక్తం అవుతోంది.

కేధరిన్ ఇంకేమంది... అనేది స్లైడ్ షోలో చూడండి..

బ్లేమ్ చేయద్దు..

బ్లేమ్ చేయద్దు..

కేధరిన్ థెస్రా మీడియాతో మాట్లాడుతూ... 'ఫ్లాఫ్ లకు నన్ను బ్లేమ్ చేయొద్దు...ఎన్నో ఫాక్టర్స్ ఒక సినిమా విషయంలో పనిచేస్తూంటాయి. అందులో అదృష్టం కూడా ఒకటి.

నా చేతిలో లేవు..

నా చేతిలో లేవు..

హిట్, ఫ్లాఫ్ అనేవి నా చేతిలో లేవు. కేవలం హిట్ రేషియో ని బట్టే ఒక హీరోయిన్ టాలెంట్ ని లెక్కబెట్టకూడదు.

ఫ్లాఫ్ కూడా...

ఫ్లాఫ్ కూడా...

సినిమా హిట్టైందంటే దాని క్రెడిట్ మొత్తం హీరోకు వెల్తుంది. అలాంటప్పుడు సినిమా ఫ్లాఫ్ అయినప్పుడు కూడా హీరోకే ఆపాదించాలి దాన్ని..అంతేకాని హీరోయిన్ కు అంటగట్టడానికి ప్రయత్నించకూడదు'. అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.

బెస్ట్ గా..

బెస్ట్ గా..

ఇద్దరమ్మాయిలు చిత్రంతో అల్లు అర్జున్ సరసన నటించిన ఆమె తనకు ఏదైతే క్యారక్టర్ ఇచ్చారో అందులో బెస్ట్ గా చేసి చూపెట్టడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది.

అదేంటో సెకండ్ హీరోయిన్..

అదేంటో సెకండ్ హీరోయిన్..

అయితే అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరు అమ్మాయిలతో, రుద్రమదేవి, సరైనోడు చిత్రాలలో ఆమె సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపించింది.

అదే చూసుకుంటా

అదే చూసుకుంటా

.'నేను ఎప్పుడూ నాకు ఎంత స్క్రీన్ టైమ్ ఇచ్చారు అనే విషయమై ఆలోచించను. నేను సినిమాలో నా పాత్రకు ఎంత ప్రిఫరెన్స్ ఉందనే విషయం కే ప్రయారిటీ ఇస్తాను. దాన్ని బట్టే నేను సినిమాలు ఒప్పుకుంటాను ,' అని చెప్పుకొచ్చింది.

'సరైనోడు'లో సరైన పాత్రే

'సరైనోడు'లో సరైన పాత్రే

ఎన్నాళ్ల నుంచో నేను ఇలాంటి విజయం కోసమే ఎదురుచూస్తున్నా. ఇన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నాను గానీ, ఏదో ఓ అసంతృప్తి. 'సరైనోడు'తో అది పోయింది.

చాలా హ్యాపీ

చాలా హ్యాపీ

ఈసినిమాకి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నన్నూ, నా పాత్రనీ గుర్తించారు. దాంతో ఆనందం రెట్టింపు అయ్యింది.

నేను మాత్రమే కాదు..

నేను మాత్రమే కాదు..

ఇన్నాళ్లుగా విజయాలు ఎందుకు దక్కలేదు... దానికి నేను మాత్రమే బాధ్యురాలిని కాదు. ఓ సినిమా ఆడాలంటే చాలా అంశాలు దోహదం చేయాలి. ఒకరిద్దరు రాణించినంత మాత్రన ఏదీ అవ్వదు. కొన్నిసార్లు అదృష్టం కలసి రాదు.

ఫ్యాషన్

ఫ్యాషన్


నాకు సినిమా అంటే ఫ్యాషన్‌. ఆ పిచ్చి ప్రేమతోనే నటిస్తా. జయాపజయాలు మాత్రం నా చేతుల్లో లేని విషయాలు.

ప్లాన్ చేసుకోలేదు..

ప్లాన్ చేసుకోలేదు..

బన్నీతో ఇది మూడో సినిమా... అవును. 'ఇద్దరమ్మాయిలతో', 'రుద్రమదేవి'లో బన్నీతో కలసి నటించాను. ఇది మూడో సినిమా. అయితే ఇదంతా కావాలని ప్లాన్‌ చేసుకొన్నది కాదు. యాదృఛ్చికంగా జరిగిపోయింది.

కష్టమే...

కష్టమే...


