»   » నేను రాకముందు రేప్‌లు జరుగలేదా?: పూనమ్ (పిక్చర్స్)

నేను రాకముందు రేప్‌లు జరుగలేదా?: పూనమ్ (పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : పూనమ్ పాండే లాంటి వాళ్ల రెచ్చగొట్టే చిత్రాలు ఇంటర్నెట్లో, మేగజైన్లలో దర్శనం ఇవ్వడమే దేశంలో మహిళపై లైంగిక దాడులు(రేప్) పెరిగిపోవడానికి కారణం అవుతుందనే ఆరోపణలపై....వివాదాస్పద మోడల్ పూనమ్ పాండే ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల ముంబైలో ఫోటో జర్నలిస్టుపై గ్యాంగ్ రేప్ జరిగి అనంతరం తన పేరు వార్తల్లోకి రావడంపై ఆమె స్పందించారు.

'నా ఫోటోల వల్లనే మహిళలపై నేరాలు పెరిగిపోతున్నట్లు కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన విషయంలోనూ కొందరు నన్ను నిదించారు. నావి రెచ్చగొట్టుడు ఫోటోలని, వాటి వల్లనే మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని అని నన్ను నిందిస్తున్న వారికి నేను ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను. నేను ఫీల్డ్‌లోకి రాక ముందు మహిళపై ఇలాంటి నేరాలు ఏమీ జరుగలేదా?' అని ఫైర్ అయ్యారు.

'లా అండ్ అర్డర్ సరిగా పరిరక్షించలేని కొంత మంది వ్యక్తులు, కొన్ని సంఘాలు నన్ను కావాలని బ్లేమ్ చేస్తున్నాయి. ఎంతో మంది స్టార్ హీరోయిన్లు సినిమాల్లో ఐటం సాంగులు చేస్తున్నారు. మగాళ్లు నాకంటే వారినే ఎక్కువ చూస్తున్నారు. సినిమాలు, ఫోటోల్లో మగాళ్లు తమని చూడటం వల్లనే ఇలాంటి జరుగుతున్నాయనడం సబబు కాదు. నా అభిప్రాయం ప్రకారం ఇళ్లలో సెక్సువల్ రిలేషన్స్ సరిగా లేకపోవడం, సరైన క్రమశిక్షణ లేని వారు ఇలా బయటకు వచ్చి రెచ్చిపోతున్నారు.' అని వ్యాఖ్యానించింది.

'మహిళలు కురచ దుస్తువలు వేసుకుని ఎక్స్ ఫోజింగ్ చేయడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయనే వాదనను ఆమె తోసి పుచ్చారు. ఐదేళ్ల బాలికలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలు వేసుకునే స్కర్టులు కూడా మగాళ్లను రెచ్చగొడుతున్నాయా? ఇదంతా పనికిమాలిన వాదన' అంటూ పూనమ్ ఫైర్ అయ్యారు.

మోడల్‌గా కెరీర్

మోడల్‌గా కెరీర్

కింగ్ ఫిషర్ మోడల్‌గా వెలుగులోకి వచ్చిన పూనమ్ పాండే ఆ తర్వాత పబ్లిసిటీ పెంచుకోవడానికి తనదైన మార్గాన్ని ఎంచుకుంది. సోషల్ నెట్వర్కింగును వేదికగా చేసుకుని తన సెక్సీ ఇమేజ్‌లతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ

వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ

పబ్లిసిటీ పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న పూనమ్ పాండే టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా ప్రదర్శన ఇస్తానంటూ సంచలనం సృష్టించింది. అయితే ఆమె తీరుపై విమర్శలు రావడంతో న్యూడ్ షో సాహసం చేయలేదు.

ప్రముఖులే టార్గెట్

ప్రముఖులే టార్గెట్

ప్రముఖులను టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా పబ్లిసిటీ పెంచుకునే ప్రయత్నం చేసిన పూనమ్...దేశ ప్రధానితో పాటు పలువురు ప్రముఖులను టార్గెట్ చేసింది. తద్వరా తన రేంజి పెంచుకుంది. తరచూ సెక్సీ ఫోటోలు పోస్టు చేస్తుండటంతో ఆమెను సోషల్ నెట్వర్కింగులో ఫాలో అయ్యే వారి అభిమానుల సంఖ్య పెరిగి పోయింది.

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి

మోడల్‌గా వివాదాస్పద వ్యాఖ్యలు, పనులతో బోలెడు పబ్లిసిటీ సంపాదించుకున్న పూనమ్ పాండే సినిమాల్లోకి తన ఎంట్రీని సులభతరం చేసుకుంది. నషా సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

నషా

నషా

పూనమ్ పాండే నటించిన తొలి చిత్రం ‘నషా'కు బాలీవుడ్ నిర్మాత ఆదిత్య భాటియా నిర్మించారు. అమిత్ సక్సేనా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. తొలి చిత్రం పూనమ్ పాండేకు పెద్దగా పేరు తేక పోయినా...ఆమె సెక్సీ యాక్ట్స్ మాత్రం శృంగార ప్రియులను ఆకట్టుకుంది.

English summary
"Apparently my pictures are responsible for crime against women. Ha ha, really? The same reasoning was used against me during the Nirbhaya case in Delhi. I want to ask all those people who find me provocative enough to induce crime, was there no crime against women before I arrived on the scene," Poonam asked while speaking to IANS.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu