»   »  ఆ హీరోయిన్ తో పోలిక తేవద్దు..నచ్చదు: సన్నిలియోన్

ఆ హీరోయిన్ తో పోలిక తేవద్దు..నచ్చదు: సన్నిలియోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సల్మాన్‌ఖాన్‌, ఐశ్వర్యరాయ్‌ నటించిన 'హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌' చిత్రంలోని 'డోలీ తారో ధోల్‌ బాజే...' పాటకు ఇప్పుడు సన్నీ లియోని స్టెప్పులేసింది. 'ఏక్‌ పహేలీ లీలా' లో ఈ పాట పెట్టారు. దీంతో ఐశ్వర్య, సన్నీ లియోనిల్లో ఎవరు బాగా చేశారనే పోలికలు మొదలైపోయాయి. ఇది సన్నీకి నచ్చ లేదు. ఈ విషయమై ఆమె మాట్లాడింది.

సన్నిలియోన్ మాట్లాడుతూ... ''కొత్తగా చిత్ర పరిశ్రమలోకి వచ్చినవాళ్లకు స్టార్‌లను చూస్తే గొప్పగానే ఉంటుంది. వాళ్లు నటించిన చిత్రాల్లోని పాటలను కొత్తవాళ్లు ఎంత బాగా చేసినా పాత వాటితో పోలుస్తారు. అది నాకు నచ్చదు'' అంటోంది సన్నీ లియోని.

అలాగే... ''ఈ పాట నా సినిమాలో ఉండబోతుంది అని తెలిసిన వెంటనే కంగారు పడ్డా. ఈ పాట విషయంలో ఐశ్వర్యరాయ్‌తో నన్ను పోల్చడం అస్సలు నచ్చలేదు. నేను ఆ పాట చూశా. అదే పాటలో నన్ను చూసిన ప్రేక్షకులు కచ్చితంగా 'సన్నీ బాగా చేసింది' అంటారు. నాకు అది చాలు''అని చెప్పింది సన్నీ. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

 sunny leone

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'ఏక్‌ పహేలి లీలా' మరిన్ని విషయాలకి వస్తే...

ఇక భూషణ్‌ కుమార్‌ నిర్మించిన 'ఏక్‌ పహేలి లీలా' సినిమాలో నటించేందుకు కొందరు పెద్దనటులు ముందుకు రాలేదని ఆ సినిమా దర్శకుడు బాబీఖాన్‌ వాపోయాడు. ఇంతకీ కారణమేమిటో తెలుసా ఇండో-కెనడియన్‌ అడల్ట్‌ స్టార్‌ సన్నీలియోన్‌ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తూ ముఖ్యపాత్ర పోషించడమేనట. మరో మార్గం లేక జయభానుషాలి, రజనీష్‌ దుగ్గల్‌, రాహుల్‌ దేవ్‌, మొహిత్‌ అహ్లావత్‌ వంటి నటులచేత సినిమా తీయవలసి వచ్చిందట.

సన్నీలియోన్‌ పోర్న్‌స్టార్‌గా చలామణి అవుతూ మాగ్జిం పేరుతో వచ్చిన 12 పోర్నోగ్రాఫిక్‌ సినిమాల్లో నటించింది. అందుకే పెద్దనటులు ఈమె వుండే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపడం లేదట. సన్నీలియోన్‌ గురించి తెలిసింది 2005లో జరిగిన ఎమ్‌టీవీ అవార్డుల వేడుకలో. దర్శకుడు మోహిత్‌ సూరి సన్నీలియోన్‌కి 'కలియుగ్‌' సినిమాలో కీలక పాత్ర చేసే అవకాశమిచ్చాడు.

ఆమె పదిమిలియన్‌ డాలర్ల పారితోషికం డిమాండ్‌ చెయ్యడంతో ఆ పాత్రను దీపాల్‌ షా కు ఇచ్చాడు. బిగ్‌ బాస్‌ రియాలిటీ షోలో సన్నీ పాల్గొన్నప్పుడు మహేష్‌ భట్‌ 'జిస్మ్‌-2' లో నటించే అవకాశమిచ్చాడు. తరవాత 'రాగిణి' సినిమాలో సన్నీ నటించింది.

''పెద్దపెద్ద నటులంతా నా స్క్రిప్టు బాగుందన్నారు. తీరా సన్నీ ద్విపాత్రాభినయం విషయానికొచ్చేసరికి వెనక్కుతగ్గారు. చూస్తుండండి! నా సినిమా విజయవంతమౌతుంది. సన్నీ డిమాండు మరింత పెరుగుతుంది'' అంటున్నాడు బాబీఖాన్‌.

English summary
Sunny Leone says she knows her version of Aishwarya Rai Bachchan’s ‘Dhol Baje’ cannot match up to the original superhit track but she still hates being compared to the actress.
Please Wait while comments are loading...