బన్నీ చాలా ఎనర్జిటిక్‌ హీరో. అతని నటన, డాన్సుల గురించి కొత్తగా చెప్పేదేముంది? బన్నీతో డాన్స్‌ అంటే కష్టమైన విషయమే.

అంత ప్రాధాన్యత ఇవ్వను

అంత ప్రాధాన్యత ఇవ్వను

''గ్లామర్‌ అనే పదానికి నేను అంత ప్రాధాన్యం ఇవ్వను. నటనతోనే రాణించాలి, నటిగానే పేరు తెచ్చుకోవాలి అన్నది నా ఉద్దేశం. అయితే అలాంటి అవకాశం నాకు ఇప్పటి వరకూ రాలేదనే చెప్పాలి.

గ్లామర్ పాత్రేం కాదు..

గ్లామర్ పాత్రేం కాదు..

'సరైనోడు'లోనూ నాది గ్లామర్‌ పాత్రేం కాదు. పాత్రకు తగ్గట్టు హుందాగా కనిపించాలి. నేను అదే చేశా. ఏ పాత్రకు ఎంత చేయాలో నాకు తెలుసు. నా పరిమితులు నాకు తెలుసు''

అస్తమానూ సెకండ్ హీరోయిన్ అంటే బోర్‌ ?

అస్తమానూ సెకండ్ హీరోయిన్ అంటే బోర్‌ ?

నాకు మాత్రం సెకండ్‌ హీరోయిన్‌ అని పిలిపించుకోవాలని ఉంటుందా? అయితే సినిమాల్ని ఎంచుకొనే విషయంలో నా దృష్టి కోణం వేరు. నేనెప్పుడూ పాత్ర నిడివికి కాదు, ఆ పాత్రకున్న ప్రాధాన్యతనే చూస్తా.

కీలకమైన పాత్ర అనే ఒప్పుకున్నా..

కీలకమైన పాత్ర అనే ఒప్పుకున్నా..

'రుద్రమదేవి'లో కనిపించింది కాసేపే అయినా చాలా కీలకమైన పాత్ర అది. 'సరైనోడు'లో పేరుకి రెండో హీరోయిన్ అయినా, ఫస్టాఫ్‌ అంతా నేనే కనిపిస్తా.

భయపడను

భయపడను

సక్సెస్ ల్లేని హీరోయిన్‌పై ఐరెన్‌ లెగ్‌ అనే ముద్ర పడిపోతుందే భయం నాకు లేదు... ఎవరో ఏదో మాట్లాడుకొంటారని బెంగపెట్టుకొనే మనస్తత్వం కాదు నాది. నేనేంటో, పాత్ర కోసం ఎంత కష్టపడతానో నాకు తెలుసు.

సంతోషంగానే ఉన్నా..

సంతోషంగానే ఉన్నా..

తెలుగు కంటే తమిళంలో మంచి అవకాశాలొస్తున్నాయా అంటే.. అదేం లేదు. నాకు తెలుగు, తమిళ చిత్రసీమలు రెండూ సమానమే. నాకొస్తున్న అవకాశాల పట్ల సంతోషంగానే ఉన్నా అని చెప్పింది.

బాలీవుడ్‌కి ప్రయాణం..

బాలీవుడ్‌కి ప్రయాణం..

ఆ ఆలోచన ప్రస్తుతానికి లేదు. తెలుగు, తమిళంలో నేను నిరూపించుకోవాల్సింది చాలా ఉంది.

కెమిస్ట్రి అంటే..

కెమిస్ట్రి అంటే..


హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కుదిరితే, సగం విజయం చేతికందినట్టే అంటారు. అసలు కెమిస్ట్రీ అంటే ఏమిటి? నాకు ఆ పదమే అర్థం కాలేదు. తెరపై హీరోహీరోయిన్లు అందంగా కనిపించినంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయంటే నేను నమ్మను.

ఒప్పుకోలేదు

ఒప్పుకోలేదు

తెలుగులో కొత్త సినిమాలేమీ ఒప్పుకోలేదు. 'సరైనోడు' తరవాత అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇంకా ఏదీ కమిటవలేదు.

కానీ...

కానీ...

తమిళంలో విశాల్‌తో నటిస్తున్నా. ఆర్యతోనూ ఓ సినిమా చేస్తున్నా. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

English summary
Catherine said, 'You can't measure a heroine's talent simply based on hit ratio. If a film hits bull's eye, Hero takes the whole credit. When should one blame the Heroine when a film turns dud?'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu