For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఐ బెగ్ యూ... నా సినిమాను చంపొద్దు: హీరో సంచలన లేఖ

  By Bojja Kumar
  |
  Dulquer Salmaan Says "I Beg You. Please Don't Do That" హీరో సంచలన లేఖ

  దుల్కర్ సల్మాన్ హీరోగా విజయ్ నంబియార్ దర్శకత్వంలో ఇటీవల మలయాళంలో 'సోలో' అనే సినిమా వచ్చింది. మలయాళంతో పాటు తమిళంలో విడుదలైన ఈ చిత్రం ఓ ఎక్సపర్మెంటల్ రొమాంటిక్ చిత్రం. అయితే సినిమా విడుదలైన తొలిరోజే దారుణమైన ప్లాప్ టాక్ వచ్చింది.

  సినిమాకు నెగెటివ్ టాక్ రావడం, రివ్యూలు నెగెటివ్ గా రావడం, చాలా మంది సినిమా బాగోలేదని రాస్తుండటంతో దుల్కర్ సల్మాన్ తట్టుకోలేక పోయాడు. తన మనసులోని బాధను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చాలా సుదీర్ఘమైన సందేశం రాసిన దుల్కర్.... దీన్ని పూర్తిగా చదవే ఓపిక లేని వారు దయచేసి దీన్ని చదవడం మానివేయాలని సూచించడం గమనార్హం.

  ‘సోలో' లాంటి సినిమా ప్రతి యాక్టర్ డ్రీమ్

  ‘సోలో' లాంటి సినిమా ప్రతి యాక్టర్ డ్రీమ్

  ‘సోలో' తనకు ఎంతో నచ్చిన సినిమా, నేను ఇప్పటి వరకు చేసిన వాటిలో బెటర్ సినిమా. ‘సోలో' లాంటి సినిమా ప్రతి యాక్టర్ డ్రీమ్. ఈ సినిమా షూటింగులో ప్రతి సెకండ్ ఎంజాయ్ చేశాను. సినిమా ఫైనల్ ప్రొడక్ట్ కూడా నాకు ఎంతో నచ్చింది. ఈ సినిమా కోసం నా హార్ట్ అండ్ సోల్ పెట్టి పని చేశాను. లిమిటెడ్ బడ్జెట్ లో ఇంత పెద్ద సినిమా చేయడానికి మా రక్తాన్ని, చెమటను పెట్టుబడిగా పెట్టాము. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ చేస్తాను. నేను ఎప్పుడూ డిఫరెంట్‌గా చేయాలని కోరుకుంటాను ... అని దుల్కర్ సల్మాన్ వ్యాఖ్యానించారు.

  ఇలాంటి సినిమా ఎందుకు చేశావంటున్నారు

  ఇలాంటి సినిమా ఎందుకు చేశావంటున్నారు

  ఈ సినిమా చూసి కొందరు.... ‘సోలో' సినిమా నా గత చిత్రాలు ‘చార్లీ', ‘బెంగుళూరు డేస్' తరహాలో లేవని అంటున్నారు. ఇలాంటి సినిమా ఎందుకు చేశావని అంటున్నారు. ఇలాంటి సినిమాలు అవాయిడ్ చేయాలంటున్నారు. ఇలాంటి ఎక్స్‌పర్మెంటల్స్ అవసరం లేదని సూచిస్తున్నారు. కానీ నేను ఎప్పుడూ డిఫరెంట్ చిత్రాలను చేయాలని కోరుకుంటానని మీకు తెలుసు... అని దుల్కర్ సల్మాన్ వ్యాఖ్యానించారు.

  జడ్జ్ చేయడం ఎందుకు

  జడ్జ్ చేయడం ఎందుకు

  ఈ భూమి మీద కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో స్టోరీ ఉంటుంది. ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎన్నో తేడాలు, విభేదాలు ఉంటాయి. అవి మీకు సంబంధం లేనివి అయితే దూరంగా ఉండాలని, వాటి గురించి మీకు తెలియక పోతే తప్పు అనే నిర్ణయానికి రాకూడదు. మనం కేవలం మనుషులం. ఇది తప్పు, ఇది రైటు అని జడ్జ్ చేయడం ఎందుకు?.... అంటూ దుల్కర్ సల్మాన్ వ్యాఖ్యానించారు.

  నాకు ఇష్టమైన స్టోరీలను ఎంచుకుంటాను

  నాకు ఇష్టమైన స్టోరీలను ఎంచుకుంటాను

  నా మనసుకు నచ్చిన స్టోరీలనే నేను ఎంచుకుంటాను. ఆ స్టోరీ నా కోణంలో నాకు కరెక్ట్ అనిపించాలి. అది ఒరిజినల్ అయితే... అది మేము బాగా చెబితే... మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అది మంచైనా, చెడైనా, అగ్లీ అయినా.... స్క్రిప్టుల ఎంపికలో నా డిసైడింగ్ ఫ్యాక్టరే పూర్తిగా ఉంటుంది అని దుల్కర్ సల్మాన్ తెలిపారు.

  నన్ను చాలా బాధించాయి

  నన్ను చాలా బాధించాయి

  నాకు ఎంతో నచ్చిన ‘సోలో'లో రుద్ర స్టోరీ గురించి కొందరు వెక్కిరింపుగా, చెడుగా రాస్తున్నరాతలు నన్ను ఎంతగానో బాధించాయి... అని దుల్కర్ పేర్కొన్నారు.

  రియల్ సంఘటనలతో చేసిన సినిమా

  రియల్ సంఘటనలతో చేసిన సినిమా

  ఈ సినిమా చేసేపుడు నాతో పాటు నాజర్ సార్, హాసిని మేడమ్, నేహా అంతా ఎంతో ఎగ్జైట్ అయి చేశాం. ‘సోలో' సినిమా రియల్ సంఘటనలు, కొన్ని న్యూస్ స్టోరీ ఆధారంగా చేసిన సినిమా. వాటిని హ్యూమరస్ వేలో చెబితే బావుంటుందనే ఉద్దేశ్యంతో అలా చేశాం. కానీ కొందరికి ఇది నచ్చలేదు. దీంతో సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడుతున్నారు. సినిమాను చంపేస్తున్నారు, స్పిరిట్ దెబ్బ తీస్తున్నారు, మా దైర్యాన్ని చంపేస్తున్నారు.... అంటూ దుల్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

  ఐ బెగ్ యూ...

  ఐ బెగ్ యూ...

  ఐ బెగ్ యూ... డోంట్ కిల్ ‘సోలో'. ఓపెన్ మైండ్ తో సినిమా చూస్తే మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.... అంటూ దుల్కర్ సల్మాన్ వ్యాఖ్యానించారు.

  దర్శకుడికి నా పూర్తి మద్దతు

  దర్శకుడికి నా పూర్తి మద్దతు

  ఈ సినిమా విషయంలో నేను పూర్తిగా దర్శకుడు విజయ్ నంబియార్‌ను సపోర్టు చేస్తున్నాను. అతడి విజన్‌ను సపోర్టు చేస్తున్నాను... అని దుల్క్ వ్యాఖ్యానించారు.

  English summary
  "I beg you. Don't kill Solo. Give it a go with an open mind and you will have a blast with the film. I stand by Bejoy Nambiar. And his version. Always. Cutting, shuffling or whatever by persons unrelated to the making of the film will also aid in killing it." Dulquer Salmaan said.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X